Pages

Sunday 21 July 2013






    




    అప్పు తప్పు 



     మెట్లు లేని దిగుడుబావి నుండి,
     పైకి ఎగబాకుతున్నట్లూ,

    ఇనుప చట్రాలలో ఇరుక్కుని,
    ఉక్కుపిడికిలికై వెతికినట్లూ,

    సమాదులపై పాతిన శిలా పలకం,
    నీదే అని ఎవరో అరిచి చెప్పినట్లూ,

    సూదికళ్ళతో వెతుకుతూ డేగ కిందికొస్తే,
    బిక్కచచ్హిన కోడిపిల్ల పరుగెత్తినట్లూ,

    నిదుర రాని కనురెప్పలపై,
    గబ్బిలం  రెక్కలు విదిల్చినట్లూ,

    అరువు తెచ్హిన ధనం హారతి కర్పూరం అవుతుంటే
    గొప్పలకి పోయి జబ్బలు చరుచుకున్నట్లూ,

    అప్పు ఎగ్గొడుతావని లోకమంతా నీకై,
    వలవేసి వెతుకుతున్నట్లూ,

    కొన్ని సందర్భాలూ,సందేహాలూ,కలసి ,
    నిన్ను కత్తి అంచున కూర్చోబెడుతున్నట్లూ,

    అవును నువ్వు ఇంకెప్పటికీ దొరకవేమో అన్నట్లూ
    అప్పుచేసి పప్పుకూడు తినకూ అని ఎవరో అన్నట్లూ.




10 comments:

  1. అప్పెపుడూ తప్పే , మరి!
    అప్పిచ్చు దొరలు దొరికిన అందిన వరకున్
    చప్పున గైకొనకుండిన
    పప్పూ కూడెట్ల వచ్చు ఫాతిమ గారూ !
    ----- బ్లాగు : సుజన-సృజన

    ReplyDelete
    Replies
    1. సర్, నిజమే రైతు పంట కోసం చేసే అప్పు తీర్చలేడు, ఎందుకనంటే ప్రక్రుతి వైపరీత్యాలకు ఎదురీదలేడు. అందుకే నేడు రైతు రోజు కూలీగా మారుతున్నాడు. మీ స్పందనకు ధన్యవాదాలు.

      Delete
  2. అప్పు చేయడం తప్పైతే మన ప్రభుత్వమే ఒక పెద్ద తప్పుల కుప్పన్నమాట

    ReplyDelete
    Replies
    1. అన్నం పెట్టటం కోసం అప్పు చేయటం తప్పు కాదు అనిపిస్తుంది. మీ స్పందనకు ధన్యవాదాలు

      Delete
  3. ప్రతి లైన్ మనసుని హత్తుకునే నిలదీసే నగ్నసత్యాలు.

    ReplyDelete
    Replies
    1. ప్రేరణ గారూ, మీ అభిమానం మనస్సుకు హాయినిచ్హింది ధన్యవాదాలు.

      Delete
  4. అప్పుచేసి పప్పుకూడు తినరా ఓ నరుడా! గొప్పనీతి వాక్యమిది వినరా పామరుడా అన్నారండి! ఒక సినీకవిగారు, ప్రభుత్వం అది పాటించేస్తోందండి

    ReplyDelete
    Replies
    1. సర్, మీ మాటా నిజమే, ధన్యవాదాలు మీ స్పందనకు.

      Delete
  5. అన్న దాత అప్పు చేసేది,
    తన ఇంట్లో పప్పు కూటికోసం మాత్రమే కాదు,
    దేశానికి ఆకలి తీర్చడానికి కూడా!
    కాని అప్పును తప్పు చేసే
    ప్రభుత్వం,
    అప్పు చేసిన రైతుని డేగ చూపులతో చూసే
    వడ్డీవ్యాపారులు
    ఉన్నంత వరకు
    అప్పు పెద్ద తప్పే మరి!
    శబ్బాష్ బాగా రాసారు.

    ReplyDelete
  6. నిజమే అన్నదాత కేవలం తన స్వార్దమే చూసుకోడు , సర్, మీ వివరణకు ధన్యవాదాలు

    ReplyDelete