Pages

Saturday 8 November 2014

నిషిద్ద గానం

















నిషిద్ద  గానం



పాత  సారా   కొత్త   సీసాలో  పోసినట్లు,
ఓట్లు బొక్కుతూనే  బూట్ల  కింద తొక్కబడుతుంది ,
"ప్రజా స్వామ్యం "


పంపకాల అంపకాల  తెర  దించగానే,
భేతాళుడి భుజం  మీద  మోయ బడుతుంది
" రాజకీయం"


కబ్జాల గిల్లికజ్జాలలో  జరిగి, జరిగి ,
చిరిగిన  చింకి పాతలా  వేలాడుతుంది,  
"రాష్ట్ర పటం ".



నాగళ్ళను విరిచి ,అడవుల్ని నరికి ,
ఉరికోయ్యల్ని తయారుచేస్తుంది,
"పాలక వర్గం"



నిషిద్ద జాడల్లో,మతం దాడుల్లో,కులపు నీడల్లో
నెత్తుటి జండాను ఎత్తుతుంది,
"ఉగ్రవాదం "




నమ్ముకున్న నేల పాదాల కింద ముక్కలవుతున్నా,
వమ్ము కాని నమ్మకం తో ఆశగా ఎదురు చూస్తుంది ,
" ప్రజానీకం "






3 comments:

  1. రాజనీతి పై మీ అస్త్రం బాగుందండి.

    ReplyDelete
  2. నిషిద్ధ గానం గట్టిగా వినిపించారు.
    మీ తెగువకు
    ఆ తెలుగుకు జోహార్లు

    ReplyDelete
  3. అస్త్రం బావుందండి

    ReplyDelete