కడుపులో కదిలే పేగులకు తెలుసు ఆకలేమిటో,
అరచేతిలో రేఖలకి తెలుసు జీవితం ఏమిటో,
రాత్రికి తెలుసు చీకటి కాఠిన్యం ఏమిటో,
ధైర్యానికి తెలుసు తన సత్తువ ఏమిటో,
విధి తోస్తుంది తప్పు చేయమని,
మది చెప్తుంది ఒప్పు ఏమిటో,
బ్రతుకు తుప్పు పట్టింది...... అయినా, వెతల మరలు తిరుగుతున్నాయి.
ఓర్పు పడవ ఒటిదవుతుంది,
అయినా వివేకం పిల్లిమొగ్గలేస్తుంది,
బీదతనం ఉచ్చులా బిగుసుకుంటుంది,
లేమితనం మచ్చలా అచ్చు పడిపోతుంది,
ఆశ ఓ రేఖలా అడ్డు పడుతుంది,
దారిద్య రేఖ అంటే తెలుసా? నిన్ను దాటి పోయే రేఖ.
అదేమిటో తెలుసా ............... నీ కన్నీటి చారిక.
బాగుందండి ఫాతిమా గారు.
ReplyDeleteThank you madam.
Deletewow chaalaa baagundi andi..
ReplyDeletethank you.
ReplyDeleteఓర్పు పడవ ఓటు పడుతుంది,!? I think ..
ReplyDeleteOrpu padava Otidavutundi..
Savarinchagalaraa!?
chaalaa Baagaa vraasaaru. abhinandanalu.
thank you for correction.
ReplyDelete