Pages

Tuesday 23 September 2014

కలం కదిలించు

    
    కలం కదిలించు 

     కాలమనే కత్తి  మీద 
     కలాన్ని కదిలించు
     ఎగిరిపడే నిప్పురవ్వలు 
     కవివైతే నిన్ను కాల్చేస్తాయి. 

     ఏ మూలనో అణువంతైనా ,
     ఆవేశముంటే ,
     చచ్చిన శరీరాంగమైన,
     నీ కలాన్ని కదిలించు. 

     పుక్కిట  పురాణాలనూ,
     బొంకుల బోగాతాలనూ ,
     చెత్తబుట్టకు చుట్టాన్ని చెయ్యి . 
     బాల కార్మికులకై  అక్షర బాటవెయ్యి. 

     మతాల దడులూ, కులాల కంచెలూ ..,
     కట్టి ,గద్దలు  తన్నుకుపొయే ,
     ఉద్యోగాలను  ఉట్టికొట్టి ,
     రచ్చకీడ్చి , నీ  కలంతో  కడిగెయ్యి . 

     ఆకటి పేగులకు  
     అన్నం ముద్దవి కావాలంటే,
     నీ కలాన్ని అనలం లో కాల్చి ,
     సానబట్టి , వర్గ ,వర్ణ  ప్రాంతీయ బేదాలపై ,
     వేటు వేయి. 

      (లేదంటే .... కవులారా  మనమంతా  
       పుచ్చిపోయిన మన కలం పాళీ  విరిచి ,
       వెన్నెల్లో తనువును ఆరబోసుకున్న 
       పూభోణి గురించి  రాసుకొని  
       మనకు మనమే చొంగ కార్చుకుందాం )








12 comments:

  1. పుక్కిట పురాణాలనూ,
    బొంకుల బోగాతాలనూ ,
    చెత్తబుట్టకు చుట్టాన్ని చెయ్యి .
    ఇలా రాయడం మీకే చెల్లు

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు పద్మా,
      మీ అభిమానం ఎనలేనిది

      Delete
  2. సద్భావనతో కూడిన సత్సందేశం .

    కొంచెం క్రమ లోపం అనిపిస్తున్నది నాకు . ఓ మారు ఈ కోణంలో పరికించి చూడు .

    ReplyDelete
    Replies
    1. అన్నయ్యా..,నమస్తే,
      ధన్యవాదాలు

      Delete
  3. మీ మానవీయ దృక్పదానికి దర్పణాలు మీ కవితలు.
    చక్కటి సందేశం. బాగుంది మెరాజ్ గారు.

    ReplyDelete
    Replies
    1. భారతి గారూ, మీ స్పందన నాకు చాలా బలాన్నిస్తుంది.
      అప్పుడప్పుడూ (వీలున్నప్పుడు ) చూస్తూ ఉండండి

      Delete
  4. kavitha bagundi medam.
    www.sakshyammagazine.blogspot.com

    ReplyDelete
    Replies
    1. అహ్మద్ జీ..అస్సలామలేకుం ,
      ధన్యవాదాలు

      Delete
    2. అహ్మద్ జీ..అస్సలామలేకుం ,
      ధన్యవాదాలు

      Delete
  5. kaalamane nippulagundam ninnu dahinchina aanippulaguntalo budida kakunda kavi y nilichavu naa ayushulo konchamtheesukoni charitralo nilichipo akka

    ReplyDelete
    Replies
    1. సుధా, చాలా సంతొషం , తమ్ముని ఆయువు అక్క ఎప్పటికీ కోరదు .

      Delete
    2. సుధా, చాలా సంతొషం , తమ్ముని ఆయువు అక్క ఎప్పటికీ కోరదు .

      Delete