Pages

Sunday, 12 January 2014

కాకినైనా... కాకపొతిని.

   

    కాకినైనా... కాకపొతిని. 

     గుడిసె ముందు  గువ్వలా..,
     కరువునెలపై రాలిన  ఎండుటాకులా ...,

     గుమ్మానికి  కట్టిన  నాటి  తోరణం లా..,
     పసుపు లేక వెలవెల బోయిన గడపలా..,

     అప్పటి  తప్పతడుగుల గురుతులింకా  
     గుమ్మం లో ఆరబొసుకుంటూ..,

     పసుపు కుంకుమల  నుదుటి నింకా,
     తడిమిచూసుకుంటూ..,

     రెక్కలొచ్చి ఎగిరెళ్ళిన   పిల్లలకై  ఎదురుచూస్తూ,
     జీవిత బాగస్వామి జ్ఞాపకాన్ని నెమరేసుకుంటూ..,

     ప్రతి పండక్కీ  తనకు తానె  అతిధిననుకుంటూ,
     ఎన్నాళ్ళ నుండో,చావును ఓడించాలనుకుంటూ..,

     కానీ,

     గమ్యం తెలీని ఈ జీవన ప్రయాణం లో ,
     కలసి కన్నీటిని  పంచుకొనేదెవ్వరో.. ?

     ఒకవేళ   తన  మరణమే అనివార్యమైతే,
     తనని మట్టి గర్బంలో  జారవిడిచేదెవ్వరో.. ? 

     (మనం కాకులమైనా బాగుండేది కదా ... 
     చెలిమి  నేర్పి చెంత  చెర్చుకొనేవీ) 

     (పండగ  పూట  ఒంటరిగా ఉన్న ఆత్మీయులను  గుర్తించి పలకరించండి  
     వారి దీవెనతో మీ పండుగ  ఆనందంగా సాగుతుంది) 23 comments:

 1. పసుపు కుంకుమల నుదుటి నింకా తడిమిచూసుకుంటూ.
  ప్రతి పండక్కీ తనకు తానే అతిధిననుకుంటూ,
  ఎన్నాళ్ళ నుండో చావును ఓడించాలనుకుంటూ......మీరాజ్ గారు heart touching words

  ReplyDelete
  Replies
  1. పద్మా,ధన్యవాదాలు.

   Delete
 2. పండగ పూట ఒంటరిగా ఉన్న ఆత్మీయులను గుర్తించి పలకరించండి వారి దీవెనతో మీ పండుగ ఆనందంగా సాగుతుంది . ఈ వాక్యాలు నిజంగా ఎంత ఓదార్పునిస్తాయో మెరజ్ ,మనసును తాకింది .

  ReplyDelete
 3. Replies
  1. వర్మగారూ,థాంక్స్.

   Delete
 4. " గమ్యం తెలీని ఈ జీవన ప్రయాణం లో ,
  కలసి కన్నీటిని పంచుకొనేదెవ్వరో.. ?

  ఒకవేళ తన మరణమే అనివార్యమైతే,
  తనని మట్టి గర్బంలో జారవిడిచేదెవ్వరో.. ? "

  సమిష్టి మరుగవుతూఒ వ్యష్టి మిగులుతున్న స్తితిలో...

  రాను రాను పండుగలు కూడా ఒంటరవుతాయేమో.....!

  ReplyDelete
  Replies
  1. పండగల కళ,కళలు అయినవారి ఆఅత్మీయతల మద్యనే కదా సర్,
   రాను,రానూ అదీ కరువవుతుంది.

   Delete
 5. పండగ పూట ఒంటరిగా ఉన్న ఆత్మీయులను గుర్తించి పలకరించండి
  వారి దీవెనతో మీ పండుగ ఆనందంగా సాగుతుంది .
  All i need their blessings as you said

  ReplyDelete
  Replies
  1. తప్పకుండా మీకు వారి దీవెనలు అందుతాయి.
   మనస్పూర్తిగా వారిని పలకరించండి.

   Delete
 6. ఎదుటివారి బాధకి స్పందించే మనసుంటే కష్టమే! మనసును బండరాయిలా చేసుకుని బతికేస్తున్నాం.

  ReplyDelete
  Replies
  1. శర్మా సర్, ధన్యవాదాలు

   Delete
 7. అక్షర సత్యాలు మేరాజ్ గారు. రియల్లీ... అప్పుడప్పుడు నేను, మా ఆవిడ వృద్ధ మానసిక రోగుల ఆశ్రమానికి వెళ్తుంటాం. వారికి బట్టలు, వగైరా ఇవ్వడం మాకు అలవాటు. ఇలాంటి స్థితి రావడానికి కారణాలను విశ్లేషిస్తూ వాళ్లతో చాలా ఓపిగ్గా మాటాడుతుంటాం. పిచ్చి వాళ్లలా వాళ్లు అరిచే అరుపుల్లో వారి జీవితంలో మానసిక వేదనకు గురిచేసిన సంఘటనల ఆనవాళ్లు కనిపిస్తుంటాయి. సగానికి పైగా పెద్దవాళ్లు పిచ్చివాళ్లుగా మారడానికి కారణం.. సొంతవాళ్ల నిరాదరణే అని తెలిసింది. ఏకాకులలా ఎక్కడో ఆశ్రమాల్లో దిక్కులేని పక్షుల్లా వాళ్లను చూస్తే... దేనికీ చెదరని, బెదరని నా గుండె నుంచి కంటతడి ఉబుకుతుంటుంది. అక్కడి నుంచి కన్నీళ్లతోనే ఇద్దరం బయటపడతాం. పండుగంటే కలిసి ఉండటం... అంతేగానీ ఆర్భాటాల ఆత్రాలు కాదని అలాంటి చోటికి వెళ్లినపుడు స్పష్టంగా తెలుస్తుంటుంది. మేరాజ్ నిజమైన పండుగ అంటే ఏంటో మళ్లీ గుర్తుచేశారు. థాంక్యూ...

  ReplyDelete
  Replies
  1. మీరు తెలీని ఇంకో నగ్న సత్యం ఉంది, అదేంటంటే... మీరు చూసిన ఆ వృద్దులు చాలా అదృష్ట వంతులు ,
   కనీసం ఆశ్రమం లో తోటి ముసలివాళ్ళయినా ఉంటారు,
   అందులో చేర్చిన తనయు(తనయ)లు మంచివారికిందే లెక్క కట్టాలి.
   కొందరు అలా చేస్తే సమాజం లో వారి కీర్తి మంట కలుస్తుందని.
   ఇంట్లోనే ఉంచి తమ బార్యా బిడ్డలతో పండగ చేసుకుంటూ..
   అందరి మద్యా ఉన్నా తల్లిదండ్రులకు ఒంటరితనాన్ని రుచి చూపిస్తున్నారు.మీ దంపతుల ఔదార్యానికి నా మనస్పూర్తిగా అభినందిస్తున్నాను.

   Delete
  2. అవును మీరు చెప్పింది నిజం... అబ్బే అదేం ఔదార్యం కాదండి. మా తల్లిదండ్రులు మాకు చిన్నప్పటి అలవాటు చేసిన ధర్మగుణం. ధర్మో రక్షతి రక్షితః అంటారు కదా. దానర్ధం ధర్మాన్ని రక్షిస్తే ఆ ధర్మం నిన్ను కాపాడుతుందని. కానీ.. అది కాదటండీ దాని అసలర్ధం. ధర్మాన్ని నువ్వు ఆచరిస్తే ఆ ధర్మం నిన్ను కాపాడుతుందని అట. పెద్దవాళ్లను సముచితంగా గౌరవించడం అనే ధర్మాన్ని కుల, మత బేధాలు లేకుండా చేయాలన్న సనాతన వైదిక ధర్మాన్ని చిన్నప్పటి నుంచి ఆకళింపు చేశారు.మా పెద్దలు మానవ సేవ చేసి, అదే మాధవ సేవ అని మా చేత కూడా చేయించి.. అదో అలవాటుగా మార్చారు. మీరు చెప్పినట్టు తల్లిదండ్రులను తృణీకరించినవారు
   బతికున్నా చచ్చిన శవాలతో సమానం. వారిని సమాజం వెలివేయాలి.

   Delete
  3. సమాజమే వారి చేతుల్లో నడుస్తుంది.
   మరోమారు అభినందనలు మీకు.

   Delete
 8. మనసుని కదిలించేలా రాసారు....
  గమ్యం తెలీని ఈ జీవన ప్రయాణం లో ,
  కలసి కన్నీటిని పంచుకొనేదెవ్వరో.. ?

  ఒకవేళ తన మరణమే అనివార్యమైతే,
  తనని మట్టి గర్బంలో జారవిడిచేదెవ్వరో.. ?
  నాకే కనుక శక్తి ఉంటే...ఈ పరిస్తిత్ని ఎవ్వరికీ రానీయను.....
  u always inspire us....

  ReplyDelete
  Replies
  1. మీకు సున్నిత మనస్సుంది, అది చాలు.
   మీ స్పందన వెయ్యేనుగుల బలాన్నిస్తుంది నాకు అనూ,

   Delete

 9. పసుపు కుంకుమల నుదుటి నింకా, తడిమిచూసుకుంటూ...., రెక్కలొచ్చి ఎగిరెళ్ళిపోయిన పిల్లలు, జీవిత బాగస్వామి జ్ఞాపకాన్ని నెమరేసుకుంటూ....,గుడిసె ముందు గువ్వలు.., కరువునెలపై రాలిన ఎండుటాకులు ...,
  కలసి కన్నీటిని పంచుకొనేదెవ్వరో....?
  ( మనం కాకులమైనా బాగుండేదేమో .... చెలిమి నేర్పి చెంత చెర్చుకొనేవేమో)
  (పండగ పూట ఒంటరి ప్రాణుల్ని గుర్తించి పలకరిస్తే వారి దీవెనతో పండుగ ఆనందంగా సాగుతుందేమో)

  ఒక చక్కని ఆలోచన ఊరట కలిగించలేక పోయినా మనసు కుదుటుపడేందుకు తోడు జీవాలున్నామని గుర్తు చెయ్యడంలో ఉపశమనం కలుగుతుంది.
  అభినందనలు మెరాజ్ ఫాతిమా గారు!

  ReplyDelete
 10. "మనం కాకులమైనా బాగుండేది కదా ...
  చెలిమి నేర్పి చెంత చెర్చుకొనేవీ"..... అమోఘమైన మాటలివి .
  మీ కవిత లోని ప్రతి వాక్యంలో అర్ధం ఉంది, ఆవేదనా ఉంది.
  సమాజం లో మార్పు రావాలంటే ఇలాంటి రచనలు ప్రజల మధ్యకు రావాలి . అప్పుడైనా కొంత చైతన్యం రావొచ్చు . మంచి కవితను అందించినందుకు అభినందనలు మీకు ఫాతిమా గారూ - శ్రీపాద

  ReplyDelete
 11. ప్రతి పండక్కీ తనకు తానె (ఆహ్వానం లేని) అతిధిననుకుంటూ...

  ఇంతకన్నా బాధతో
  బరువెక్కిన బ్రతుకుంటుందా...
  ఇదంతా చదివిన
  ఏ మనిషికైనా చలించని మనసుంటుందా

  ప్రతి పదంలో మీ ఆవేదన...
  సాయం చేయలేకపోతున్న అశక్తతతో...
  కాకినైనా కాకపోతిని...
  అంటూ ఆక్రందన...

  సమాజానికి కలుగుతున్న మార్పులు
  నిజంగా కలవరపరుస్తున్నై
  ఎలా...ఏం చేయాలి అనుకునే మనషులకు
  జవాబు దొరకని ప్రశ్నలుగా మిగుల్తున్నై...

  మేడం గారూ...
  మీ పోస్ట్ లన్నీ సామాజిక
  మంచీ చెడుల విశ్లేషణలే...
  జవాబును వెదికే శోధనలే...
  ReplyDelete
 12. రావ్ గారూ, నా బ్లాగ్ కి స్వాగతం.
  ధన్యవాదాలు మీ స్పందనకు.

  ReplyDelete
 13. ఆ మనసుల వేదనని ఆవేదనని
  కాకినైన కాకపోతిని
  అనే ఒక్కే ఒక్క లైన్లో తెలియచేసారు

  జీవితాన్ని మోస్తూ
  తన బిడ్దల జీవితాలకు చేయుతనిస్తూ..
  వాళ్ళ మార్గాలకు పూలబాటలు పరిచి
  ...
  కన్నబిడ్దల అకలికి కూలికి కూడా వెనుకాడకుండా
  వారి ఆనందాల ముందు ఆదమరిచి అలసట మరిచిపోగా ..
  కాలమే కదిలిపోగా ..
  కష్టమే ఇక కష్టమవగా ..
  పేగు పంచినా.. బిడ్డ కూడా పెట్టడాయే ముద్ద నోట .

  చిన్ని పాదాలకు నడకనేర్పి
  ఆ బుడిబుడి అడుగులకు ఎదురుచూసి
  ఎదనే ముళ్ళు లేని ఎడారిల మలిచినా
  మోయలేని బారాన్ని ... మిగులుస్తునారు మోదిబారిన మరి కొందరు..

  రెక్కలోచినా ....
  రెక్కలించిన తలిదండ్రులను లెక్కచేయక
  రేపు వచ్చే రోజులో వారి రెక్కలే అలసిపోగా .... అప్పుడు గుర్తుతేచుకుంటారో ఏమో ..

  అహంకారాన్నే అబరణంగా మలుచుకొని
  అత్మీయతలను మరిచిపోయి ....
  అనుబంధాలను ,రక్తసంబందాలను అనాధలుగా మిగులుస్తున్న
  ప్రతిఒక్కరు
  నిజమైన అనాధలు
  .............................
  జీవితమనే పుస్తకంలో ఎన్నెనో జీవితాల చివరి పజీలొ నిండివున్న
  గుండెకోతను
  గుండెకి తాకేలా ... కదిలిన మీ కాలానికి ......./\...... !!

  ReplyDelete