Pages

Monday, 7 May 2012

మార్పు


మార్పు


మార్పు

ఆకృతి  కొల్పొయిన నా మనస్సును కుదించి కుట్టేసుకున్నా... ఎంత COMFORT  గా ఉందో.

అస్తిత్వం కొల్పొయిన నా తలపులను వేటాడి బంధించాను... ఎంత CORRECT  గా ఉందో.

అలమటించే నా మదిని వేదననుండి వేరుచేశాను... ఎంత  HAPPY  గా  ఉందో .


అగోచరమైన  అభిమానాలను వెతకటం మానేశాను ... ఎంత DILUTE  గా  ఉందో .


నన్ను నేను  POSTMORTEM చేసుకుని, కొన్ని కొత్త కణాలను చేర్చుకుని, 

నేనున్న ఊహల సౌధాన్ని పునాదులతో సహా పీకి పారేశాను...  

అచ్చోట  కొత్త సమాధి కట్టుకుని దానిపై  రారాణిలా కూర్చుని, 

కొత్త తలపులతో ద్రోహపు తిమిరాన్ని చీల్చి,

స్నేహపు సమరాన్ని సాగిస్తున్నా ...ఎంత  DYNAMIC  గా ఉందో. 



                        

15 comments:

  1. కవితా సుమహారం చదువుతున్నా... ఎంత కమ్మగా వుందో :))

    ReplyDelete
    Replies
    1. హ..హ.. హా... నా చేతి వంట, నా కలం పంట అలాగే ఉంటాయి మరి. పెళ్లి అయ్యే వరకు అమ్మ చేతి వంట అక్క చేతి వంటా కమ్మగానే ఉంటాయి. Thank you. waiting for your another hilarious post.

      Delete
  2. "నేనున్న ఊహల సౌధాన్ని పునాదులతో సహా పీకి పారేశాను... అచ్చోట కొత్త సమాధి కట్టుకుని దానిపై రారాజులా కూర్చుని,"
    రారాణి లా అని అనకూడదాండి ఫాతిమాగారు? కవిత చాలా బాగుంది.

    ReplyDelete
    Replies
    1. వెన్నెల గారూ, సలహాకు ధన్యవాదాలు. మీ సలహా ప్రకారం సవరించాను.

      Delete
  3. Behind a successful man there is woman, they say. But I think there is a man behind a successful poetess!
    Thanks to him for a nice blog.

    ReplyDelete
    Replies
    1. Sir,Successful poetess? May Almighty accept your blessing. "Amin".

      Sir, Thank you very much for spending your valuable time to visit the blog and giving invaluable suggestions and encouragement.

      Delete
    2. Sir, Thank yo very much. ISMAIL.

      Delete
  4. ఫాతిమా గారు !
    కవిత ఎంతో బాగుంది
    తెలుగుభాషలో ఎంతో పద సంపద ఉన్నది
    ఆంగ్ల పదాలు తొలిగించి చూడండి
    ఇంకా ఎంత అద్భుతంగా ఉంటుందో

    ReplyDelete
    Replies
    1. సర్, మీ సలహా కు ధన్యవాదాలు. ఆంగ్ల పదాల ప్రయోగం ఇకపై ఆపేస్తాను.

      Delete
  5. చాలా బాగుంది. గర్వంగా ను ఉంది. కవి కులంలో ఓ.. నేచ్చెలివి అయినందుకు.
    ఓ..బాట..లో నడుస్తున్నందుకు. ముందడుగు వేస్తున్నందుకు.
    అభినందనలు.

    ReplyDelete
  6. వనజ గారూ, అత్యంత ఆనందంగా ఉంది మీ ప్రశంశ చూసి. మీరు నా ప్రతి కవితనీ చదివి, సునిశితంగా పరిశీలించి చక్కటి సూచనలు సలహాలతో నడిపించిన మీ సోదరిప్రేమ అనితరసాధ్యం. అతి తక్కువ కాలంలో నన్ను మీ నెచ్చెలిగా అనుకున్నందుకు ధన్యవాదాలు.

    ReplyDelete
  7. మీ పాట పోస్ట్ లను గమనిస్తే-తెలిసిపోతుంది-
    ఊహల సౌధాన్ని పునాదులతో సహా పీకి పారేశారని.
    రియల్లీ గ్రేట్

    ReplyDelete
  8. హరి గారూ,కవికి భావుకతకంటే భాద్యత ముఖ్యం అనిపించింది.

    ReplyDelete
  9. నేనున్న ఊహల సౌధాన్ని పునాదులతో సహా పీకి పారేశాను...
    అచ్చోట కొత్త సమాధి కట్టుకుని దానిపై రారాణిలా కూర్చుని,
    awesome...great lines..congrats Madam..

    ReplyDelete
  10. Sir, మీ పరిశీలనకు , ప్రశంసకు ధన్యవాదాలు

    ReplyDelete