Pages

Tuesday 28 May 2013













వెడలిపోయే తరం 

ఆకలి పేగులూ,అనారోగ్యాలూ 
కలసి  ఉన్నాయక్కడ. 

ఆశల ఊసులూ,అసహాయతలూ,
కలసి పలుకుతున్నాయక్కడ.

ఆప్తులను వదలేసి అన్నాఅర్తులై,
అలమటిస్తున్నారక్కడ.

గెంటివేయబడిన  ముసలితనం  పై  జాలిపడి,
ముద్ద  వేస్తున్నారక్కడ,

మనవళ్ళతో  ముద్దులాడాల్సిన  వయస్సులో,
సమ ఉజ్జీలతో  సమయాన్ని సాగదీస్తున్నారక్కడ.

ఇంటి  ఆవరణలో తావెందుకు లేదో,
అడిగితే రకరకాల  కారణాలు వినిపిస్తాయక్కడ. 

ఒలుకుతున్న పలుకుల్లో  దిగుల ముళ్ళు,
గుండెలో సూటిగా గుచ్హు కొంటాయక్కడ 

ఉబుకుతున్న కన్నీళ్ళలో నిప్పురవ్వల,
 బ్రతుకు బూడిద రాలుతుందక్కడ.

మృత్యువు  పిలుపుతో ముసలి గువ్వలు ,
నీ తరం కోసం  చోటు ఉంచిపోతున్నారక్కడ. 

అయిన వాళ్ళను  తరిమి వేసి దూరం చేస్తే,
నీ ముంత నీ కొసం తలాకిటనే ఉంటుదక్కడ.

12 comments:

  1. Meraj... నీ ముంత నీ కొసం తలాకిటనే ఉంటుదక్కడ.

    Satyam cheppaaru.

    ReplyDelete
    Replies
    1. వనజా మీ స్పందన నా చేత ఎన్నో కవితలు రాయించింది, ధన్యవాదాలు.

      Delete


  2. భావాలు,పదాల పొందిక బాగున్నాయి.

    ReplyDelete
    Replies
    1. సర్, మీ ప్రశంసకు ధన్యవాదాలు. నా బ్లాగ్ దర్సించినందుకు నా దన్యవాదాలు.

      Delete
  3. ప్రతి పదం ఒక నిజం.

    ReplyDelete
    Replies
    1. నచ్హిన మీకు నా ధన్యవాదాలు.

      Delete
  4. వృద్ధాప్యం శాపం కాకూడదు. చివరి మజిలీ సాఫీగా ఆనందంగా సాగాలి. దానికి దూరం చేస్తున్న సామాజిక, కుటుంబ పరిస్థితులను మార్చుకోవాల్సిన అవసరముంది. మీ కవిత బాగుంది. అభినందనలతో.

    ReplyDelete
    Replies
    1. వర్మ గారూ, మీ మాటలు అక్షరాలా నిజం. మీ స్పందనకు ధన్యవాదాలు.

      Delete
  5. వృధ్ధాప్యంగురించి మీ కవిత బాగుంది. అభినందనలు.

    (అన్నట్లు, కొద్ది రోజుల క్రిందట మీరు పాహి రామప్రభో శీర్షికలో ఒక పద్యానికి భావవివరణ అడిగారు. వ్రాసాను. మీరు చదివి ఉంటారని భావిస్తున్నాను.)

    ReplyDelete
    Replies
    1. శ్యామలీయం గారూ, ధన్యవాదాలు నా కవిత నచ్హినందుకు. మీ పద్యానికి భావ వివరణ చదివాను. అద్భుతం.

      Delete
  6. ఆకలి, అనారోగ్యం, అసహాయత, ఆప్తులనే వారు వొదిలేసి అన్నార్తులై అలమటిస్తున్న ముసలి జీవితాలు. మనవళ్ళతో ముద్దులాడాల్సిన వయస్సులో, ఆ ముడతలుపడ్డ పెదాలు వొలుకుతున్న పలుకుల్లో ఏవో దిగులు ముళ్ళు .... ఆ ఉబుకుతున్న కన్నీళ్ళలో నిప్పురవ్వల బ్రతుకు బూడిద
    నిజం .... మమకారం, అనురాగం, ఆప్యాయత, ఋణానుబంధం పదాలకు అర్ధం తెలియని యువత, రేపటి వృద్దులకు అక్షరాలు, పదునైన పదాలతో బాధ్యతను గుర్తుచేసిన విధానం చాలా బాగుంది. మనోభినందనలు కవయిత్రీ!

    ReplyDelete
    Replies
    1. ఒక్కరైనా మారితే, ఒక్క తల్లినైనా,తండ్రినైనా బిడ్దలు ఆదుకొంటే, నా అక్షరం సార్దకం అయినట్లే చంద్ర గారు.

      Delete