Pages

Sunday, 25 March 2012

ప్రకృతి కాంత





కోమలీ:       నీ పాట అరువు తీసుకునికదా అంతలా హొయలు పోతుందా    కోకిల. 

తలోదరీ:     నీ కులుకు అడిగి తెలుసుకుని   కదా అంతలా మురిసిపోతుందా మయూరం.

లతాంగీ:      నీ మేని కాంతి ఆస్వాదించి కదా అంతలా విచ్చుకుంటుందా అంభుజం.

పడతీ:         నీ పలుకు  అనుకరించి కదా అంతలా తెనేలోలుకుతుందా కీరం.

రమణీ:        నీ మందగమనం ఆపాదించుకొని కదా అంతలా రాజసం తెచ్చుకుందా ఐరావతం.

వెలదీ:         నీ నయన   మంజుల ద్వయం గాంచి కదా అంతలా జలకమాడుతుందా మీనం.

కొమ్మా:       నీ మేని సువాసనాఘ్రానించి కదా అంతలా భ్రమిస్తుందా   భ్రమరం.

వనితా:        నీ వయ్యారం వడసుకొని కదా అంతలా వగలుపోతుందా నదీజలం.

లలనా:        నీ లాలన ఆలంబనంగా  ఎంచి కదా అంతలా   మిడిసి పడుతుందా పంటపొలం.

ముదితా:     నీ ముద్రలు ముద్దాడికదా అంతలా తరువు తనువుపై విరులద్దడా వసంతుడు.

ముగ్ధా:        నీ చల్లని మోము చూసి మురిసి అంతలా కౌముదిని జగమంతా పరిచాడా శశాంకుడు.

ఇంతీ:          నీ కళ్ళ కాంతి సంగ్రహించే కదా కిరణాలను ప్రపంచమంతా పరచాడా భానుడు.

మనోహరీ:    నీ హృదయ విశాలతను చూసికదా అంతగా ఓరిమి తెచ్చుకుందా ధరణి.

చెలీ:            విధాత సృష్టించిన ప్రకృతి నీవు........     విశ్వధాత రచించిన ఆకృతి నేను.  

                  మనిరువురం ప్రభాత-విభాతములై .......  భావితరాలకు ప్రకృతిని పరిచయం చేద్దాం.



3 comments:

  1. ప్రకృతి తన అందాలనన్నీ కాంత నుంచి నేర్చుకున్నదే...అందుకే "ప్రకృతి కాంత" అన్నారు.
    అద్భుతంగా రాశారు.

    ReplyDelete
  2. నీ నయన మంజుల ద్వయం గాంచి కదా అంతలా జలకమాడుతుందా మీనం.
    MAm....
    నీ ముద్రలు ముద్దాడికదా అంతలా తరువు తనువుపై విరులద్దడా వసంతుడు....
    anni vaakyaalanu taladanne vidham gaa unnai....
    నీ ముద్రలు ముద్దాడికదా అంతలా తరువు తనువుపై విరులద్దడా వసంతుడు....mareeenu...
    ayithe...."anthalaa...""anthagaa" anna padaala sthanam lo nuthana padaalu viniyoginchiunte baavundedemo...anukunnanu... aa padaalu lekunna ... kavithaku shobha taggademo...naaku telisee...teliyakaa ...cheppanemo...pariseelinchagalaru....

    ReplyDelete