Pages

Tuesday 9 April 2013












కొడుకా... ఇదేనా..జీవితమ్?


అప్పుడు  అన్నం  తినని  మారాం చేశావు.,
ఇప్పుడు  అన్నం పెట్టనని  దూరం తోశావు. 

నా బ్రతికు   పుస్తకంలో ప్రతిపేజీ  నీదే,
నా జీవన డైరీలో  ప్రతి అక్షరమూ నీదే. 

నీ చదువుకై  నేను  చేసిన  పోరాటం,
నీ ఆరోగ్యానికి  నేను పడిన ఆరాటం.

జీవిత  గారడిలో  ఎన్నో పిల్లిమొగ్గలేసాను. 
కస్టాల ,నష్టాల  సుడిగుండంలో  పడిలేచాను. 

తనివితీరా   ఏడుద్దామంటే కన్నీళ్ళు  లేవు. 
కరువుతీరా నిను చూద్దామంటే  కళ్ళే లేవు. 

నీకు  జన్మనిస్తూ  నాతోడు  దూరమైంది,
నాతో తోడు ఉంటానన్న  మాటే మరచింది.. 

నిన్ను మోసిన  ఈ భుజాలు  జారిపోయాయి,
నీ భుజం ఆసరా ఇచ్చి ఆఖరి మజిలీ చేర్చు. 

నిన్ను కన్నందుకు  నన్ను నిందించుకోని   రోజులేదు. 
ఇంకా ఎన్నాళ్ళు  ఈ భువిపై  అని లెక్కపెట్టని  క్షణం లేదు. 

14 comments:

  1. Replies
    1. తమ్ముడూ, థాంక్స్.

      Delete
  2. ఇలా చెబితే ఏడు పోస్తుంది .
    మిరాజ్ మాకు పగలంతా కరెంటు వుండదు టి .వి ఎలాచుసేది ?

    ReplyDelete
    Replies
    1. లక్ష్మి గారూ, మీకు నచ్హింది అంతే చాలు. ధన్యవాదాలు.

      Delete
  3. బాగారాసారు!

    ReplyDelete
    Replies
    1. ధన్య వాదాలు మీ స్పందనకు

      Delete
  4. ప్చ్.. వృద్దాప్యం లో తండ్రి ఆవేదన!

    ReplyDelete
    Replies
    1. భయంగా ఉంది , సమాజపు పోకడ చూస్తుంటే,
      థాంక్స్ వెన్నెల గారూ.

      Delete
  5. విజయ సంవత్సర ఉగాది శుభాకాంక్షలండి మెరాజ్ గారు

    ReplyDelete
    Replies
    1. వెన్నెల గారూ, మీకు కూడా శుభాకాంక్షలు .

      Delete
  6. Kanna thandri kanta ananada bhashpalu chudalsina santhanam, kanneeti samdramlo vaarini thosi vadilestunnarante kala mahima kadu idi anubandhalu marichi anubhavalu vethukunttu, adambaralakai vurakalese manasthatwalu perigina eelokamlo repu manam kuda aa thandrilaa vedana padavalasindeynemo. Manaku leni samskaram mana pillalaku nerpalemugaa.

    ReplyDelete
    Replies
    1. శ్రీనివాస్ గారూ, మీ స్పందనకు ధన్యవాదాలు.

      Delete
  7. చాలా బాగుంది ఫాతిమ గారు...రియల్లీ హార్ట్స్ టచింగ్.... దుక్కం పొంగుకొస్తుంది....ప్రతి కొడుకు చదవి అలోచించాల్సిన కవిత ఇది.

    ReplyDelete
  8. బిడ్డా! నా బ్రతుకు పుస్తకంలో ప్రతిపేజీ నీవే, నేను చూడని అద్దం లో నా రూపం నీవే. ఈ జీవితం చేస్తున్న గారడిలో ఎన్నో పిల్లిమొగ్గలేసాను. కష్ట, నష్టాల సుడిగుండాల్ని చూసాను. తనివితీరా నిన్ను చూసేందుకు కళ్ళు మసకేసాయి. ఏడ్చేందుకు కన్నీళ్ళు రావడం లేదు. ఈ భుజాలు జారిపోయాయి. నీకూ భూమికి భారమౌతున్నా .... ఆఖరి మజిలీ చేరేందుకు నీ భుజం ఆసరా అడుగుతున్నా .... బిడ్డా!

    ఏ మాత్రమూ సహకరించని శరీరాన్ని మోస్తున్న ఒక వృద్దుని మనోభావనల్ని చెక్కిన శిల్పం ఈ కవిత. ప్రశ్నల వర్షం కురుస్తూ ....
    అభినందనలు ఫాతిమా గారు.

    ReplyDelete