Pages

Friday 26 April 2013










అన్నా...

తొండలు  గుడ్లు పెట్టె  పొలంలో,
ఏమి పండిస్తావు?

బండలు నిండిన భూమిలో,
ఏమి బావుకున్టావు ?

చెప్పులు లేని  అరికాళ్ళలో,
కసుక్కున దిగిన ముల్లును  ఎలా తీసుకుంటావు ?

మడక దున్నేందుకు,
చచ్చిన బక్క ఆవును ఎక్కడ   తోలుకొస్తావు ?

కరువు శవాల గుట్టల్లో,
అయిన వారిని ఎలా వెతుక్కుంటావు ?

ఎరువులు కొన్న అప్పుల్లో,
ఎన్ని తప్పులో ఎలా కనుక్కుంటావు ?

బావులన్నీ   భవంతుల కింద,
నక్కిన నల్లుల్లా ఉంటె ఎలా చేదుకుంటావు ?

వ్యవసాయం  నీ నెత్తిమీదనే,
లేదని ఎలా తెలుసుకుంటావు ?

ఆకలి పెరిగి దబ్బున్నోడి పేగులు,
అరిచేవరకూ  ఆగి ఉండాలని  ఎలా తెలుసుకుంటావు ?

అన్నధాతవే  కానీ అనాథవు  కావని,
ఎవరు చెప్పితే వింటావు ?

5 comments:

  1. నేటి అన్నదాత దుస్థితి బాగా చెప్పావు.

    ReplyDelete
  2. ధన్యవాదాలు, బ్లాగ్ కి స్వాగతం.

    ReplyDelete
  3. అనాధగా మారిన అన్నదాత దుస్థితి కళ్లముందు ఆవిష్కరించారు. దీనిక కారణం ఎవరో చెపితే ఇంకా బాగుండేది

    ReplyDelete
  4. తొండలు గుడ్లు పెట్టె పొలం, బండలు నిండిన భూమిలో .... ఏం పండిద్దమని? .... ఏం బావుకుందమని?
    అన్నా! కరువు శవాల గుట్టల్లో, ఎరువులు కొన్న అప్పుల్లో .... ఏం పండిద్దమని? .... ఏం బావుకుందమని?
    జీర్ణించుకోలేని డబ్బున్నోడి పేగులు, అరిచేవరకూ ఆకలి చంపుకోవాలని, అన్నధాతవే కానీ అనాథవు కావని, ఎవరు చెప్పితే తెలుసుకుంటావు? ....
    మొత్తం రైతాంగం సమశ్యల్ని ఒక్క కవితలో అక్షర రూపం ఇవ్వడం ఇంత సాధారణ విషయం అనుకోలేదు నేను ఎప్పుడూ!
    అభివందనాభినందనలు కవయిత్రికి.

    ReplyDelete