Pages

Thursday 14 March 2013

 







నీ నుదుటి పున్నమినౌతా 


నన్ను చూసి తలుపు చాటు నక్క్కుతావు.
నా ప్రతి అడుగూ  లెక్కెడతావు.

నా పలుకులతో అలకలు పోతావు,
ఓర కంట నన్ను కవ్విస్తావు 

నా పిలుపుతో పులకరిస్తావు,
కానీ  విననట్లు నటిస్తావు.

ఎప్పుడూ యోగినిలా ద్యానంలో  ఉంటావు,
నన్ను చూసి ఎందుకో ఉలిక్కిపడతావు.

నా స్పర్స తగిలితే  కంపిస్తావు,
కానీ నెపం చల్లగాలిపై తోస్తావు 

నా పిలుపుతో పులకరిస్తావు,
కానీ  విననట్లు నటిస్తావు.

ఎప్పుడూ యోగినిలా ద్యానంలో  ఉంటావు,
నన్ను చూసి ఎందుకో ఉలిక్కిపడతావు.

నా స్పర్స తగిలితే  కంపిస్తావు,
కానీ నెపం చల్లగాలిపై తోస్తావు 

నిశాచరునిలా, నేను సంచరిస్తుంటే,
చుక్కల వత్తులేసి  జాబిలి  దీపం పెడతావు.

ముద్దుమోమును  దోసిట తీసుకుంటే,
కలువ కనులను మూసుకుంటావు.

నిరాశ  చెంది  నేను  వెనుతిరిగితె,
కలవరంతో కదలిపోతావు.

సెలవు తీసుకొంటున్న నాకోసం,
నెలవు దాటి బైట పడతావు  

అమావాస్యలాంటి నీ జీవితాన పున్నమినౌతా,
వైధవ్యం  అంటిన నీ జీవితానికి   వరాన్నవ్ తా     





6 comments:

  1. చాలా చాలా నచ్చిందండి.

    ReplyDelete
  2. బాగుంది.... కాని కొన్ని లైన్స్ రీపిట్ అయినట్ట్లు ఉన్నాయి చూడండి

    ReplyDelete
  3. రాజా,పద్మ ,దేవిడ్ గార్లకు ధన్యవాదాలు

    ReplyDelete
  4. వైధవ్యం అంటిన నీ జీవితానికి వరాన్నవ్ తా బాగుంది ఒక్క వాక్యం లో లో నీకు తోడుగా ఉంటానని చక్కగా చెప్పారు

    ReplyDelete
  5. తలుపు చాటు నక్కి, అలకలు పోయి, పులకరించి, ఉలిక్కిపడుతూ విననట్లు నటిస్తావు.
    చుక్కల వత్తులేసి జాబిలి దీపం పెడతావు. కలువ కనులను మూసుకుంటావు. కలవరంతో కదలిపోతావు. అమావాస్యలాంటి నీ జీవితాన పున్నమినవ్వాలని, వైధవ్యం అంటిన జీవితానికి తోడు లా ....
    "నీ నుదుటి పున్నమినౌతా" అంటూ ఈ కవితలో, ఒక మంచి వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించిన విధానం బాగుంది. అభినందనలు మెరాజ్ గారు.

    ReplyDelete