Pages

Tuesday, 18 December 2012

పొగచూరు బతుకులు.పొగచూరు బతుకులు. 

వింటావా  దుర్బర దారిద్య వాతపడ్డ  ఆకలి కేకలు.
చూస్తావా గూడులేని రోడ్డు బతుకులు.

వింటావా  ఆకలి పేగుల ఆగని  కేకలు.,
చూస్తావా చెత్తకుప్పలలో ఏరుకు  తినే ఎంగిలి ఆకులు.

అటు చూడు  ఓ చెల్లి చిరుగుల చీరలో సిగ్గుతో చితికిపోతుంది.
ఇటు చూడు ఓ తల్లి  ఊపిరితిత్తుల్లో గాలిని బిడ్డ పుండుపై ఊదుతుంది.

ఇదిగో ఈ బుజ్జిముండ చూడు ఆరిపోయిన  ఐసు పుల్ల చీకుతుంది.
అదిగో ఆ బుడ్డోడు చూడు ఆగిన బండ్లు తుడిచి  అడుక్కుంటున్నాడు.

ఇక్కడ చూడు  దొరలు తాగేసిన ఖాళీ సీసాలకోసం  యుద్ధం తీరు,
అయ్యో అక్కడ చూడు ఇసిరిపారెసిన  ఎంగిలాకుల కోసం  జరిగే పోరు.

అక్కడ చెత్త కుండీ వెనుక చూడు  రేపటి పౌరులు  కనిపిస్తారు.
అక్కడ చెట్టు కింద చూడు దిక్కులేని వృద్దులు  కనిపిస్తారు. 

నిబద్దతలేని  జీవితాలు, తెగిన గాలిపటాలు.
అంతటా  పొగచూరిన బతుకులే, వెలుగులేని చీకటి బతుకులే..


గాడితప్పిన  ఈ  బడుగు బండిని  దారిలో పెడదాం.

శ్రమ జీవుల  స్వేదాన్ని   దోచేసే  ధనజీవులను ఎండగడదాం.

అశ్లీలపు చూపులనుండి  అక్కచెల్లెళ్ళకు రక్షణనిద్దాం.

చదువుకునే   తమ్ముళ్ళ కు  సాయమందిద్దాం.

చేయి, చేయి కలిపి  చెలిమి బాట వేద్దాం.

ఆత్మీయతనే అక్షయ పాత్ర చేద్దాం.

మనుషులమని మరోమారు  చాటుకుందాం.


17 comments:

  1. రోజూ లాగే సూపర్. మాటలు లేవ్ !

    ReplyDelete
    Replies
    1. నచ్చిన నెచ్చలికి ధన్యవాదాలు.

      Delete
  2. మీ అక్షరాలను ప్రసంసించడానికి నా దగ్గర అక్షరాలు లేవు.. మాటలు కుడా లేవు.... చాలా బాగుంది :)

    ReplyDelete
    Replies
    1. తమ్ముడూ, కృతజ్ఞతలు అనటం చిన్న మాట అవుతుంది.
      సంతోషం నా కవితను మెచ్చినందుకు

      Delete
  3. ధనజీవులు ఈ దురదృష్టజీవులపై కాస్త కరుణ చూపితే ధన్యజీవులౌతారేమో...
    హృద్యంగా ఉంది.

    ReplyDelete
    Replies
    1. చిన్నిఆశ గారూ, ధనజీవులు ఎవరి మీదా జాలి చూపరు.
      బడుగు బతుకులంటే వారికి చిరాకు.
      ఆకలి ఎరిగిన వానికే తెలుస్తుంది.
      మెచ్చిన మీకు నా ధన్యవాదాలు .

      Delete
  4. మనుషులమని మరోమారు చాటుకుందాం. చాలా బాగుంది ఫాతిమ గారు మీరు ఇచ్చిన పిలుపు

    ReplyDelete
    Replies
    1. డేవిడ్ గారూ,
      నా పిలుపు నచ్చింది, నా సందేశం నచ్చిందీ.
      మీ ప్రోత్సాహానికి నా కృతజ్ఞతలు.

      Delete
  5. ఆత్మీయతను అక్షయ పాత్ర చేద్దాం రండి అంటూ
    మంచి మాట చెప్పారు.
    మానవత్వాన్ని మరవనీయకుండా
    మనుషులమని మరోమారు చాటుదాం అన్నారు.
    భీభత్స రసం నుంచి కరుణ రసంలోకి ప్రయాణింపచేసారు.
    బాగుంది!
    శుభాభినందనలు!!

    ReplyDelete
    Replies
    1. ఆత్మీయత అనే అక్షయపాత్ర ఉండటం చాలా కష్టం.
      అది సాధ్యమైతే ఎదుటి మనిషి ఎప్పుడూ అనాద కాడు.
      దయ కొరవడుతుంది. మానవత్వం మంటగలుస్తుంది.
      మెచ్చిన మీకు నా కృతఙ్ఞతలు తెలుపుకొంటున్నాను.

      Delete
    2. Sree ganga sir, karuna rasam nundi, haasya rasam loki dookaanu, o maaru deevinchandi mee manchi manassuto. haasya rachayitri kaavaalani.

      Delete
  6. మరీ అస్తమానం ఏడిపించేస్తే ఎలా? కొంచెం విరామం ఇచ్చి మళ్ళీ!

    ReplyDelete
    Replies
    1. సర్, మీ మాట ఎప్పుడైనా కాదన్నానా..
      కొత్త పోస్ట్ చూడండీ.. కాస్త నవ్వుకోండి..
      నన్ను మీ మంచి మనస్సుతో దీవించండి.

      Delete
  7. Heart touching, Fathima gaaru. No words.

    ReplyDelete
  8. Priya garu, blog ki welcome. nachhinaduku thanks.

    ReplyDelete
  9. మీ అంతరమున ఆర్దత అర్ధమౌతుంది.
    ఘనీభవిస్తున్న మానవత్వాన్ని మరోసారి ద్రవింపజేశారు.

    ReplyDelete