కలలు కల్లలౌతున్నాయి, కన్నీళ్లు ఔతున్నాయి, కాలిపోతున్నాయి, కరిగిపోతున్నాయి, కల్పనలౌతున్నాయి, కమ్ముకుంటున్నాయి.
ఇలా ........................
ఓ కల మదినుంది వ్యధని దూరం చేస్తుంది,
ఇలా ........................
ఓ కల మదినుంది వ్యధని దూరం చేస్తుంది,
మరాళమై.
ఓ కల అతి మనోహరంగా నర్తిస్తుంది,
మయూరమై ,
ఓ కల ఏమధుర భావన కోసమో నిరీక్షిస్తుంది,
చకోరమై.
ఓ కల అంధకారంలా అలుముకుంటుంది,
మేఘమై.
ఓ కల అల్లరిగా, ఆర్తిగా హత్తుకుంటుంది,
మిళిoదమై.
ఓ కల కొటివేలుగుల హరివిల్లులా వెలుగుతుంది,
మయూఖమై.
నాకు వచ్చే ప్రతి కలా మనస్సుతో మమేకమౌతుంది ,
మంజులనాదమై.
సఖా, ... నిన్ను .... ఇల కాంచలేక కలగాంచుతున్నా.
తోలిజాముననే నిను సాగానంపుతున్నా,
నడిరేయి నా వడి చేరమని ఆహ్వానిస్తున్నా.
(ఆశ మాస పత్రిక మే నెల సంచికలో ప్రచురితం)
(ఆశ మాస పత్రిక మే నెల సంచికలో ప్రచురితం)
మీ 'కల' బాగుందండీ!
ReplyDelete@శ్రీ
శ్రీ గారూ, ధన్యవాదాలు.
ReplyDelete