Pages

Thursday 5 April 2012

నిరీక్షణ

అసలే  నీవు  ఆకాశానివి,  అలివికాని  అనంతానివి,
విలువైన  విశ్వానివి,  విల్లు  ధరించని  విలుకానివి,
నేనో  సాహసిని,  కానీ  అతిచిన్ని  సాలీడుని,
వెలుగు  దారాలను  వెతుకుతూ..... జిలుగుదారాలను  ఎక్కుతూ,
నీ కోసం  తపిస్తూ..... నిన్ను  చేరగలనని   ఆశిస్తూ,
వెన్నెల దారాలతో  నిన్ను  చుట్టివేయాలని,
పట్టు  దారాలతో  నిన్ను  కట్టి వేయాలని,
అనంతమైన  నిన్ను  అణువులా  చేసి,
గుండె  గుడిలో  బందీ  చేయాలని  నా  ఆశ.

దిగంతాలవరకు  ఆవహించిన  నీవు  దీనంగా  నా  ఉనికి  కోసం  విలపిస్తావు.
అంతవరకూ  ఈ జిలుగు  దారాలను  ప్రేమ  పాశాలుగా  చేసుకుని వేలాడుతూ  ఉంటాను.


                      ఏదో ఒక రోజు 

నా  నిరంతర  శ్రమ,  నా  అంతర ప్రేమ  నీవు  గుర్తిస్తావు,
నీ   అంతర్మధనం  శాంతించి  నువ్వు  మేఘమై  వర్షిస్తావు,
సృష్టి   సమతుల్యముతుంది,  నీవే  కిందికి  వంగి,
ఈ చిన్ని  జీవిని  ఆర్తిగా  హత్తుకునే  రోజు  వస్తుంది.



4 comments:

  1. ఓహ్..నిరీక్షణ మీకు ఉందా!?
    చాలా బాగుంది.

    మరి నా "నిరీక్షణ" చూడండి.
    http://vanajavanamali.blogspot.in/2010/11/vanajavanamali-kavithwa-vanamlovanaja_28.html

    ReplyDelete
    Replies
    1. ఆశను అక్షరామాలగా చేసి, చూపులను బాట పై సారించే "నిరీక్షణ". వలపుని తలపుని కలిపిన నిరీక్షణ తప్పక ఫలిస్తుంది.
      వనజ గారు, మీ భావప్రకటన చాలా బాగుంది.

      Delete
  2. తప్పక మీ నిరీక్షణ గుర్తిస్తారుగా:-)

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు పద్మార్పిత గారు.

      Delete