విధి
నా ఏకాంత గానాన్ని నీకు వినిపించాలని,
నిశిరాత్రి గొంతు సవరించుకుంటాను.
ఎముకలు కొరికే చలిలో నీ వెచ్హని స్పర్శ,
నన్ను అంటుకొనే ఉందని భావిస్తుంటాను.
అంతలో కర్తవ్యం గుర్తొచ్హి శత్రువుకోసం,
నిశ్శబ్ద నడిరేయిలో కళ్ళు విప్పార్చి చూస్తుంటాను.
నా గుండెలపై ఆనించిన నీ తల గుర్తొస్తుంది,
భాతమ్మకు సవాల్ విసిరే చొరబాటుదారుడు గుర్తొస్తాడు.
మన ప్రేమ మొలక చిట్టి తల్లి ఇప్పుడెలా ఉందో అనుకుంటాను,
మన దేశ హద్దు దుష్మన్ దాటేశారేమో అని కలవర పడతాను.
నా చిన్ని ప్రపంచం నువ్వూ,నా చిట్టి తల్లీ, అనుకుంటాను,
మరు క్షణం కాదు, కాదు, విశాల భారతం నా కుటుంబం అనుకుంటా..
నా జీవన సహచరీ.. మనసంతా నువ్వే అనుకుంటాను,
నా భారత మాతా, గుండె నిండా నువ్వే, అని ఎప్పటికీ అంటాను.
ఓ అమ్మకు ముద్దు బిడ్డ నే, ఓ ఇల్లాలికి వీర పతినే,
కానీ, భారతమ్మ నమ్మిన సిఫాయిని.
విధినిర్వహణలో ఉన్న వీర జవాన్‌ని.
