Pages

Saturday, 4 May 2013


   


  శవాల సంబరం 

   అయిదేళ్ళకొసారి గుర్తొస్తాము,
   అయినవాళ్లలాపరుగెత్తు కొచ్హి ,
   మమ్ము పలకరిస్తారు.

   మాయదారి జొరాలు గుప్పుమంటాయి,
   అంటురోగాలు  అంటుకోకుండా,
   ముందుజాగ్రత్తలు  పడే వస్తారు.

   గూడెపు సావులెక్కలకి రెక్కలొస్తాయి,
   ఒక్కో శవానికి రెండు  పేర్లు పెడతాము,
   అయినా దయతలుస్తారు దర్మాత్ములు.

   వాడలో అంబులెన్సుల హడావిడి,
   ముక్కుకారే మా పిల్లలు ముద్దోచ్హేస్తారు,
   దయామూర్తులు దగ్గరకి తీసుకుంటారు.

   బక్కచిక్కిన మా చిట్టి తల్లుల్ని,
   అక్కున చేర్చుకుంటారు,
   రంగుల పోటోలు హంగులుగా దిగుతారు.

   మా శవాలపై వాలే రాబందుల్లా,
   మా కురుపులపై వాలే ఈగల్లా,
   మా చుట్టూ చేరుతారు .

   మా ఓటు కోసం  మొసలి కన్నీరు కారుస్తూ,
   వెలయాలిలా వగలు పోతూ,
   నిర్లజ్జపు ముఖానికి నంగి నవ్వు అతికించుకుంటారు.

   మా గూడెపు అమ్మోరుని కూడా,
   బొమ్మోరుని చేసి,కనికట్టు చేసే,
   గారడి చేసి, ఓటు దోచుకొనే దొంగలు. 

10 comments:

 1. ఓటు దోచుకునే దొంగలు...చాలా కరెక్ట్ అయిన ఉపమానం...
  కవిత ఎప్పటిలానే మన ముందు జరిగే దోపిడీలకి అద్దం.
  హెడింగ్ "ఓటు దోచుకునే దొంగలు" అన్నదే బాగా సరిపోయేదేమో!

  ReplyDelete
 2. మీరన్న తర్వాత కవిత పేరు మారిస్తే బాగుండు అనిపించింది, ఎప్పటిలా మీ ఆధరణ్కు నా ధన్యవాదాలు చిన్ని ఆశ గారూ,

  ReplyDelete
 3. నిర్లజ్జపు ముఖానికి నంగి నవ్వు అతికించుకుంటార
  'నిర్లజ్జపు ముఖానికి నవ్వు అతికించుకుంటారు'అని రాసి ఉంటారు నాలాంటివాళ్ళు.
  కాని మీరు 'నంగి' అని తగిలిచ్చారు చూడండి superb ఆనవ్వు ఎటువంటి నవ్వు అనేది ఇక్కడ బాగా highlight
  very nice
  కీపిటప్పండి!

  ReplyDelete
  Replies
  1. హరి గారూ నచ్హినందుకు ధన్యవాదాలు.నిజమె మీరు చెప్పిన టైటిల్ పెట్టాల్సింది.

   Delete
 4. శవాల సంభరం కాదది
  వోటుదొంగల సంభరం

  ReplyDelete
  Replies
  1. సంభరం కాదండీ సంబరం.

   Delete
 5. కవిత చాలా బాగుంది. సత్యం చెప్పారు. అబినందనలు

  ReplyDelete
  Replies
  1. శ్యామలీయం గారూ, మీ స్పందనకు ధన్యవాదాలు.
   కవితా సవరణకు కృతజ్ఞతలు.

   Delete
 6. "ముసలి కన్నీరు" కాదు "మొసలి కన్నీరు" అని ఉండాలండీ.

  ReplyDelete
 7. చెంప చెల్లుమనిపించేలా ఉంది.

  ReplyDelete