Pages

Monday 14 December 2015

ఏకాంత శిల




ఏకాంత  శిల 





శబ్దాన్ని   మరచి చలనాన్ని  విడిచిన ,
అనిశ్చత ,అంధకార, నిరాకార ,ఆవాహన ,
ఉద్విగ్న  అక్షర ప్రియం ...,

వేన వేల భావాలకు   బాసటగా నిలిచినా ,
పదాల ,పెదాలపై ..పల్లవించే  తీయని  పరిమళాల,
హృది దోసిలి  నిండా  సజీవ  జ్ఞాపకాలు ...,


పారిజాతాలై  
మది  మందిరాన  రాలుతూ...   ,
మౌనాన్ని  తట్టి లేపి ,మాటను  పట్టి  తెచ్చి ,
మనస్సుకు  లిపి  నేర్పిన  సమయాన ..,

 ఏదో  రూపం ,మరేదో  మోహం...,
జీవన  గతిని  మార్చాలనీ,
అనివార్య ,నిర్వికారత ,విఘాత  తలపుల ,
వికృత  శాపమై ....,

నను  సుషిప్తిలోనికి  జార్చాలని ,
విశ్వ ప్రయత్నం చేసే ....  ఓ .... ఏకాంతమా...,



ఉలిని  చేతబట్టి ..,
శిలను  చెలిగా  మలచిన ..,
మనోహరుని  సాన్నిహిత్యం ...,
నీకు  అల్విదా   పలుకుతుంది .... వినుమా... .,


9 comments:

  1. ఎవ్వరా శిల్పి ? కాంత యేయింతి ? యెచటి
    శిలయది ? యేమిటా శిల్పకళల చాతు
    రీ ప్రతిభ ? నిజమ ? ఉలికి ప్రేమ లూది
    శిలను చెలిగ మలచిన విశేష మేమి ?

    ReplyDelete
    Replies
    1. హ.హా...అవన్నీ..ఇంతి పాట్లు సర్ జీ,
      చూశారా ఆ ఇంతి ఇంతటివారిని కామెంట్ పెట్తేలా చేసింది .._/\_

      Delete
  2. బాగుంది

    ReplyDelete
  3. బాగుంది

    ReplyDelete
  4. నను సుషిప్తిలోనికి జార్చాలని ,
    విశ్వ ప్రయత్నం చేసే .... ఓ .... ఏకాంతమా...,బాగుంది

    ReplyDelete
  5. మేడం గారు...
    హృదయ పూర్వక
    నూతన సంవత్సర శుభాకాంక్షలు ...
    మీకూ - మీ కుటుంబానికి ...

    ReplyDelete