Pages

Sunday, 6 May 2012

ఏం చేద్ద్దాం



పంపు నీళ్ళ  కొచ్చిన  యశోద  చీర  చిరుగుల్లోని వంపులు చూసే కసాయి బసవాన్ని....
అరటి మొక్కలా ఎదుగుతున్న మతిలేని చిట్టి తల్లి కస్తూరి ఎత్తులను చూసే రిక్షా చంద్రాన్ని ....
చదువులేని వాళ్ళని సరిపెట్టుకుందామా.

వేకువనే టూష న్ కి వెళ్తూ గుండెలకు పుస్తకాలూ అడ్డు పెట్టుకుని పరుగులు పెట్టే శ్రీవల్లిని సందు మలుపులో దారి కాసి సైకిల్  అడ్డుపెట్టి ముద్దులడిగే  సూరిగాడిని ....
టీనేజ్   అని  తీసి  పారేద్దామా.

కాగి పోతున్న  కూతురు ఒళ్ళు  కళ్ళ  ముందు మెదులుతూ  ఉంటె ....
పర్మిషన్  అడిగిన  వనజను పెన్ను కింద  పడేసి తీసి ఇవ్వమని జారిన  కొంగు చూసి చొంగ  కార్చే బాసు గాడ్ని ....
సభ్యత  లేదని సర్దుకు పోదామా.

రేషన్  బియ్యం కోసం క్యూలో నించున్న  కమల  చిరుగుల  లంగా సిగ్గు దాచ  లేకుంటే, చెమటతో తడిచిన  రవిక  పిగిలిపోతుంటే, దీక్షగా చూస్తున్న  డీలర్ గాడిని ....
అవివేకి అని వదిలేద్దామా.

రోజు కూలీ రంగమ్మ,  పాపకు పాలిస్తుంటే సిమెంటు బస్తాపై  బైటాయించి సొల్లు కార్చే మేస్త్రీ గాడ్ని .... 
దయదలచి దాటవేద్దామా.



ఇక  నా చేత  కాదు, చూడలేను నా అక్క  చెళ్ళెళ్ళ  అర్ధ  నగ్న  నిర్భాగ్యాన్ని,  వావి వరసలు, నైతిక  విలువలు తెలియని జనాలకు చెప్పటం నా చేత  కాదు.

కూడు ఇస్తాం, గూడు ఇస్తాం అనే నేతలు, చదువు ఇస్తాం, కొలువు ఇస్తాం అనే సంస్థలు ఉన్నాయి. 

సంస్కారం ఇస్తాం, సంస్కృతిని రక్షిస్తాం, ఆడ  కూతుర్లను గౌరవిస్తాం అనే నీతి కుటీరాలు, విలువల  విద్యాలయాలు రావాలి. 

ఆడ పడుచులను ఆదుకోవాలి  అన్న  ఆలోచన  కావాలి. 
అప్పటి వరకూ నేనిలానే ఘోషిస్తూనే ఉంటా.
                                                         
 







29 comments:

  1. చాలా బాగా చెప్పారు అక్కా ..
    >>సంస్కారం ఇస్తాం, సంస్కృతిని రక్షిస్తాం, ఆడ కూతుర్లను గౌరవిస్తాం అనే నీతి కుటీరాలు, విలువల విద్యాలయాలు రావాలి. <<
    నిజం, నిజం, పాటశాలలో పడే సంస్కార పునాదులే సంస్కృతిని రక్షిస్తాయి.

    ReplyDelete
  2. "ఏం చేద్దాం" అన్న మీ ప్రశ్నకి సమాధానం ఎప్పటికైనా దొరికి,

    "సంస్కారం ఇస్తాం, సంస్కృతిని రక్షిస్తాం, ఆడ కూతుర్లను గౌరవిస్తాం
    అనే నీతి కుటీరాలు, విలువల విద్యాలయాలు రావాలి"

    అన్న ఈ ఆకాంక్ష నెరవేరితే ఎంతో బాగుంటుంది కదా??

    ReplyDelete
    Replies
    1. Thank you రాజి గారూ. ఆ రోజు కోసం అందరం ఎదురు చూద్దాం.

      Delete
  3. ఇదే ఇదే ,ఇలాంటి writings అంటేనే చాలా చాలా ఇష్టమండి నాకు. ఊహాలోకాల్లో విహరించే సాహిత్యమ్కంటే,నిత్య జీవితంలో
    జరిగే విసయలపై, contemporary societyలో జరుగుతున్న అన్యాలపై, బడుగు జీవితాలపై, రాసే ఎ ఆర్టికల్స్ అయిన నన్నిట్లే ఆకర్షిస్తాయండి.
    చాలా చక్కగా -బడుగు స్త్రీల దీనావస్థను ,వ్యక్తీకరించారండి! ఇలాంటివి మరెన్నో మీ కాలము నుండి జలువరాలని మనసారా కోరుకున్తున్నానండి!
    నా profile ని ఒక్కసారి మీరు observe చేస్తే-Favourite Books:-. any writing encountering the evils in the society.నా ఆలోచనా లకు తగ్గట్టుగా మీ బ్లాగ్ ఉండండి.చాలా ఆనందంగా ఉండండి మీ బ్లాగ్లో ఇలాంటివి చూస్తున్నండులకు.please keep it up.
    ఇంకొక విషయం"http://vijayabhanukote.wordpress.com/"ఇందులో-ఎవరితో చెప్పుకోను-అనర్ టపా
    చదవండి .హృదయాన్ని కదిలించే,మనసు తరుక్కుపోయే టపా అండి అది .భాను గారు కూడా మీలాగే చక్కగా రాసారు.

    ReplyDelete
  4. fatima gaaru
    కలమునుండి జాలువారాలని అని అండి

    ReplyDelete
  5. ప్రతిరోజూ,ప్రతినిత్యం జరిగే తంతుని చాలా simple గా magnify చేసారండి!
    మీ సునిశితమైన OBSERVATION కి చెయ్యెత్తి నమస్కారము చేస్తున్నానండి!

    ఫాతిమా గారు, దయవుంచి WORD VERYFICATION తీసెయ్యండి.

    ReplyDelete
    Replies
    1. హరి గారూ , మీ ప్రశంస , సహృదయం నన్ను కదిలించింది ఇతరుల మంచి పనిని మేచ్చుకోవటానికి చాల విశాల హ్రిదయం ఉండాలి . ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు ఆలస్యంగా జవాబు ఇస్తున్నంకు అన్యదా బావించ వద్దు

      Delete
  6. ఫాతిమా గారు,
    "సంస్కారం ఇస్తాం, సంస్కృతిని రక్షిస్తాం, ఆడ కూతుర్లను గౌరవిస్తాం అనే నీతి కుటీరాలు, విలువల విద్యాలయాలు రావాలి." అవి ఒకరు నేర్పితే వచ్చేయి కాదేమో? సంస్కారం, సంస్కృతి, ఆడవారి పట్ల గౌరవం ఇవన్నీ కూడా పుట్టుకతో, తండ్రుల పెంపకం తో చాలా మటుకు అలవడుతాయి. ఏ ఇంట్లో అయితే చిన్నపటినుంచి ఒక అబ్బాయి, తన తండ్రి తల్లికి ఇవ్వల్సిన గౌరవం ఇస్తూ, సంస్కారవతంగా ఉంటే అబ్బాయి అవే నేర్చుకుని అలాగే భవిష్యత్తులో ఉంటాడు తను కూడా.. ఏ ఇంట్లొ అయితే ,ఆడావారిని పురుగు కంటే హీనం గా చూస్తారో, అలాంటి వాతావరణంలో పెరిగిన అబ్బయిలు కూడా అదే నేర్చుకుంటారు. మీరు ఆశ్చర్య పోయే ఒక సంఘటన మీతో ఏఏ రోజు పంచుకుంటాను. నా స్నేహితురాలి కూతురు ఎంతో తెలివైనది . తను 11th grade (Inter first year అనుకోండి) చదువుతున్నప్పుడు, ఆ అమ్మాయి Robotics club లో join అయ్యింది. తనకి ఎలాంటి టాస్క్ ఇచ్చినా తనకున్న పరిజ్ఞానం తో ఏ టీం లో ఉంటే ఆ టీం ని గెలిపించగల సత్తా ఉంది. సామన్యం గా ఇక్కడ కూడా girls in engineering తక్కువ , arts and sciences తీసుకునే అమ్మయిలే ఎక్కువ.అందుకని ఆ club లో ఎవరూ వేరే అమాయిలు కూడా లేరు. నాలుగు టింస్ form చేసి, నా స్నేహితురాలి కూతురుని ఒక టీం లొ ముగ్గురు అబ్బయిలతో వెయ్యడం జరిగింది. ఒక అమ్మాయి తో కలిసి పనిచెయ్యడం మిగతా ముగ్గురు అబ్బాయిలకు అంత గా నచ్చలేదు. ఆ టీంలో ఉన్నది ఇద్దరు Indian అబ్బాయిlu, ఒక american అబ్బాయి. రోజు ఆ అమ్మాయిని చాలా harass చేసేవారు ఎలాగైనా ఆ అమ్మాయి తనకు తానుగా వెళ్ళిపోయెట్టు చెయ్యాలి అని. అది కుదరక, ఒక రోజు ఎదో design ఆ అమ్మాయి suggest cheste adi వాళ్ళు తీసిపారేస్తే, ఆ అమ్మాయి అలా కొట్టిపారెయొద్దు, ఎందుకని naa design పని చెయ్యదో చెప్పండి అని నిలదీసింది. సమాధానం చెప్పలేక ఒక indian విధ్యార్ది ఇలా అన్నాడు.."Why don't you go back to the place where all the women came from(kitchen) and cook instead of eating our brains here"" అని...అసలు అలోచించండి, ఒకాసారి ఆ అబ్బాయి అలా మాట్లడతాడని కలలో అయినా అనుకోము మనము. ఇక్కడె పుట్టి, ఇక్కడే పెరిగి, ఇంట్లొ ఆ అబ్బాయి తల్లితండ్రులు ఇద్దరు ఉద్యోగాలు చేసుకుంటూ సమాజం లో గౌరవనీయులే! ఎక్కడ ఉంది లోపం? ఆ అబ్బాయి పెంపకంలోనా? నా స్నేహితురాలి కూతురు తర్వాత complain చెయ్యడం తో ఆ టిం వాళ్ళు గతిలేక తనతో కలిసి పని చెయ్యడం జరిగింది. వారి టీం కి first place కూడా వచ్చింది. మీ పోస్ట్ చదవగానే బాధ కలిగి ఈ విషయం గుర్తుకు వచ్చింది.

    ReplyDelete
  7. Replies
    1. వెన్నెల గారూ, నమస్కారం, మీ వెన్నెల ఇనుమడించింది "Super Moon" తో.
      మీరన్నట్లు సంస్కారం, సంస్కృతి మరియు ఆడవారిపట్ల గౌరవం చాలా మటుకు పుట్టుకతో, తలితండ్రుల పెంపకంతో వస్తాయి. సంస్కారవంతమైన కుటుంబంలో పుట్టి, మంచి తల్లితండ్రుల పెంపకంలో పెరిగిన ఎంతో మంది పిల్లలు సామాజిక పోకడలతో తప్పటడుగులు వేస్తున్నారు. ఇలాంటి పరిస్థితులలోనే వాళ్ళను సరిదిద్దే alternative కావాలి, అదే విద్యా వ్యవస్థ.
      మీరన్నట్లు అమ్మా, నాన్నా ఉద్యోగస్తులు అయినంత మాత్రాన పిల్లలకి సంస్కారం రాదు. సంస్కారానికి పునాది ఇంటివద్ద కొంతవరకు వేయగలరు. ఆ తరువాత విద్యార్థి దశలో అది పరిపక్వత చెందాలి. నీతి పాఠాలు,చరిత్ర గూర్చి సహవిద్యార్థుల పట్ల సంఘీభావం ఇవన్నీ పాటశాల దశలోనే అలవాడాలి.
      ప్రతి ఇంట్లో భిన్న ఆచార వ్యవహారాలు ఉంటాయి. అయితే, విద్యాలయాలలో వాటిలోని మంచిని మాత్రమె బోధించే బోధనాపటిమ రావాలి. ఈనాటి విద్యా వ్యవస్థలో అది లోపించిందేమో.

      Delete
  8. ఫాతిమా గారూ సంస్కారం కుటుంబం నుండే కాదు, పెరిగే వాతావరణం బట్టి వస్తుందండీ..ఆ పరిస్థితి మారడానికి ఎలాంటి రచనలే కావాలి.

    వార్డ్ వెరిఫికేషన్ తీసేయరూ...వ్యాఖ్య పెట్టడానికి సులువుగా ఉంటుంది.

    ReplyDelete
    Replies
    1. జ్యోతిర్మయి గారూ, కృతజ్ఞతలు. word verification తీసేసాను. అసౌకర్యానికి చింతిస్తున్నాను.

      Delete
    2. జ్యోతిర్మయి గారూ,
      "సంస్కారం కుటుంబంనుంచే కాదు పెరిగే వాతావరణం బట్టి వస్తుంది" ఇదే నేను చెప్పాలనుకుంది. నా అభిప్రాయంతో ఏకీభావించారు. కృతఙ్ఞతలు.

      Delete
    3. జ్యోతిర్మయి గారూ,
      "సంస్కారం కుటుంబంనుంచే కాదు పెరిగే వాతావరణం బట్టి వస్తుంది" ఇదే నేను చెప్పాలనుకుంది. నా అభిప్రాయంతో ఏకీభావించారు. కృతఙ్ఞతలు.

      Delete
  9. ఆమధ్య కాలంలో ఇలాంటి ఒక కుసంస్కార ఘటన గురించి news paper లో ఎవరో చదువుతుంటే,

    ఆ ప్రక్కనే ఉన్న ఒక పెద్దాయన ఇలా అన్నారు,
    పూర్వం బ్రహ్మ చర్యాశ్రమంలో అంతా గురుకులంలోనే నివసిస్తూ విద్యా బుద్ధులు నేర్చుకుంటూ ఉండే తరుణం లోనే ప్రతిరోజు 10 ఇండ్లకు వెళ్లి
    ఆహారాన్ని భిక్ష గా స్వీకరించటం అలవాటు చేసి ఆచరింప చేసేవాళ్ళు,
    అది మొదలు, ఏ స్త్రీనైనా అతని క్షుత్ బాధను తీర్చే మాత గా అన్నం పెట్టె అమ్మగా చూసే నైజం చిన్ననాటి నుంచే అలవడేది
    ఇప్పుడది లేదుగా! అని వారి మనో భావం (సమస్యకు మూలకారణం సూచింప చేసేలా) వ్యక్తం చేసారు,
    మీ post ఆలోచింప చేయటం మాత్రమె కాదు
    నిజమైన సంస్కారాలను అలవర్చే ఒక విప్లవాత్మక మార్పుకు నాంది కావాలని అభిలాషిస్తున్నాను
    ?!

    ReplyDelete
    Replies
    1. Sir,మీరు చెప్పింది అక్షరాలా నిజం. "గురుకుల వ్యవస్థ/విద్యావ్యవస్థ". విద్యతో పాటు వినయం,వివేకం, సంస్కారం, గురువులపట్ల గౌరవం, పెద్దలపట్ల విధేయత మరియు స్త్రీలపట్ల సత్ప్రవర్తన నేర్పెందుకే పూర్వకాలంలో రాజులు రాజకుమారులను గురుకులాలో విద్యనభ్యసించేందుకు పంపేవారు. ఆ వ్యవస్థే ఇప్పుడు చిన్నాభిన్నమైంది. మార్పు అనేది సహజమే అయినా అది నైతికవిలువలు పోకుండా ఉండాలి.

      Delete
  10. హరి గారూ నమస్కారం. మీ ప్రొఫైల్ ఇంతకూ మునుపే చూసాను. సమాజం లోని చెడు దూరం చేయాలని మీ ఆలోచనా విధానం హర్షణీయం. సమాజంలో స్త్రీ పట్ల ఉన్న చులకన భావం మారాలి. నా భావాలతో ఏకీభవించిన మీరు మంచి సలహాలతో సహకరించుతున్నందుకు ధన్యవాదాలు. స్త్రీల పట్ల ఎన్ని అరాచకాలు జరగటానికి ముఖ్య కారణం ఈ పిల్లలకు నీతి కథలు moral science తెలియక పోవటం. వారికి తెలిస్తే కదా స్త్రీలు ఎలా పూజింప బడ్డారో తెలిసేది. భాష మీద పట్టు ఉంటే కదా వారికి తెలిసేది.
    హరి గారూ, మీ స్పందనకు చాలా సంతోషం. భాను గారి టపా చూసి మీకు తెలియచేస్తాను. కృతఙ్ఞతలు.

    ReplyDelete
  11. సున్నితమైన భావాన్ని పలికించిన తీరు అద్భుతం. భగవంతుడు ఇంకా ఇటువంటి కవితలెన్నిటినో రాసే శక్తి నీకు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ.....

    ReplyDelete
  12. మీ వ్యాఖ్యకు స్పందనకు చాలా ధన్యవాదాలు.

    ReplyDelete
  13. మీ కవిత అందర్నీ ఆలోచింపజేసేదిగా ఉంది...
    సంస్కారం అనేది చదువుతోనో...వాళ్ళుండే చోటు వల్లనో రాదండి...
    ౩౦ ఏళ్ల క్రితం చదివిన రెండు లైన్స్ వ్రాస్తున్నానిక్కడ...
    "చేయి చాచి ఓ అభాగ్యురాలు దానమడిగితే....
    ఆమెకి చేసారు గర్భాదానం"
    పేద, బీద వయసు ఏమీ చూడకుండా స్త్రీ ని కించపరుస్తూ మాట్లాడటం
    వ్యాఖ్యలు చేయడం అలవాటైపాయింది లోకానికి...
    @శ్రీ

    ReplyDelete
  14. శ్రీ గారూ, మీరన్నట్లు పేద, ధనిక, వయసు తారతమ్యం లేకుండా స్త్రీ ని కించపరిచె వారికి తల్లీ, చెల్లీ, ఆడబిడ్డలూ గుర్తుకు రారేమో. స్త్రీ ని కించపరచటంలొ అన్నివయసుల వారూ ఉన్నారు. ఓ మహానుభావుడి వ్యాఖ్య నాకు గుర్తుకొస్తొంది. "Women are the architects of society" ఎంతమంది అర్థం చెసుకొగలరు.
    మీ స్పందనకు ధన్యవాదాలు.

    ReplyDelete
  15. Just now i saw this post....hats off to you! Really great one.

    ReplyDelete
    Replies
    1. thank you padmagaroo. your comment is inspiring.

      Delete
  16. నిజమేనండీ...అది వారి సంస్కార పేదరికం.. అలాంటి వాళ్ళను చూస్తూ కూడా పక్కన ఎంజాయ్ చేసె మరికొన్ని మూకలూ వుంటాయి.. ఎంత చెప్పుకున్నా మానని గాయాలివి...

    సమాజంలోని కుళ్ళును చూపే ఇలాంటి పోస్టులు మీనుండి మరిన్ని ఆశిస్తూ అభినందనలు....

    ReplyDelete
  17. వర్మగారూ, సమాజంలో కుళ్ళు ఎంతగా పెరిగిపోతుందో చెప్పాలంటే ఎక్కడికో వెళ్లక్కరలేదు మన చుట్టూ అడుగడుక్కి మనల్ని సవాల్ చేస్తూ కనిపిస్తున్నాయి. మీ కలం నుండి కూడా ఇలాంటివి ఎన్నో చదివాను నేను. థాంక్స్ కవిత చదివిన మీకు.

    ReplyDelete
  18. Current Education system is corporate business sytem. what can we expect from it? I can still remember my teachers from school who taught us some good things. Now a days no one gives respect to teachers and they do not have values. so what can they impart. Agree partly with Vanaja garu too, since parents are supposed to be initial teachers. Now a days people just know blame job.

    ReplyDelete