Pages

Wednesday, 15 January 2014

ఆశ

     

    ఆశ 

     ఆకలితో జీవశ్చవాల  
     అడుగులు తడబడుతున్నప్పుడు.

     ఎక్కడినుండో  కొన్ని నవ్వులు ఎగిరొచ్చి 
     వారిని పలకరిస్తున్నాయి. 

     రోడ్డుపై   విసిరేసిన   పేదరికాన్ని,
     ఓపిగ్గా చేతిలోకి తీసుకున్నాయి.

     ఆకలి ఆక్రందల్నీ,బాధల భావోద్వేగాలనీ,
     జీవన పట్టాలనీ,తప్పుల చిట్టాలనీ,  
     సరిచేస్తున్నాయి,

     కొండల్ని మింగే  గండు చీమలనీ,
     ఇసుకమేటల ఎత్తుపల్లాలనీ,
     ఊడ్చి శుభ్రం చేస్తున్నాయి.

     మానవ సరోవరం లో కూడా,
     మొలకెత్తే మంచితనాలు 
     కనిపిస్తున్నాయి.

     అంతరంగం లో అలజడి మొదలై,
     బాహ్య  ప్రపంచానికి  తమ వంతుగా,
     బాటనేస్తున్నాయి.

     ఇప్పుడిప్పుడే అంకురిస్తున్న చిరుమొలకలై,
     తడికోసం  తపిస్తున్న బీజాలై,
     జనకోటికి  జీవన  ఏరులై పారుతున్నాయి.16 comments:

 1. All that glitters is not GOLD :)

  ReplyDelete
  Replies
  1. ఇప్పుడు బంగారం కూడా మెరవటం లేదు సర్.

   Delete
 2. మెరాజ్ గారు... ఆశ మా చెడ్డదండి.. అందరినీ ఊరిస్తుంటుంది. కొందరికది ఆశ, మరి కొందరికి నిరాశ. కానీ.. ఆశలు నిజం
  చేసే చిరునవ్వులు కొంత మందికి చాలా అవసరం. అత్యాశ పరుల అతిలో ఒక్క శాతం పేదరికానికి ఇచ్చినా... భారత దేశంలో
  ఉన్న ప్రతీ ఇంటికి 5న్నర లక్షల రూపాయలు ఇవ్వొచ్చట. ఇది ప్రభుత్వం వారు చెప్పిన నల్లధనం లెక్కేనండోయ్. భారత దేశంలో
  పేదలు ప్రత్యేకంగా లేరండి. మన వాళ్లను బలవంతంగా పేదలుగా మార్చాయి... మన ప్రభుత్వాలు, కార్పోరేట్ దురాశాపరులు
  అంతే. అసలు పోరాటం అక్కడ చేయాలండి. మొత్తం సెట్ అయిపోతుంది. మరీ ఎక్కువ మాటాడుతున్నానా మేరాజ్ గారు...

  ReplyDelete
  Replies
  1. ఆశ చాలా బాగుంటుంది.ఊరటనిస్తుంది, కానీ కనుచూపుమేరలో ఫలితం కనిపిస్తాలేదు.
   అయినా ఆశిద్దాం ,(ఆశయిద్దాం )

   Delete
 3. ఆశలు ఉంటాయి అందరికీ, నెరవేర్చుకోగలిగేవారు కొందరే కదా...

  ReplyDelete
  Replies
  1. నిజమే ప్రేరణ గారూ, కొందరికైనా నెరవేరితే ధన్యమే...
   మీ స్పందనకు ధన్యవాదాలు

   Delete
 4. మనిషిలో ఇంకా ఏ మూలో మానవత్వపు మిణుగురు లున్నాయి దీదీ.
  అవింకా అన్నివైపులా ప్రాకి ప్రకాశింప చేస్తే ప్రతి జీవికీ వెలుగుకై ఆశపడే అవసరమే రాదు.
  మానవత్వపు బీజాలు వృక్షాల్లా ఎదగాలని ఆశిస్థూ....

  ReplyDelete
  Replies
  1. మానవత్వం ఉంది, దాన్ని బ్రతనిస్తే ఎదగనిస్తే చాలు,
   తమ్ముడూ మీ స్పందనకు థాంక్స్.

   Delete
 5. మానవ సరోవరంలో మానస సరోవరం వెలిస్తే ......ఆశ మొదలవుతుంది .మెరజ్ కవిత బాగుంది .

  ReplyDelete
  Replies
  1. కాదు దేవీ...మానస సరోవరం లో మానవత్వం వెలగాలి.
   ఆశిద్దాం ఎదురుచూద్దాం .

   Delete
 6. తడికోసం తపిస్తున్న బీజాలై,
  'ఆశ'ని అద్భుతంగా వివరించారు.

  ReplyDelete
  Replies
  1. సహజ గారూ, నా బ్లాగ్ కి స్వాగతం.
   ధన్యవాదాలు.

   Delete
 7. "ఇప్పుడిప్పుడే అంకురిస్తున్న చిరుమొలకలై,
  తడికోసం తపిస్తున్న బీజాలై,
  జనకోటికి జీవన ఏరులై పారుతున్నాయి."

  అక్షరాలా నిజం మీ మాటలు !

  మనిషి జీవిత బాటలో కలలను కలలుగా కాక... ఆశలు చిగురించారు !
  ఈ కలలన్నీ బాగా పండుతాయన్న సంకల్పం ఎప్పుడూ బ్రతికే ఉండాలి ......
  మీ కవితల్లో బాగా నచ్చిన కవత ఇది

  ఇలాంటి రచనలు ప్రజల మధ్యకు రావాలి . అప్పుడైనా కొంత చైతన్యం రావొచ్చు . మంచి కవితను అందించినందుకు అభినందనలు మీకు ఫాతిమా గారూ - శ్రీపాద

  ReplyDelete
  Replies
  1. రచనలు ప్రజల మద్యకు రావటానికి నేనింకా సాహిత్య పరంగా ఎదగాలేమో శ్రీపాద గారూ,
   అయినా బ్లాగ్ మిత్రుల ఆశ్శీస్సులు , అభిమానం,స్పందనలూ తక్కువేమీ కాదు, అవే పదివేలు.

   Delete
 8. ఆకలి అడుగులు తడబడుతూ. నవ్వులు కొన్ని ఎగిరొచ్చి పలకరిస్తున్నాయి.
  రోడ్డుపై విసిరేసిన పేదరికం .... ఆకలి ఆక్రందనల, బాధల భావోద్వేగాల జీవన పట్టాల తప్పుల చిట్టాలు సరిచేస్తూ ....
  అంతరంగం లో అలజడి మొదలై, అంకురిస్తున్న చిరుమొలకలకు, తడికోసం తపిస్తున్న బీజాలకు, జనకోటికి జీవన ఏరులై పారుతూ మానవ సరోవరం లో మొలకెత్తిన మంచితనాలూ కనిపిస్తున్నాయి.

  చక్కని అబ్సర్వేషనల్ పోయెట్రీని చదువుతున్నట్లుంది. అభినందనలు మెరాజ్ గారు!!

  ReplyDelete
  Replies
  1. సర్, మీ కంటి స్కాన్‌ దాటి పోదు నా కవిత.
   మీరు బాగుందీ అంటే సంతొషమే.

   Delete