ఆకృతి కోల్పోయిన నా మనస్సును కుదించి కుట్టేసుకున్నా
ఎంత కంఫర్ట్ గా ఉందొ.
అస్తిత్వం కోల్పోఇన నా తలపులను వేటాడి భంధించాను
ఎంత కరెక్టగా ఉందొ.
అలమటించే నా మదిని వేదననుండి వేరుచేసాను.
ఎంత హాపీ గా ఉందొ.
అగోచరమైన అభిమానాలను వెతకటం మానేసాను.
ఎంత డైలూట్ గా ఉందొ.
నన్ను నేను చంపేసుకుని పోస్ట్మార్టం చేసుకున్నా.
కొన్ని కొత్త కణాలను చేర్చుకుని నేనున్న ఊహల సౌధాన్ని పునాదులతో పీకిపారేస్తున్నా.
అచ్చోట కొత్త సమాధి కట్టుకుని దానిపై రారాజులా కూర్చున్నా.
కొత్త తలపులతో ద్రోహపు తిమిరాన్ని చీల్చి స్నేహపు సమరాన్ని సాగిస్తున్నా.
ఎంత డైనమిక్ గా ఉందొ.
No comments:
Post a Comment