Pages

Friday 18 July 2014

నడిచే కల,

     




     


     నడిచే కల

     ఆమె నడుస్తుంది,
     కలలతో కలసి
     అడుగు కలుపుతుంది.
     అడవి మల్లె  అందాన్నీ..
     ఆత్మీయ బంధాన్నీ..,
     తనలో ఇముడ్చుకుంది.

     ఓ సుందర స్వప్నాన్ని
     కలవాలనీ..,
     వశీకరణంతో,
     ఒడిచేర్చుకోవాలనీ..,
     ఆశతో జీవిస్తుంది. 

    మనస్సంతా  
    ఎదురుతెన్నుల కన్నులైతే..,
    దూరమయ్యే అడుగుల 
    చప్పుడు ఎదపై వినిపిస్తుంది. 

    చిక్కటి చీకటి గదిలో..,
    తుదిలేని  మది  తలపులతో..,
    బ్రతుకంతా  పయనిస్తుంది.
    శబ్దమై పాకుతూ.., 
    శ్వాసై  తాకుతుంది. 





8 comments:

  1. కలలు కంటారందరూ ,
    గుర్తుండేది కొందరికే ,
    ఆ కలను ఙ్నప్తికి తీసుకొచ్చి నడిపించటం ,
    నడిచే కలగా రచించి చిత్రించటం చాలా బాగుంది .

    ReplyDelete
    Replies
    1. అన్నయ్యా...ఎన్నో కలలు మనల్ని నడిపిస్తాయి.

      Delete
  2. శబ్దమై పాకుతూ ...
    శ్వాసగా తాకుతూ ...

    రామ్ గోపాల వర్మ గారి బొమ్మలతోనే
    హడలెత్తి చస్తుంటే మీరు కూడా ఏంటి మేడం ...

    ఈ రాత్రికి నిదుర గోవిందా...

    కెవ్వని అరిపిస్తూ ...
    కేక పెట్టించారు.

    ReplyDelete
    Replies
    1. అయ్యో అంత బయంకరంగా ఉందా నా కల.

      Delete
  3. Replies
    1. థాంక్స్ వర్మాజి.

      Delete
  4. మనస్సంతా
    ఎదురుతెన్నుల కన్నులైతే..,
    దూరమయ్యే అడుగుల
    చప్పుడు ఎదపై వినిపిస్తుంది.
    మనసును తాకాయి మీరజ్.........

    ReplyDelete
  5. దేవీ...కొన్ని భావాలు మనసున్న మనుషులకే అంకితం.
    సాహితీ విలువలు తెలిసిన వారికే సొంతం.
    నచ్చినందుకు సంతోషం

    ReplyDelete