Pages

Monday, 6 January 2014

తొలి పాఠం

           తొలి  పాఠం 

      ఇక్కడంతా అలజడి, 
      అలలలా  ఎగసిపడే  ఒరవడి. 

      ప్రేమలు  ఒలకబోసే  గారడి ,
      అనురాగాల  నటనా జడి. 

      కడుపునిండా అసూయను మెక్కీ ,
      తలల నిండా విషాన్ని కుక్కుకొనీ,
      నీ ముంగిట్లో  వేదాంతాన్ని కక్కుతారు. 

      మెత్తని  బురదపాములై,
      బొరియల్లోని కీటకాలై,
      తమ మజిలీలను మార్చేస్తుంటారు. 

      నిన్ను గాలిపటాన్ని చేసి ఎగరేసి,
      దారాన్ని తమవేలుకే ముడివేసుకొని,
      సరదాగా తల తుంచేస్తారు. 

      నీటిలో ముంచి  ఉడికించినట్లూ, 
      చీకటి బావిలోకి తోసినట్లూ,
      కబంద హస్తం నిన్ను  పిసికి పిండిచేసినట్లూ,

      నిరంతర బాధా,నిర్విరామ   క్షోభా,
      మనసంతా పొగ చూరినట్లూ,బతుకంతా నుసిరాలినట్లూ .... 
      వలయాలు, నల్లని వలయాలు  నిన్ను చుట్టుముట్టేస్తాయి, 

      ఒంటరిగా ఒదిగిపోతావ్, 
      నీ నీడకి నువ్వే బయపడతావ్. 
      చచ్చిపోవాలనిపిస్తుంది,  కానీ... కొంచం ఆగావనుకో,
      చావును వాయిదా వేశావనుకో... 

     అప్పుడు 

     నీ చుట్టూ ఉన్న పాత్రలూ, పాత్రదారులూ,
      కపట అభిమానాలూ,కలల్ల అనునయాలూ 
      వ్యర్దాన్నంతా  మూటగట్టుకొని   ఏకమై  కనిపిస్తాయి. 

      చచ్చి బతికిన నీవు,
      పిశాచ గణాలను  పసిగట్టె  నీవు,   
      మర్మమెరిగిన  మాయల పకీరువే.   

12 comments:

 1. తమ నీడను చూసి తామే భయపడేలా చేసి....సమాజం కపట సముదాయింపులూ , కంటి తుడుపు చర్యల్లో తలమునకలయి పోవడం నిజంగా దౌర్భాగ్యం ......మీరజ్ , కవిత ఎంతో మందికి తమ లోపలి స్వరూపాన్ని అద్దాన్ని పట్టి చూపినట్లుంది .

  ReplyDelete
  Replies
  1. మనిషి అంతమయ్యేవరకూ వేటాడే ఈ కపట పాత్రదారులు , తర్వాత కంటితుడుపుకు తయారవుతారు.
   దేవీ.,చాలా మందికి తెలుసు తమ స్వరూపాల వెనుక వికృత రూపాలు

   Delete
 2. ఇక్కడ, ప్రేమలు ఒలకబోసే, అనురాగాల నటనలు ఎన్నో.
  కడుపునిండా అసూయ, తలలో విషం నింపుకుని కక్కుతారు వేదాంతం.
  మజిలీలను మార్చేసుకుంటూ, నిన్నో గాలిపటాన్ని చేసి ఎగరేసి .... మరీ,
  నీవు ఉడికిపొతున్నట్లూ, చీకటి బావిలో ఉక్కిరిబిక్కిరౌతున్నట్లూ, నిరంతర బాధ, నిర్విరామక్షోభ .... మనసు పొగ చూరి, బతుకు నుసిరాలి .... వలయాలు, నల్లగా నిన్ను చుట్టుముట్టేస్తున్నట్లు
  నీ నీడకి నువ్వే బయపడేలా ఒంటరితనం. చచ్చిపోవాలనిపిస్తూ,

  నిజానికి ఈ కపట అభిమానాలూ, అనునయాలూ వ్యర్దాన్నే మూటగట్టుకొని బలంలా కనిపించే బలహీనలతలే! తస్మాత్ జాగ్రత్త అని అతిగా నమ్మి అమాయకంగా బలైపోతున్న ఎందరినో దృష్టిలో పెట్టుకుని రాసినట్లుంది.
  అభినందనలు మెరాజ్ గారు!  ReplyDelete
  Replies
  1. అతిగా నమ్మటమూ, అందరూ తనవాళ్ళే అనుకొవటమూ రెండూ తప్పే్,
   సర్, జీవితమే ఓ పెద్ద పుస్తకం దాన్ని చదివే ఓపికా, దైర్యమూ కావాలి.

   Delete
 3. madam evarimeeda intha kasi ila kuripincharu screen meedha by narayana murty tata

  ReplyDelete
  Replies
  1. నారాయణ మూర్తిగారూ, బహుకాల దర్శనం,
   నా కసి ఎప్పుడూ అసామాజిక ,అసాంఘిక చర్యల మీదనే.

   Delete
 4. ఫాతిమా గారు. ....
  మీ తొలి పాఠం ..
  ఆది లోనే గుండెను పిండేసింది.
  ఈ బ్రతుకనే బాటలో ఎన్ని మజిలీలు ఉంటాయో , ఎంతటి వేడి నిట్టూర్పులు
  ఉబికివస్తాయో... హృదయానికి హత్తుకు పోయేలా చెప్పారు.
  " ఒంటరిగా ఓదిగిపోతావ్
  నీ నీడకి నువ్వే భయపడతావ్
  చచ్చిపోవాలనిపిస్తుంది .. కాని
  కొంచెం ఆగావనుకో .....
  చావుని వాయిదా వేశావనుకో "
  ఇలా రాయడంలో మీరే తగును. నాకు బాగా నచ్చిన కవిత ఇది
  - శ్రీపాద

  ReplyDelete
  Replies

  1. శ్రీపాద గారూ, నిజమే కదా, చావును వాయిదా వేస్తే, ఆలోచించే సమయం దొరుకుతుంది కదా,
   కవిత మీకు నచ్చినందుకు ధన్యవాదాలు,

   Delete
 5. "ప్రేమలు ఒలకబోసే గారడి
  అనురాగాల నటనా జడి."

  తెలుసుకోకుంటే జీవితములో అంతా అలజడే!!!!
  చాలా రోజుల తరువాత ఒక నర్మ గర్భితమైన కవితను చదివాను,బేటి.

  ReplyDelete
  Replies
  1. సర్, చాలా కాలానికి దర్శనమిచ్చారు,
   తండ్రిలాంటి మీ అభిమానం చాలు ఇంకా ఎన్నో రాయగలను.
   సదా మీ ఆశ్శీస్సులు కోరుతూ..మీ బేటీ.

   Delete