Pages

Friday 8 March 2013

నా...నీవు









నా.... . నీవు 

హేమంతంలో  పూచే  చేమంతిలా,
నీ హసితం  ఓ  సుభాషితం.

గ్రీష్మంలో  విరిసే మల్లియలా,
నీ  వదనం  ఓ   వరం.

మలయా  మారుతంలా
నీ   పలుకు  ఓ  పులకరింపు.

కరిమబ్బు  రాల్చే   చినుకులా
నీ పిలుపు   ఓ  చిరుజల్లు.

గలగలా  పారే  సెలయేరులా,
నీరాక   ఓ   ఏరువాక.

మలి  సంధ్యలో  శశి  పంపే  ఆహ్వానం లా,
నీ చూపు  వెన్నెల బాకు.

ఎడారిలో    దాహం తీర్చే  చలమలా,
నీ స్నేహం  ఓ  ఊరడింపు.




9 comments:

  1. బాగారాసారు.

    ReplyDelete
  2. హటాత్తుగా ఊడి పడ్డ ఎండల వేడిమికి
    మీ కవిత ఓ గ్లాసెడు కొత్త కూజా నీళ్ళు

    ReplyDelete
  3. బాగుంది మీ కవిత

    ReplyDelete
  4. నీ హసితం ఓ సుభాషితం.keep smiling. It's nice.

    ReplyDelete
  5. ఆ హాసం ఓ సుభాషితం, ఆ వదనం ఓ వరం, ఆ పలుకు ఓ పులకరింపు, ఆ పిలుపు ఓ చిరుజల్లు, ఆతని రాక ఓ ఏరువాక .... ఆ చూపు వెన్నెల బాకు .... ఆ స్నేహం ఓ ఊరడింపు.
    అన్ని లక్షణాలున్న స్నేహం నిజంగా ఓ సుభాషితం, ఓ వరం, ఓ పులకరింపు చిరుజల్లు, ఓ ఏరువాకే .... ఆ చూపు వెన్నెల బాకే
    ఎప్పుడూ సామాజిక కవితల అణువుల విశ్ఫొటనాలు కనబడే చోట ఒక నూతనత్వాన్ని చూస్తున్నాను. చక్కగా ఇమిడిపోయారు అత్మీయ భావనల్ని ప్రజెంట్ చెయ్యడం లోనూ! అభినందనలు ఫాతిమా గారు!

    ReplyDelete