Pages

Monday 2 June 2014

కొత్త (బాట) చోట

    






    కొత్త (బాట) చోట 

    నీ వంతుగా  మిగిలిన  మెతుకుల్ని ,
    ముద్ద చేసుకు  తినటం  నేర్చుకో. 

    తేనెటీగల జోలె నీకెందుకూ..,
    పూ.. మకరందం నీదే అనుకొ... 

    వర్షం వెలిసిందా.. అని చూడు,
    ఇల్లు ఉరుస్తుందా అని చూడకు.

    అడ్డదారుల  సూత్రాలూ..,అర్దం లేని అపార్దాలూ,
    దారితప్పిన  దారిద్ర్యపు  తలపులే తెలుసుకో..,

    రాజ్యం మారిందా  అని  రంకెలేయకు,
    రాచమార్గం  వెతుక్కొని  నడువు.

    మూర్ఖుల  కార్కానాలో నమూనా కాకు,
    ముప్పు  ఎరిగి మసలుకో. 

    కొత్త వింతా కాదూ, పాత రోతా కాదు.
    నవ్యదారిలొ... నీ భవిత వెతుక్కో. 

    కాల చరిత్రలోకఠిన  సత్యమే ఇది.
    నేటి నుండీ  నీ  బాటవెతుక్కో..., ఇంత చోటు చూసుకో.  







4 comments:

  1. ఫాతిమా గారూ !
    మీ భావాలు ఓ నూతన యుగం లోకి తీకుకువెల్తున్నాయి.
    పరిపూర్ణ మైన నిండుదనం ఉంది మీ మాటల్లో .
    ఆశను రేకిత్తించడం కాదు .
    బ్రతుకు బాటలో చుడాల్సినవి ఎన్నో అని గుర్తు చేస్తున్నారు.

    " అడ్డదారుల సూత్రాలూ..,అర్దం లేని అపార్దాలూ,
    దారితప్పిన దారిద్ర్యపు తలపులే తెలుసుకో..,

    రాజ్యం మారిందా అని రంకెలేయకు,
    రాచమార్గం వెతుక్కొని నడువు."

    ప్రతి పలుకులో ఓ వినూతనమైన సందేశం ఇమిడి ఉంది.
    మీరెంత అణుకువ కలిగిన అధ్యాపకురాలో మీ ప్రతీ కవితా
    చెబుతూనే ఉంటుంది .

    ఒక వైపు అడుగుల దిశను చూపిస్తూ ..
    మరో వైపు ఆత్మ స్థైర్యాన్ని అందిస్తున్నారు ఈ సమాజానికి .

    ధన్యులు మీరు.
    అభినందించతగ్గ కవితనందించి నందుకు
    కృతజ్ఞతలు మీకు ఫాతిమా జీ .

    *శ్రీపాద

    ReplyDelete
    Replies
    1. నా కవితలో నా వ్యక్తిత్వాన్ని ,వృత్తినీ తేటతెల్లపరిచే అంశాలు మీకు గోచరించటం నిజంగా సంతోషం.
      నా సాహిత్యాన్ని ప్రతి పదమూ చదివి , విష్లేషించే మీ అభిమానానికి సర్వదా రుణపడి ఉంటాను.

      Delete
  2. కొత్త వింతా కాదూ, పాత రోతా కాదు.
    నవ్యదారిలొనీ భవిత వెతుక్కో.
    True

    ReplyDelete
    Replies
    1. ధన్యవాదాలు సర్ జి

      Delete