Pages

Thursday 25 July 2013










   "అందరూ కలసి రండి"

   అందరూ కలసి రండి,
   గొంతు దిగని దు:ఖాన్ని
   పంచుకుందాం రండి.

   చీకటి కోణాల నుండి,
   మురికి కూపాల నుండి ,
   గాయాల గేయాలు విందాం రండి.

   లేత ప్రాయపు నగ్న గుండెలపై,
   నర్తించే ఆకలి చూపుల,
   అన్యాయాలను అరికడదాం రండి.

   రాజదాని నడిబొడ్డు మీద,
   నాట్యమాడే లైంగిక ఆనందాన్ని,
   అడ్డుకుందాం రండి,

   నడిచే దారిలో సంచరించే,
   అరాచక పిశాచాలను,
   అదిలిద్దాం రండి.

   కాలు కదిపితే కక్షలే,
  కంటినుండి జారేవి లావాధారలే,
  అందుకే అక్షరిద్దాం రండి. 

13 comments:

  1. చాలా బాగుంది మేరాజ్ ఫాతిమా గారు. మీకు తెలుగు భాష మీద మంచి పట్టు ఊంది. మీ కవితలు ఈమాట, కౌముది లాంటి వాటికి పంపించండి.

    ఒక్క చిన్న సలహా. మీ బ్లాగు సంకలినో కాని హారంలో కాని సబ్జెక్ట్ చూపించట్లేదు బ్లాగు ఓపెన్ చెస్తే కానీ తెలియదు, కవిత దేని మీద రాశారో. దీని మీద కాస్త శ్రద్ధ పెట్టండి. సింపుల్ టెక్నిక్ ఏమిటంటే, కవితలో మొదటి లైను కాపీ చేసి సబ్జక్ట్ లైన్ లో పేస్ట్ చేయండి.

    బ్లాగు రాయడం మానవద్దు. ఈ కాలంలో తెలుగు నాశనం ఐపోతూంటే మీ లాంటి వాళ్ళు రాయడం, తెలుగు ప్రోత్సాహించడం చాలా ముఖ్యం, తప్పనిసరి.

    ReplyDelete
    Replies
    1. సర్, మీ స్పందనకు ధన్యవాదాలు, మీరు చెప్పిన సలహాలు పాటిస్తాను. మెచ్హిన మీకు మరోమారు ధన్యవాదాలు.

      Delete
  2. మళ్ళీ మెరాజ్ గారి అక్షరప్రవాహం పరవళ్ళు తొక్కుతోంది.:-)

    ReplyDelete
    Replies
    1. పద్మ గారూ, మీ అభిమానం ఉంది కదా తప్పకుండా రాయాలి అనిపిస్తుంది, స్పందించే మీకు ధన్యవాదాలు.

      Delete
  3. రాజదాని నడిబొడ్డు మీద,
    నాట్యమాడే లైంగిక ఆనందాన్ని,
    అడ్డుకుందాం రండి,

    ఈ పై లైన్లు చాలా చాలా బాగున్నాయి .

    ReplyDelete
    Replies
    1. శర్మ గారూ, ధన్యవాదాలు.

      Delete
  4. మీ వాక్యాలెప్పుడూ స్ఫూర్తిదాయకంగా వుంటాయి ఫాతిమాజీ.. అభిన౦దనలతో..

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు మీ ప్రశంసకు వర్మ గారూ,

      Delete
  5. Fathimaji, Meeru telugulo manchi kavitvam rayadam, andulo gontu digani dukham gurinchi aalochana saarinchadam abburanga vundi. Kya aap Urdu aur Hindi me bhi likhti hain? Please continue to write.

    ReplyDelete
    Replies
    1. రాజేందర్ గారు నమస్తే, మీ ప్రశంసకు ధన్యవాదాలు. నేను ఉర్దూ,హిందీ చదివి అర్దం చేసుకోగలను కానీ కవిత్వం రాసేంతటి పాండిత్యం లేదు. సాద్యమైనంతవరకూ సామాజిక అంశాలను ,నా కవితా వస్తువుగా తీసుకొనేందుకు ప్రయత్నిస్తాను.

      Delete
  6. లేత ప్రాయపు నగ్న గుండెలపై, నర్తించే ఆకలి చూపుల, అన్యాయాలను అరికడదాం రండి. రాజదాని నడిబొడ్డు మీద, నాట్యమాడే లైంగిక ఆనందాన్ని, అడ్డుకుందాం రండి,
    మార్గదర్శకతాన్ని నిర్దేశిస్తున్న కవిత .... భావుకుల్లో ఆలోచనల్ని రేకెత్తిస్తూ
    అభినందనలు ఫాతిమా గారు!

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు చద్ర గారూ, మీ విష్లేషణకు సదా నమస్సులు.

      Delete
  7. చాలా బాగుంది మేరాజ్‌ ఫాతిమా గారు

    ReplyDelete