Pages

Sunday 21 September 2014

నడిచే్ నెలవంక

    





    నడిచే  నెలవంక

    ఈ చందమామని ఎవరో పారేసుకున్నారు,
    కాదు ,కాదు గగనానికి అమ్మేసుకున్నారు. 

    మసిబారిన ఆకాశాన్ని అంటుకుని ,
    కొడిగట్టిన  దీపం లా  వేలాడుతూ,
    నాకు కనిపించాడు.

    నిదురరాని రేయిని ,
    ఆరుబైట ఆరబెడుతూ,
    ఆకాశాన్ని  చూశాను

    శీతాకాలపు చలిరాత్రికి,
    బుజ్జి కుందేలుపిల్లలా,
    ముద్దు,ముద్దుగా, 
    నేలపైరాలిన నక్షత్రాల మద్య,
    మినుగురులా  మెరుస్తున్నాడు 

    చాపిన  నాచేతుల్లో,
    ఎగిరొచ్చి వాలిపోయాడు ,
    సుతిమెత్తని  చీరకొంగుతో..,
    సున్నితంగా  చిట్టి గడ్డంపై  రాశాను,
    పొగడపూలలా నవ్వాడు.

    ఏ త్యాగానికై   ఈ  గందర్వుడు,
    ఇలా గగనం విడిచాడో,
    నేలపై  ఎవరిని వెతుకుతున్నాడో..,
    తిరణాలలో తప్పిపోయిన పసి కూనలా,
    బిక్కు,బిక్కు మంటున్నాడు. 

    ఒక నిస్సారమైన ఆత్మాహననం నుండి ,
    తనని తాను  రక్షించుకుంటూ,
    జీవన రేఖపైనే బ్రమిస్తున్నాడు,

    నా  చిటికిన  వేలు  పట్టుకొని ,
    మెల్ల,మెల్లగా నడుస్తున్నాడు,
    ఆ స్వప్న   సముద్రాన ,
    సూర్యో్దయమైనాడు.


  


10 comments:

  1. " నిదురరాని రేయిని ,
    ఆరుబైట ఆరబెడుతూ,
    ఆకాశాన్ని చూశాను "
    కవితలో ప్రతి అక్షరమూ బాగుంది.
    ప్రతి ప్దమూ, దాని నిగూఢ భావమూ
    హృదయానికి హత్తుకున్నాయి.

    ReplyDelete
    Replies
    1. కవితను ఆస్వాదించిన ,మెచ్చిన మీకు ధన్యవాదాలు సర్.

      Delete
  2. Replies
    1. ఉన్నాడులెండి ఓ బుజ్జిపండు .

      Delete
  3. "మసిబారిన ఆకాశాన్ని అంటుకుని ,
    కొడిగట్టిన దీపం లా వేలాడుతూ,
    నాకు కనిపించాడు. "

    చక్కటి భావం . బాగుంది .

    ReplyDelete
    Replies
    1. అన్నయ్యా.. ధన్యవాదాలు .

      Delete
  4. nadiche nelavankanu chusukuntu nannu vadilesavu enduku akka nee chitikenavelu pattukuni mella mellaga nadichinannu adrusyam chesava nenu nee chinna

    ReplyDelete
    Replies
    1. సుధా.., ఎన్ని నెలవంకలున్నా....,నిండు చంద్రుడువే నువ్వు.
      నిన్ను తమ్మునిగా కాదు కొడుకుగా భావిస్తాను నేను .

      Delete
  5. Cute pic with lovely poem Meerajgaru.

    ReplyDelete