Pages

Wednesday, 29 January 2014

ఆశల భవిత.

    


    ఆశల  భవిత. 

     ఆమె గుండె మండుతుంది,గొంతు తడి ఆరుతుంది,
     బుగ్గలపై జారుతున్న కన్నీళ్లు ఎండిపోతున్నాయి. 

     గట్టిగా అరవాలనుంది, వీధిలోకి పరుగెట్టాలనుంది,
     నిద్రిస్తున్న నాగరీకులనందరినీ  నిలదీయాలనుంది. 

     చదువులమ్మ బడిలో అన్నీనీతిసూత్రాలే, సుమతివాక్కులె,
     సాయంత్రమైతే   కన్నతండ్రి  నోటినుండి అన్నీ బూతులే,

     చదువుల తల్లి  చేతిలో శభాష్ అనిపించుకున్న మార్కులచిట్టీ,
     తూలుతూ  వచ్చిన తండ్రి   చేతి వేలుముద్రకై పట్టిన కుస్తీ,

     చిరాకుపడ్డ  సగటు మనిషి  చిట్టీని   చింపి పారేశాడు,
     అడ్డమొచ్చిన  ఆలిని గొడ్డుని బాదినట్లు బాదేశాడు. 

     ఎగిరేపిట్టకి  ఉండేలు దెబ్బ తగిలినట్లూ...  ,
     వేల కీటకాలు  శరీరాన్ని  తొలుస్తున్నట్లూ..,

     నేలరాలిన ప్రతి కాగితపు ముక్కా వెక్కిరిస్తున్నట్లూ.... ,
     దిక్కులన్నీ ఏకమై  తనని  బురదలో ముంచేస్తున్నట్లూ..,  

     తన్నులు  తిన్న తల్లి  కన్నీటితో కలిసిన, 
     మెతుకులు తినిపిస్తుంటే,కుక్కి మంచంలో కునుకు తీసింది. 

     అవును  ఆమె చదువుల తల్లి, 
     రేపటి ఆడపిల్లలకి కల్పవల్లి, ఆశల దీపావళి.. 

     (మరో కొత్త ఉదయం ఆమెను నిద్ర లేపుతుంది,
     ఆశా భవిత  బడివైపు  అడుగులేయిస్తుంది )
  

22 comments:

 1. చదువులమ్మ బడిలో అన్నీనీతిసూత్రాలే, సుమతివాక్కులె, సాయంత్రమైతే కన్నతండ్రి నోటినుండి అన్నీ బూతులే,
  చదువుల తల్లికి ఎన్ని కష్టాలో .... ఆడపిల్లలకి రేపటి కల్పవల్లులకు, ఆశల దీపావళిలు .... కావడం అనివార్యం, అందుకే
  మనిషి నిజవర్తనలో పరివర్తన తప్పనిసరి అని .... ఒక చక్కని కవిత
  అభినందనలు ఫాతిమా గారు!

  ReplyDelete
 2. Good. ''kaduvaa sach''

  ReplyDelete
  Replies
  1. నిజమే సర్, ఇవి చేదు నిజాలే...

   Delete
 3. అవును ఇపుడు మనం చూస్తుంది కూడా అదే . కోపాన్ని దిగమింగడానికి ఇంట్లోని చిన్న కుక్క పిల్లని కొట్టడమో .. లేక
  అన్నిటినీ దిగమింగుకునే 'ఆలిని' బాదటమో పరిపాటయ్యింది
  సమాజం లోని సగటు మనిషికి .
  కవిత ఆసాంతం చాలా భారంగా తోచింది నా కెందుకో .
  వాస్తవికతను ఎంత బాగా చూపించారు మీ మాటల్లో .
  చాలా బావుంది మీ "ఆశల భవిత"
  - శ్రీపాద

  ReplyDelete
  Replies
  1. శ్రీపాద గారూ, ధన్యవాదాలు మీ స్పందనకు.

   Delete
 4. అవును మీరజ్, అటువంటి చదువుల తల్లుల ఆశలను నట్టేట ముంచి పాఠశాల సెలవు దినాల్లో బాల్య వివాహాలు చేసేసి వారి జీవితాన్ని అంధకారంలోకి నెట్టివేసి ఏదో ఘనకార్యం సాధించినట్లు వారి టీచర్ల వంక చూస్తున్నరు అవివేకులు అనేక మంది.

  ReplyDelete
  Replies
  1. పిల్లల్ని చదివినచటం కేవలం టీచర్లకే చెందినది అనే భావం ప్రబలి ఉంది సమాజం లో....

   Delete
 5. I am scared of these facts.
  Written heart touchingly.....I bow my head for u r able to feel their pain.

  ReplyDelete
  Replies
  1. అనూ , మీ సున్నిత మనస్సుకు మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.

   Delete
 6. Samajam lo jarige danini chalaa baagaa kavitvarikincharu.

  ReplyDelete
 7. మీరాజ్ గారు... సగటు భారతీయ పేద కుటుంబాల ఇంటి కథను కళ్లకు కట్టారు. మద్యం మహమ్మారిని తరిమేస్తే
  దేశం ఆటోమేటిక్ గా బాగుపడుతుందని నా ప్రగాఢ విశ్వాసం. కానీ.. ప్రభుత్వాలే తాగుబోతుల మీద పడి బతుకుతున్నప్పుడు..
  ఎథిక్స్ లేని సిద్ధాంతాలు చేస్తున్నపుడు... పిల్లల పరిస్థితి తలచుకుంటే గుండెబరువెక్కుతోంది. మీరు రాసిన ప్రతీ వాక్యంలోనూ
  మీ కళ్ల ముందు కనిపించిన సన్నివేశాలకు మీరు స్పందించిన విధానం.. అందులోని ఆవేదన స్పష్టంగా తెలుస్తున్నాయి.
  ఈ పోరాటంలో నా తరపున ఎలాంటి భాగస్వామ్యం కావాలన్న నేను ఈ క్షణం సిద్ధం... భారత దేశం వంద శాతం గ్యాడ్యూయేట్లు కలిగి ఉండాలన్న కల నాది.

  ReplyDelete
  Replies
  1. సతీష్ గారూ, మీ ఆలోచనా, ఆవేశమూ సరైనవే , కానీ మనం ఎంత మందిని మార్చగలం. చట్టాలలో మార్పు రావాలి,
   మీరన్నట్లు దిక్కుమాలిన ప్రభుత్వం ఎక్సైజ్ మీద కోట్లు సంపాదించుకుంటుంది,
   ఎన్న్ని కుటుంబాలు వీధిన పడుతున్నాయో,
   తలీదండ్రీ కొట్లాటల వల్లా చదువు సాగని చిన్నారులు పడే వాదన వర్ననాతీతం.
   మేము హోం వర్క్ చేయలేదని దండించినప్పుడు ఆ బిడ్డలు అమాయకంగా వారి తల్లిదండ్రుల తగవు గూర్చి చెప్తుంటే... వారిని ఎలా ఓదార్చాలో తెలీదు.ఇలాంటి వాతావరణం నుండి పారిపోయిన పిల్లలు క్రిమినల్స్ గా మారే అవకాశాలు ఉంటాయి.

   Delete
 8. చదువులమ్మ బడిలో అన్నీనీతిసూత్రాలే, సుమతివాక్కులె...

  సూత్రాలు వాక్కులు గానే మిగులుతున్నాయి...
  ఆచరణ అన్నదే చిరునామా లేని...

  మీ అక్షరాలన్నీ...
  అన్నివేళలా...
  మీ ఆవేదనను మోస్తూనే ఉంటాయి...
  సమాజపు చేతకానితనాన్ని వెక్కిరిస్తూ...

  ReplyDelete
  Replies
  1. నిజమే నండీ.. ఆవేదన ఎక్కువా ఆచరణ తక్కువా అయింది.
   నా చేతకాని (శక్తి లేని) తనాన్ని కప్పిపుచ్చుకోవాలంటే కొంత నింద సమాజం మీద వేయాలి కదా:-))

   Delete


  2. ఆ చేతకాని సమాజం లో ఇంచు మించు అందరం సభ్యులమే ...

   Delete
  3. కొంత వరకూ నిజమే..

   Delete
 9. వాస్తవాన్ని కళ్ళకి కట్టారు. కవిత బాగుందండి.

  ReplyDelete
  Replies
  1. ధన్యవాదాలు ప్రేరణాజీ.

   Delete
 10. కళ్ళతో చూసిన సంఘటలను మనసులో మదించి కవిత్వంగా మలచడం మీకే సాధ్యం ఫాతిమా గారు!

  ReplyDelete
  Replies
  1. కళ్ళతో చూసినవి పెన్నుకు పనికల్పిస్తాను సర్.
   మీ అభిమానానికి ధన్యవాదాలు

   Delete