Pages

Friday, 6 April 2012

చిన్నారి

బుల్లి  బుల్లి  అడుగులేసే  బుజ్జాయివి  నీవు,
చిట్టి  చిట్టి  పలుకుల  చిన్నారివి  నీవు,
చిరు  చిరు  తడబాటుల  తువ్వాయివి  నీవు,
కళకళలాడే  కన్నులమిన్నవు  నీవు,
నవనవలాడే  నట్టింట  సౌభాగ్యం  నీవు,
తళతళలాడే  ముంగిట  వెలుగువు  నీవు,
బుడిబుడి  అడుగుల  బుడతవు  నీవు,
మిలమిలలాడే  మేలిమి  బంగరు  నీవు,
మిసమిసలాడే  నుదిటి  కుంకుమ  నీవు,
కువకువలాడే  గువ్వ  పిట్టవు  నీవు,
విసవిసలాడే  విరుల  బుట్టవు  నీవు,
అలా  అలా  మెరిసే  అల్లారు  ముద్దువు  నీవు,
అవనిపై  వెలసిన  ఆడ  శిశువువు  నీవు,
అంబరాన్ని  మించిన  ఆలంబనవు  నీవు ,
సంద్రాన్ని మించిన  సంపదవు  నీవు,
నా  నట్టింట  నడయాడే  చిన్ని  దేవతవు  నీవు,

బ్రహ్మ  సృష్టివి  నీవు,  మాకు జన్మనిచ్చే  ప్రతిసృష్టివి  నీవు.

2 comments:

  1. చిరు చిరునవ్వుల నగుమొము తొ మీ బుజ్జి పాప ఎంతొ ముద్దుగా ఉందండీ,మీరు రాసిన కవిత ఆహ్లాదంగా ఉంది.

    ReplyDelete
  2. ధన్యవాదాలు.

    ReplyDelete