ప్రతిస్పందన
నీ మేనిలోని వెచ్చదనం భానుని కిరణంలా......
నా తనువంతా ప్రసరిస్తుంది.
నీ కన్నుల్లో చల్లదనం మలయమారుతంలా ......
నా కన్నులను మూసివేస్తుంది.
నీ పెదవుల్లోని మధువుల వుధృతం .....
నా అధరాలపై వెల్లవేస్తుంది.
నీ మాటల్లో తియ్యటి వీణానాదం ......
నా మానస తంత్రుల్ని మీటుతుంది.
నీ పాటల్లో కోకిల ప్రియగానం ......
నా గొంతుకు కొత్త రాగాలు నేర్పుతుంది.
నీ ఉరకల్లో తుమ్మెద చిలిపిదనం ......
నన్ను సిగ్గులమొగ్గని చేస్తుంది.
నీ పరుగుల్లో చిరుత ఉరుకుదనం ......
నా కోర్కెల కళ్ళెం తెంచుతుంది.
ప్రియా, నీవు పంపే ఆహ్వానం రేపటి ......
నా ఆస్వాదానికి పునాది అవుతుంది.
చిత్రం,కవిత రెండూ చాలా బాగున్నాయండీ..
ReplyDeleteThank you Madam.
Delete