Pages

Sunday 19 October 2014

రిక్త హస్తాలు













        రిక్త హస్తాలు

     అయినవారికి  తాంబూలం
     అందించిన ఈ హస్తాలు ,
     నేడు అలసి సొలసిపోయిన తమలపాకులు .

     వారసత్వపు  దానగుణం
     హస్తరేఖల్లో  అమరిన ఈ హస్తాలు,
     ఆశగా చాపిన ప్రతి చేతినే తడిపే  కర్ణుని  కరాలు ,

     అన్నదాతగా  పట్టెడన్నం పెట్టే
     ఆత్మీయ  ఈ హస్తాలు ,
     అన్నార్తుల ఆకలి తీర్చే అక్షయ పాత్రలు .

     చీకటిని పారద్రోలే  చిరు దివ్వెలకు ,
     రక్షణ నిచ్చే ఈ హస్తాలు,
     జగతినే జాగృతి చేసే శుభసూచకాలు,

     సంతానానికి  సంతోషాన్నిచ్చె,
     అమ్మతనపు ఈ హస్తాలు,,
     నిద్రపుచ్చే ఊయలలు ,

     కరవు కాటకాల, ఆర్దిక  ఆటుపోటులకై ,,
     తెగిపడిన ఈ హస్తాలు ,
     నేడు అడుగంటిన అక్షయ పాత్రలు . 




2 comments:

  1. ఓ నాటి ఆ హసతాలు ఈ నాడు నిజ్జంగా రిక్త హస్తాలే .
    నైస్.

    ReplyDelete
  2. " అడుగంటిన అక్షయ పాత్రలు ."
    ఒక్క మాటలో మొత్తం చెప్పేసారు. బాగుంది

    ReplyDelete