Pages

Saturday, 31 March 2012

నా చెలికాడు

అందంలో  చందురూడు, 
ఆదరణలో  ఆంధ్రభోజుడు,
మానస చోరుడు,  మన్మధ  రూపుడు,
అతనిమది  అతివల  కలల  నిధి.

మగసిరి  ఉట్టిపడే  ఆ  ధృడత్వం,
సొగసరి  ఇష్టపడే  ఆ  మృదుత్వం,
ప్రేయసి  మనసుపడే  ఆ  సాహసం.

తాపసి    కోరుకునే   ఆ  నిర్మలత్వం,
రూపసి   చేరుకునే   ఆ  కోమలత్వం,
సఖులు  కోరుకునే   ఆ  సన్నిహితం,
చెలులు  కలలుకనే  ఆ  సున్నితం.

కలతలేని  ఆ  నిరాడంబరం,
కళ్ళెం  లేని  ఆ  దానగుణం,
శత్రువుని  ఎదిరించే  ఆ  శూరత్వం,
ఎల్లలు  చెరిపేసే  ఆ  ధీరత్వం.

నడకలో  సాహసం,  నవ్వులో  సరసం,
నా  హృదిలో  ప్రణయం,  అతనితోనే  నా  జీవన  ప్రయాణం.

"సాహితీ కిరణం" మాస పత్రిక April 2012 లో ప్రచురితం.

No comments:

Post a Comment