Pages

Monday 4 March 2013

దిక్కు (లేని)మాలిన సమాజం








దిక్కు (లేని)మాలిన సమాజం 


సమాజం ముసుగు తొలగించి  చూస్తె,
ముదిమి చెక్కిలికి  చెమ్కీ  రాసుకున్న 
వెలయాలిలా  కనిపిస్తుంది,

దాని చరిత్ర  పేజీలని  తిరగేస్తే
వదిలేసిన ప్రియురాలి,

గాలి కబుర్లులా అనిపిస్తున్నాయి. 

కరువును తరిమేసే  
పథకాలపై చెయ్యేస్తే, రేషన్ షాపులో 
బియ్యం మెక్కిన పందికొక్కుల్లా ఉన్నాయి. 

ఓటు  దొంగిలించిన   నేత దగ్గరికెళ్ళి 
కొలువుకోసం  కాళ్ళు పట్టుకొంటే,
అరగక పెరిగిన పొట్ట సొట్టలు పడేలా నవ్వాడు. 

లంచం తో పాటు  మంచం  మరిగిన
నీతిలేని చెత్త  వెదవల  చెలామణి,
దొంగ వెదవల దొరతనమూ..సాగుతుందిక్కడ. 

ఆలిని  అత్తారింటికి  తొలుదామంటే,
చేవలేని తనాన్ని  చూపులతో చెరిగేసిందీ,
మగతనాన్నే  తూలనాడింది

ఎంత  అలిగి  పడుకున్నా   
ఆకలికి  బయంలేకపోయింది 
అరుచుకుంటూ పక్కననొచ్చి చేరుతుంది. 

తీరిగ్గా తీర్ధయాత్రల్లొ  మునిగి తేలుతూ 
స్నానాదుల్లో సమాజాన్నీ కడిగి చూస్తే,
గంగానది గగ్గోలు  పెట్టింది. 

నేలమీద  కాయాన్ని పరుచుకున్నా,
తలదగ్గరో దీపమెట్టుకున్నా..,
కాళ్ళ దగ్గర గొయ్యి తవ్వుకున్నా,


కుళ్ళిన, రసికారే  కుష్టు రోగపు పుండు,
కళ్ళకు కాటరాక్ట్ , వచ్చి పొరలు కమ్మిన 
దిక్కుమాలిన, దౌర్భాగ్యపు ,ద్రోహపు సమాజాన్ని,
నాతొ పాటు  పాతిపెట్టండి, నేల  తల్లికి సమర్పించి 
అమర మొలకనై  తిరిగి అవతరిస్తా.....

( కొందరి మిత్రుల  సలహా మీద కవితని సవరించాను, ఎవరి మనొభావాలు దెబ్బతినటం నాకూ  నచ్చదు  అందుకే ఈ సవరణ)








'

3 comments:

  1. మనసు నొచ్చుకుంటుందని నిజాన్ని (మీకు అనిపించిన భావాన్ని)నొక్కిపట్టారు ....సమాజ నిర్మాతలమైన మనం అంతా మెల్కొవాలని చెప్పిన ఈ కవిత -విమర్శ కి జొహార్లు!.

    ReplyDelete
  2. టీచర్లే దిక్కు .... నిజాయితీగా ఒప్పుకో గల్గితే
    నిజాయితీ లేని టీచర్ల వల్లే అది దిక్కుమాలింది .

    ReplyDelete