Pages

Thursday 1 August 2013

పచ్చదనం













కాడెద్దులు  కడగడమే  తెలుసు,
కారు కడగటం తెలీదు. 

సూడి  అవుకు మొక్కటమే  తెలుసు,
సూటు,బూటుకు  మొక్కాలని తెలీదు. 

బందు,మిత్రులకు విందులు ఇవ్వటమే  తెలుసు,
బడా బాబులకు మందు నింపాలని(గ్లాసులు ) తెలీదు. 

విస్తళ్లలో  విందులు,ఇంటినిండా  బందువులే  ఉండాలని తెలుసు 
హోటళ్ళలో కప్పులు కడిగి టిప్పుకై  చేయిచాపాలని తెలీదు. 

పచ్చదనాన్ని ప్రేమించటం  తెలుసు,
పచ్చనోటుకై  పరుగులేత్తాలని తెలీదు. 

పురుగుల మందు  తాగితే  కొంప కొల్లేరవుతుందని  తెలుసు,
పట్నం  వలస వస్తే  తనను తానూ చంపుకున్నట్లేనని  తెలీదు.. 
                                * * *

( అన్నా....  అనిపిలిపించుకున్న   ఆ మనిషే   "అరె.."   అనిపిలిపించుకుంటూ.. రోజుకోలీగా మారి, అన్నం పెట్టిన ఆ  చేతులతో  దణ్ణం పెడుతున్నాడు.. చూడండి,  రైతన్న పరిస్థితి.. పట్నంలో  ఇమడలేకా.. పల్లెలో బ్రతకలేకా  రైతన్న పడే  అవస్థ చూడండీ,...   రైతుకు  న్యాయం చేసే  పాలన కావాలని కోరుకుందాం..  అన్నదాతను బ్రతికిద్దాం  అన్నం తిందాం..) 

(ఓ  పేద రైతు  సిటీలో  షాపింగ్ మాల్ లో సెక్యూరిటీ గార్డ్  గా  పనిచేస్తున్నాడని  విన్న తర్వాత కలిగిన ఆవేదనతో........ మేరాజ్ ఫాతిమా) 



5 comments: