Pages

Wednesday 8 May 2013


   






    కొత్తమ్మ 

   నాన్న కొత్తమ్మని చూపినప్పుడు 
   చంటిదాని బుగ్గలపై కన్నీరింకా ఆరలేదు.

   బెరుకు తీరి  దగ్గరవుతూ ఉంది,
   అదిగో అప్పుడే కొత్తమ్మ పుట్టింటికెళ్ళింది.

   కొన్నాళ్ళకు పొత్తిళ్ళలో బాబుతో వచ్హింది,
   చంటిదానికి సంబరమైంది  తమ్ముడొచ్హాడు.

   కానీ కొత్త భాద్యత వచ్హి పడింది,
   తమ్ముడి ఆలనా పాలనా తానే చూడాల్సి ఉంది,

   నాన్న కూతురుకి చుట్టంలా మారిపోయాడు,
   అప్పుడప్పుడూ పరిచయస్తునిలా నవ్వుతున్నాడు.

   అమ్మా నాన్నలు తమ్ముడితో బైట కెళితే,
   తాను ఇంటికి తాళం కప్పలా అతుక్కుని ఉండేది.

   ఆ ఇంట ఏ తప్పు జరిగినా  దండన రూపంలో ,
   చంటిదాని వీపున వాతలు  తేలేవి.

   మునిమాపు వేళ ఊడల మర్రిపై ఉంటుందన్న,
   దయ్యంకన్నా బయంగా ఉంది కొత్తమ్మంటే.

   ఇంటి చాకిరీతో చదువు అటకెక్కింది అందుకె,
   కొత్తమ్మ చుట్టాలకు తాను పనిపిల్లలా పరిచయమైంది.

   కాలచక్రం లో మరో కొన్ని బాదావత్సరాలు దొర్లాయి.
   చంటిదిప్పుడు  పడుచు పిల్ల అయింది.

ఇనుప చట్రాలకింద పాతయుగం  నలిగిపోయింది,
పసుపుతాడుతో కొత్త గడప తొక్కింది ,
అక్కడా ఓ కొత్తమ్మ (అత్తమ్మ) ప్రత్యక్షమైంది.

(అమ్మలూ, తల్లులూ, మీరూ బిడ్డలు కన్న వారె కనుక, సవతి బిడ్డలకీ, మీ బిడ్డలకీ బేదం చూపి ఆ పసి మనసులను  హింస పెట్టకండి) 


7 comments:

  1. Replies
    1. పద్మ గారూ, థాంక్స్.

      Delete
  2. అమ్మలూ, తల్లులూ, మీరూ బిడ్డలు కన్న వారె కనుక, సవతి బిడ్డలకీ, మీ బిడ్డలకీ బేదం చూపి ఆ పసి మనసులను హింస పెట్టకండి...

    చక్కని సందేశం మేడం..

    ReplyDelete
    Replies
    1. సాయిరాం గారూ, నా బ్లాగ్ కి స్వాగతం. ధన్యవాదాలు మీ స్పందనకు.

      Delete
  3. heart touching...no words to say..

    ReplyDelete
  4. నాన్న కొత్తమ్మని చూపినప్పుడు చంటిదాని బుగ్గలపై కన్నీరు .... నా అమ్మ లేదే అని. మునిమాపు వేళ ఊడల మర్రిపై ఉంటుందంటారు, ఆ దయ్యంకన్నా భయంగా భయపెడుతుంది కొత్తమ్మ. ఇంటి చాకిరీతో చదువు అటకెక్కింది కొత్తమ్మ చుట్టాలకు చంటిది పనిపిల్లలా పరిచయంచెయ్యబడింది.

    మమతానురాగాల మాతృమూర్తి స్థానం ఎలా అవహేళన చెయ్యబడిందో .... వివరణగా అక్షరావిష్కరణ .... కర్తకు (కవయిత్రి గారు) కి మనోభినందనలు.

    ReplyDelete