నీ రాకకై ఎదురు చూసిన "ఊర్మిళను"
నీ తలపుతో తపించిన " శకుంతలను"
నీ ఆనతో కానలకేగిన "అయోనిజను"
నీ పాద స్పర్శతో నాతియైన "అహల్యను"
నీ ప్రేమ నాకే చెందాలని సాధించిన "సత్యను"
నిను తులసి దళంతో తూకం వేసిన "రుక్మిణిని"
నీ పదాలనే పలవరించిన "మీరాని"
నీ సత్యపథంలో నడిచిన "చంద్రమతిని"
నీకు పరస్త్రీ వ్యామోహం వలదని పలికిన "మండోదరిని"
మూర్చిల్లిన నిను ముప్పునుండి తప్పించిన "నరకాసుర మర్దినిని"
నీ ప్రేమకై రేపల్లెను పొదరిల్లు చేసిన "రాధని"
నీవాడిన జూదంలో పావునైన "పాంచాలిని"
యుగాలు మారినా నీ "యువతినే", తరాలు మారినా నీ "తలోదరినే"
కలియుగంలోనూ నీ "కలికినే".
ఈ యుగం లో నీ ఉన్మాదానికి బలి అవుతున్న "అబలను".
రాక్షసంగా నీవు మారి నన్ను విగతను చేస్తున్నావు.
నా అంతం నీ అంతర్థానమే సుమా.
adbhutam....
ReplyDeleteWow.... Well said.......
ReplyDeleteఓ మంచి తెలివైన తెలుగింటి అమ్మాయ్, మీ బ్లాగ్ చూసాను. తెలివి తెలుగు రెండూ ఉన్నాయ్, కానీ అమ్మాయే కనపళ్ళేదు. ప్రశంసకు కృతఙ్ఞతలు.
ReplyDeleteKudos! I loved it! మీకు చప్పట్లు!
ReplyDeleteThank you very much.
ReplyDeleteవా....వ్!ఫాతిమా గారు, ఏమి రాసారండి,అత్యద్భుతం.పౌరాణికములో,రాచరికములో,నేటి కలియుగములో- స్త్రీ పై జరిగిన,జరుగుతున్న అన్యాయాన్ని/అణచివేతని సింపుల్ గా 13 లైన్లలో చక్కగా విశదపరిచారు.HATSOFF 2 U
ReplyDeleteThank you very much sir.
ReplyDeletemuurchillina ninu muppu nundi kapadina " Narakasura mardhi " ayyi undali fathima garu!.
ReplyDeletegood try!
Sir, thank you very much for suggestion. it is corrected accordingly.
ReplyDeleteMaanasa garu thank you
ReplyDeleteచాలా బావుంది.. ఫాతిమా గారు...
ReplyDeleteకిట్టు గారూ, ధన్యవాదాలు కవిత చదివిన మీకు.
ReplyDelete