Pages

Wednesday, 1 January 2014

అరుదెంచే కాలమా...

       
         అరుదెంచే కాలమా... 

            ప్రతిసారీ నిన్ను  నవ్వుతూ స్వాగతిస్తారు,
            అర్దరాత్రి వరకూ ఎదురుచూస్తారు, 
            అతిధి వై  వస్తావు. 

            నీ పాదాల కింద తమ అరచేతులుంచి,
            కందిపోకుండా నిన్ను నడిపిస్తారు,

            కలవారితో కలసి అడుగులేస్తావు ,
            ఆకలిగలవారిని  ఆమడ దూరం నెట్టేస్తావు.

            కామాంధులకు  కొమ్ముకాస్తావు,
            సైకోలకు  సహకరిస్తావు.

            మానవత్వపు మొక్కను వేళ్ళతో సహా  పీకి,
            రాక్షసత్వానికి  ఎరువు వేస్తావు.

            ఒకచోట నిప్పై,మరోచోట నీరై,
            ఇంకోచోట ప్రకంపమై ప్రకోపిస్తావు.
            
            
            నీ  నికృష్ట విన్యాసాలకు  అగ్గై భగ్గున  మండి,
            ఒళ్ళంతా కాలిన  నాకలం  నివురై పోతుంది.

            నా కలల  కలువలను కసిగా  తెంపి,
            నా స్వప్న సరోవరాన్ని రుధిరంతో నింపేస్తావు. 

            ఒక్కసారైనా... నా చెలిమి చేతికి  పచ్చబొట్టువై ,
            పదిలంగా ఉండిపోవా... కరుణించవా... ఓ కొత్త సంవత్సరమా.... 

            


15 comments:

 1. కలం కత్తి కన్నా పదునైనది , మీ కలం పది కాలాల పాటు పచ్చగా రాయడానికైనా నే ప్రార్దిస్తా కరుణించవా... ఓ కొత్త సంవత్సరమా....అని. వాస్తవాలకు ఆలవాలం మీ " కవితా సుమహారం " మీరజ్ .

  ReplyDelete
  Replies
  1. మీ అభిమానానికి ధన్యవాదాలు దేవీ.

   Delete
 2. చీకటి వెలుగుల; మంచీ చెడుల; మిత్ర శతృత్వాల, సంతోష విషాదాలకు అతీతంగా మౌనసాక్షిలా కాలమెప్పుడూ నిరంతరాయంగా మునుముందుకు సాగిపోతూనే ఉంటుందేమో. మీ కలంతో ఓ కత్తుల వంతెన కట్టి కాలాన్ని ఆపే ప్రయత్నం చేయండి. చూద్దాం. ఏం జరుగుతుందో...?!

  ReplyDelete
  Replies
  1. మీరన్నట్లు కాలాన్ని ఆపటం కష్టం. పూల బాటవేసినా,కత్తుల వంతెన కట్టినా కూడా,
   అందుకే ఇలా ఓ నివేదన, అంతే..
   ధన్యవాదాలు మీ వ్యాఖ్యకు

   Delete
 3. KUDOS you have that spark of social awareness which must be the forte of every poet - keep it up your commentary i s worth in gold .. obviously it inspired so many friends on Face Book..

  ReplyDelete
  Replies
  1. సర్, నా బ్లాగ్ కి స్వాగతం.
   మీ ప్రశంసను అందుకున్నందుకు సంతోషంగా ఉంది.
   మీకు నా ధన్యవాదాలు

   Delete
 4. అన్నిరుగ్మతలకూ కాలమే మందు
  అన్ని సమస్యలనూ కాలమే పరిష్కరిస్తుంది
  అన్ని ప్రశ్నలకూ కాలమే సమాధానాలు చెబుతుంది
  కాలాన్ని నిందించడం కంటే ఆశ్రయించడమే విజ్ఞత
  ----- సుజన-సృజన
  కొత్త సంవత్సరాగమన శుభ సమయాన మెరాజ్ గారికి సౌహార్దిక శుభాకాంక్షలు .

  ReplyDelete
  Replies
  1. నిజమే, కాలాన్ని ఆశ్రయించటమే చేయాలి, దాన్ని సరిగా ఉపయోగించటమే తెలియాలి అందరికీ.
   సర్, మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

   Delete
 5. అర్దరాత్రి వరకూ ఎదురుచూసే స్వాగతాలకు మోజు పడతావేమో అని, అతిధి వై వస్తావేమో అని భయంగా ఉంది.
  కలవారు నీతో కలసి అడుగులేస్తారేమో అని, ఆకలిగలవారిని ఆమడ దూరం నెట్టేస్తారేమో అని. కామాంధులు, సైకోలు, మానవత్వాన్ని వేళ్ళతో సహా పీకి, రాక్షసత్వానికి ఎరువుగా వేస్తారేమో అని. ఎందరి కలల కలువలనో కసిగా తెంపి, స్వప్న సరోవరాల్ని రుధిరంతో నింపేస్తారేమో అని.
  అందుకే .... నా చెలిమి చేతికి పచ్చబొట్టువై, పదిలంగా ఉండిపోవా .... కరుణించి అని ఆహ్వానిస్తున్నాను, ఓ కొత్త సంవత్సరమా!

  కొత్త సంవత్సర వేడుకల ఆర్భాటాల తంతును చక్కని సూక్ష్మ పరిశీలనగా ఆవేదనతో రాసిన మీ కవిత మరో కోణాన్ని ఇలా స్పందిస్తున్నందుకు అన్యధా భావించరని ఆకాంక్షిస్తూ అభినందనలు మెరాజ్ ఫాతిమా గారు! శుభోదయం!!

  ReplyDelete
  Replies
  1. మీ విష్లేషణలో సూక్షమత ఉంటుంది, కవితలో కొంత ఆవేశమూ, ఆవేదనీ, నిరాశావాదమూ ఉంది.
   మీ స్పందనకు ధన్యవాదాలు సర్.

   Delete
 6. నూతన సంవత్సరానికి మీరు పలికే
  ఆహ్వాఅనం నూతనంగాను ఆర్ద్రంగాను ఉంది. శుభాభినందనలు.
  మీకు మీ బ్లాగు మిత్రులకు కూడా నూతన సవత్సర శుభాకాంక్షలు.

  ReplyDelete
  Replies
  1. మీ స్పందనకు ధన్యవాదాలు సర్,
   మీకూ,మీ కుటుంబ సభ్యులకూ మా శుభాకాంక్షలు.

   Delete
 7. ఫాతిమా గారూ !

  అరవిరిసిన అభిమానంతో - సహృదయతతో అంటున్న మాటలివి .
  మీ రచనల్లో ఆర్ద్రత ఉంది - ఆవేదనా ఉంది . అందమైన మీ ఈ రచనా శైలి
  నాకు ఓ స్పూర్తి గా తోస్తుంది.

  " నా కలల కలువలను కసిగా తెంపి,
  నా స్వప్న సరోవరాన్ని రుదిరంతో నింపేస్తావు "

  గొప్ప మాటలివవి ...... మీ కలంనుండి వచ్చే ప్రతీ కావ్యం
  శ్రావ్యంగానూ , భావగర్భితంగాను ఉంటాయి . చదువుకున్నంత సేపూ
  ఓ అనిర్వచనీయ మైన అనుభూతి.
  2012 లో 104 కవితలు రాసారు
  2013 లో 124 కవితలనందించారు
  2914 లో ఎన్నొ.మరెన్నొ రాయాలని - రాస్తారని ఆశిస్తూ ....
  నూతన సంవత్సర హార్దిక "శుభాకాంక్షలు" మీకు.
  - శ్రీపాద

  ReplyDelete
  Replies
  1. శ్రీపాద గారూ, మీ కామెంట్ నన్ను చాలా సంతోషపెట్టింది, బాద్యతనూ పెంచింది.
   నా కవితలు నచ్చినందుకు ధన్యవాదాలు.
   మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు.

   Delete
 8. జనమంతా,జగమంతా మత్తుగా జోగే వేళ మరో కోణంలో మరో ప్రపంచాన్ని సాధించే కాలాన్ని హెచ్చరిస్తూ జాగరూకతగా నూతన సంవత్సరానికి మీరు పలికిన స్వాగతం చైతన్యవంతంగా ఉంది.

  ReplyDelete