నను గెలిచిన స్వప్నం
కవి మెచ్చిన చక్కని చరణం నీవు
రవి తెచ్చిన వెచ్చని కిరణం నీవు.
గగన వీధిలో కరిమబ్బువు నీవు,
హిమగిరిని మించిన సిరివి నీవు.
రాగాల రహదారిలో తెరువరి నీవు,
అనురాగాల రసగీతిలో తేటగీతివి నీవు.
ఎడారిలో చక్కటి పూతోటవు నీవు,
ఎండమావుల్లో చల్లటి నీటి తేటవు.
జీవిత పాఠంలో నిత్య నీతివి నీవు,
భవిత బాటలో సత్యహితవు నీవు.
మల్లెను మించిన మానసవు నీవు,
మంచిని పంచిన మానవతవు నీవు.
నిజాన్ని నమ్ముకున్న గొప్ప వ్యక్తివి నీవు,
నీతిని గెలిపించిన గొప్ప శక్తివి నీవు.
నిర్భాగ్యులకు నీడనిచ్చే వృక్షం నీవు,
నిజాయితీకి నిలువెత్తు సాక్ష్యం నీవు.
హంస వడకట్టిన పాలవు నీవు,
హింస వీడిన పరమహంసవు నీవు.
నా అంతరాన ఉన్న ఆశయం నీవు,
నను గెలిపించాల్సిన స్వప్నం నీవు.
super
ReplyDeleteThank you very much.
Deleteచాలా బాగుంది మీ కవిత
ReplyDeleteSir, ధన్యవాదాలు.
Delete