Pages

Tuesday 13 August 2013

చూడు














గుండెను  తట్టి  చూడు,
తలపుల తడి  తగుల్తుంది. 

మనస్సును తవ్వి చూడు,
వలపుల వేడి  తెలుస్తుంది. 

కళ్ళను కళ్ళతో కలిపి చూడు,
చూపుల సఫలం కనిపిస్తుంది. 

ప్రాణాన్ని ప్రేమించి చూడు,
మృత్యువుతో  పోరాడుతుంది. 

జన్మను తరచి చూడు,
జాతిగూర్చి అడుగుతుంది. 

ప్రేమసాగరాన్ని ఈది చూడు,
లంగరు అవసరమే లేదంటుంది.  

రక్తాన్ని మరగించి చూడు,
అగమ్యమై  ఆహా కారం చేస్తుంది. 

లోకాన్ని ప్రశ్నించి చూడు,
అహంకార పైత్యాన్ని  అంటగడుతుంది. 

రాత్రిని కదిపిచూడు,
కలల  దుప్పటి కప్పుతుంది. 

సమాదిని గమనించి చూడు,
నీ మదిలాగే  అనిపిస్తుంది 




12 comments:

  1. Replies
    1. కాదంటారా ?...యేమో మరి.:-)

      Delete
  2. Wow....came back with your style. Nice to read this.

    ReplyDelete
    Replies
    1. పద్మ గారూ, మీ స్పందనే నేను సంతొషంగా రాయటానికి కారణం, మనస్పూర్తిగా ధన్యవాదాలు మీకు.

      Delete
  3. నిజమే కదూ. చూడాల్సినవి ఎన్నో ఉన్నా చూడాలనుకునే వాళ్ళే లేరు!

    ReplyDelete
  4. నిజమే సర్ , చూసే దృష్టీ ఒకలాగే ఉండదు కదా,

    ReplyDelete
  5. ఏంటో ఇలా చూస్తూ అడుగుతూ బ్రతికేస్తున్నాం :-)

    ReplyDelete
    Replies
    1. కదా..,అర్దం చేసుకోరూ...:-) సృజన గారు ధన్యవాదాలు మీ స్పందనకు.

      Delete
  6. ప్రాణాన్ని ప్రేమించి చూడు,
    మృత్యువుతో పోరాడుతుంది... inspiring lines Madam.. kudos..

    ReplyDelete
    Replies
    1. వర్మ గారూ, కవిత మెచ్హిన మీకు నా ధన్యవాదాలు.

      Delete
  7. తరచి చూడు, మది తలుపులను తెరిచి చూడు ... సత్యమేమిటో తెలుస్తుంది అన్న పెద్దల మాటకు దర్పణం పడుతుంది మీ ఈ కవిత.

    ReplyDelete
  8. మనస్సును తవ్వి చూడు, వలపుల వేడి తెలుస్తుంది. ...... ప్రాణాన్ని ప్రేమించి చూడు, మృత్యువుతో పోరాడుతుంది. .... లోకాన్ని ప్రశ్నించి చూడు, అహంకార పైత్యాన్ని అంటగడుతుంది.
    ప్రతి ట్విన్ ఒక మణి లా మెరుపులా కవయిత్రి కళ్ళతో చూడాలనిపిస్తూ .... "చూడు" కవిత చాలా బాగుంది.
    అభినందనలు ఫాతిమా గారు!

    ReplyDelete