Pages

Tuesday, 24 April 2012

నా మది




నా మది

నీ  నిరసన  రుచి  చూసిన  నా మది  ఇలా  ఉంది;

అడవికాచిన  వెన్నెలలా ...
అనాఘ్రాత   పుష్పంలా  ...
అనిశ్చల  సరోవరంలా ...
సడి చేయని  శంఖంలా ...
నిరీక్షించని   చకోరంలా ...
అలిగిన  అభిసారికలా ...
రంగు  వెలసిన  హరివిల్లులా ... 
సువాసనలేని  కుసుమంలా ...

నీ  విరహం   రుచి   చూసిన  నామది  ఇలా  ఉంది; 
వెన్నెల  ఎరుగని  సోమునిలా ...
విరులు  పూయని  తరువులా ...
కొలను  తెలియని  మీనంలా ...
కదలలేని  కాలంలా ...
మెలిపడిన  ఇనప  తీగలా ...

నీ  ఆగమనం  చూసిన  నామది  ఇలా  ఉంది;
నర్తించిన  మయూరంలా ...
లిఖించిన  ప్రేమ  కావ్యంలా ...
తేనేపలుకుల  చిలుకలా ...
విరబూచిన  పూవనంలా ...

నడిచివచ్చిన వసంతంలా ఉంది.




12 comments:

  1. మీ కవిత చాలా బాగుంది! ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే నేను కూడా ఈ చిత్రాన్ని విరహానికి పెట్టాను ఒక టపాలో!

    ReplyDelete
    Replies
    1. రసజ్ఞ గారూ, కృతఙ్ఞతలు.

      Delete
  2. చిత్రం ఎంత బాగుందో , మీ కవిత కూడా అంతే బాగుంది. చాలా బాగా రాస్తారు ఫాతిమ గారు మీరు!

    ReplyDelete
    Replies
    1. జలతారు వెన్నెల గారూ. చాలా కృతఙ్ఞతలు.

      Delete
  3. వనజ వనమాలీ గారూ, కృతఙ్ఞతలు. మీ సూచనలకు సవరణలకు ప్రత్యెక కృతఙ్ఞతలు.

    ReplyDelete
  4. కవిత బాగుంది
    ప్రకృతి పరవశం వివశం
    విరహానికి ఆగమనానికి ఆపాదించిన తీరు
    రమ్యంగా ఉంది అభినందనలు

    ReplyDelete
    Replies
    1. Sir,
      మీ ప్రసంశకు ధన్యవాదాలు.

      Delete
  5. essay writing laa undi.

    keep trying!

    ReplyDelete
  6. కవిత చాల బాగుంది...
    రసజ్ఞ గారు చెప్పినట్లు...
    నా కవితలలో కూడా 'విరహిణి'గా
    ఎంచుకున్నది ఈ చిత్రాన్నే... :)
    @శ్రీ

    ReplyDelete
  7. శ్రీ గారూ,
    ముగ్గురి కవితలకూ ఒకే చిత్రం యాదృచ్చికం, అయినా చిత్రం బాగుంది. ప్రశంసకు కృతఙ్ఞతలు.

    ReplyDelete