"నడిచే కల"
ఆమె నడుస్తుంది,
కలల అలలతో కలసి
అడుగు కలుపుతుంది.
అడవి మల్లె అందాన్నీ..
ఆత్మీయ బంధాన్నీ..,
తనలో ఇముడ్చుకుంది.
ఓ సుందర స్వప్నాన్ని
కలవాలనీ..,
వశీకరణంతో,
ఒడిచేర్చుకోవాలనీ..,
ఆశతో జీవిస్తుంది.
మనస్సంతా
ఎదురుతెన్నుల కన్నులైతే..,
గుండెనిండా గాయాల కవాతులైతే
దారంతా... చూపును పరిచింది ,
చిక్కటి చీకటి గదిలో..,
తుదిలేని మది తలపులతో..,
బ్రతుకంతా పయనిస్తూ..,
మినుగురులా మెరుస్తుంది ,
తను వెతికే తీగను నేనైతే ,
పొద్దు తెలీని ప్రేమనివ్వాలనుకుంటే్...,
హద్దులెరుగని ఈ గుండెపై , అంక్షల వలవేసింది
అందుకే ......
ప్రతిసారీ శబ్దమై నాలో పాకుతూ..,
శ్వాసై నన్ను తాకుతుంది...,