Pages

Monday 19 August 2013

"ఎడారితనం "








"ఎడారితనం "



బోలీ,బొంతా  నెత్తికెత్తుకొని,
ఊరూరా  తిరుగుతూ,
అరిగిపోయే కాళ్ళతో,
తరిగిపోయే దూరాన్ని కొలుస్తూ.

చెట్టుకింద చదును చేసుకొని,
చిరుగు  చీర  ఊయలలూగుతూ,
అల్లరిగా ఆడుకుంటూ,
ఆకలీ జయించాలని చూస్తూ,

ఏ ఇంట దొంగతనం జరిగినా,
మమ్మల్నే వెతుక్కుంటూ ,
ఖాకీ లొచ్చి అమ్మా నాన్న బొక్కలిరగొట్టి,
బోనులో తోస్తే  బైట బోరుమని ఏడుస్తూ. 

శైధిల్య  మబ్బుతెరల మాటున,
మిణుకు,మిణుకు మనే జాబిల్లిలా,
సుదీర్గ జీవితపు చీకటి నీడల్లో,
వెలుతురు  వెతికే వంటరితనంతో. 

నెత్తురు నాళాల్లో  పరుగులు తీసే,
పసితనపు  పవురుషాన్ని,
కట్టలు తెంచుకొన్న కోపాన్ని 
వాస్తవానికి తెచ్చి వణికిపోతూ . 

చిట్లిన  అమ్మానాన్నల  
అంగాంగాలను గుండెకు హత్తుకొంటూ,
అమానుషం  అని అరవలేక,
ఎదిరించాలేకా  ఏడుస్తూ..,

రుదిర స్నానిత శోఖితనై  ,
హృదయ  శఖలాల సమాదుల్లో 
వెక్కిళ్ళ మద్య  వెక్కిపడుతూ,
హరితహీన మోడులా విలపిస్తూ... 
  

10 comments:

  1. Really excellent,chaalaa rojula taruvata ee roaju mallee naa kallu chemarchaayi ,

    ReplyDelete
    Replies
    1. రోహిణి గారూ, నా బ్లాగ్ కి స్వాగతం మీ ప్రసంశకు ధన్యవాదాలు.

      Delete
  2. ఈ మీ ఆ వేదన సమాజంలోని దీనులైన దయనీయులపై చాలా బాగుంది .

    ReplyDelete
    Replies
    1. సర్, మీ అభిప్రాయానికి ధన్యవాదాలు.

      Delete
  3. టైటిల్ లోనే 90 మార్కులు కొట్టేసారు

    ReplyDelete
    Replies
    1. సాగర్ గారూ, మీ ప్రశంస తో మిగతా పది కూడా కొట్టేసినట్లే..:-)

      Delete
  4. Replies
    1. దేవి గారూ, సంతోషం మీ స్పందనకు.

      Delete
  5. కొన్ని పద ప్రయోగాలు
    గాఢమైన భావాన్ని
    కనులకు కట్టే
    చిత్రాలుగా అమిరాయి.
    అభినందనలు!

    ReplyDelete
    Replies
    1. సర్, మీ ప్రశంసకు ధన్యవాదాలు.

      Delete