Pages

Thursday 31 January 2013

వాక్కు.










వాక్కు.

వేదన నిండిన  గుండెకు  మరపుమందు  నిస్తుంది.
మది వాకిట నేర్పుగా ...ఓర్పు పరదాకడుతుంది ..,
నీ చల్లని వాక్కు.

విచక్షణ లేని క్షణాన  రక్షణలా,
విరిగిన  మానస వీణను   అతికించి  సృతించేలా చేస్తుంది,
నీ  చక్కని వాక్కు.

చీకటి  తరువు  నుండి  వెన్నెల కుసుమాలను   పూయించి,
మది  గాయాలు   మానపటానికి  మాటల   తేనెలతైలం  పూస్తుంది.
నీ  మంచి వాక్కు.

కనుల  నీరు  తుడిచి  కలత పోగొట్టి ,
చెంత  చేర్చుకొని  సేద  తీరుస్తుంది ,
నీ  చెలిమి వాక్కు.

గనీభవించిన  కాలాన్ని ద్రవీబవించి,
అస్తమించే  నా బ్రతుకునకు  సమస్తమై  నిలుస్తుంది,
నీ  స్వాంతన వాక్కు.

12 comments:

  1. వాక్కులు ఇన్ని రకాలా?
    బాగుంది!
    మరి నవ్వులో?!

    ReplyDelete
  2. Sir, mee vanti pedda kavulu cheppaali navvulu enni rakaalo, dhanyavaadaalu mee spandanaku.

    ReplyDelete
  3. చల్లని, చక్కని, మంచి, చెలిమి, స్వాంతన వాక్కుల గురించి ఎంతో చక్కగా చెప్పారు మెరాజ్ గారు!
    "వాజ్మాధుర్యాత్ నాన్యదస్తి ప్రియత్వం" వాజ్మాధుర్యమును మించి ప్రియమైనది లోకంలో మరొకటి లేదు.
    "ప్రియవచన వాదీ ప్రియోభవతి" ప్రియవాది అయినవాడే అందరికీ ప్రియమైనవాడౌతాడు.
    అందుకే మనమూ మాట్లాడుదాం - చల్లగా, చక్కగా, మంచిగా, నేర్పుగా, ఓర్పుగా, ప్రియంగా, హితంగా, మితంగా, చెలిమితో!

    ReplyDelete
    Replies
    1. భారతి, మీ స్పందన సరైనదే కానీ ఎంతమంది పాటిస్తున్నారు? పరుషమైన పదాలే వాడుతున్నారు,
      కానీ అతిచల్లని వాక్కు మనిషిని కట్టిపడేస్తుంది. కొన్ని చొట్ల ప్రెమ ్లేకున్నా మెత్తటి మాటలు మనిషిని మోసపుచ్హుతాయి.యెది యెమైనా మ్రుదువైన మాటలే మంచివి.

      Delete
  4. పలకరిస్తే మది పులకించాలి కదా!

    ఆ పలకరింపుని వర్ణించే నీ కవిత్వం హృద్యంగా ఉంది.

    భారతి గారు...మీ వ్యాఖ్య ఎంత బావుంది.! ధన్యవాదములు.

    ReplyDelete
    Replies
    1. నా కవిత్వం పులకరింప చేస్తుందేమోగానీ.. నా పలకరింపు మాత్రం కాదు.:-)
      మీ వ్యాఖ్య నాకు స్పూర్తినిస్తుంది.

      Delete
    2. వనజ గారు!
      మీకు నా వ్యాఖ్య నచ్చి, అది మీరు ఇలా తెలియజేయడం... సంతోషంగా ఉంది. మీకు మనసార ధన్యవాదాలు.

      Delete
  5. భారతి గారి స్పందన చూసాక 'కేయూరాని న భూషయంతి పురుషాం...' గుర్తుకొచ్చింది.
    వాగ్భూషణం భూషణం అన్నారు కదా!

    ReplyDelete
    Replies
    1. సర్!
      ఈ పద్యాన్నే ఉదహరిస్తూ 'స్మరణ'లో అంతర్వాణి కేటగిరి యందు 'మాటే మంత్రం' అన్న పోస్ట్ ను పెట్టాను. కేయూరాణి న భూషయన్తి పురుషం హారా న చన్ద్రోజ్వలా...నా కెంతో ఇష్టమైన ఈ పద్యాన్ని మీరు ప్రస్తావించడం చాల ఆనందాన్నిచ్చింది సర్. మీకు నా ధన్యవాదములండి.

      Delete
    2. భారతీ, సర్ కి చాలా భక్తి . మీలాగె ఇలాంటి విషయాలు చాలా రాస్తారు.
      మరి నేను తెలుసుకొవాలంటే ఇంకెంత కాలం పడుతుందో.... పెద్దవాళ్ళు పెద్దవాళ్ళే....:-)

      Delete
  6. అన్ని ఆయుధాల కంటే ప్రమాదకరమైనది మనిషి మాటేనేమో..
    ఎందుకంటే మనసును గాయపరచగలిగేది మాటే ( వాక్కు ) కదా..

    ReplyDelete
    Replies
    1. రాజీగారూ, ఓ మంచి మాట ప్రాణం పోస్తుంది, అలాంటి పలుకు కోసం ్తపించే మనస్సు ని నిర్లక్ష్యం చేయటం అమానుషం.
      మీ స్పందనకు దన్యవాదాలు.

      Delete