Pages

Monday 21 July 2014

కంటి (ఇంటి) దీపం

    





    కంటి (ఇంటి) దీపం 

    మునిమాపువేళ  బారులు తీరిన కొంగల 


    రెక్కల చప్పుళ్ళ రొదలో ,


    నా ఆలోచనలను చెదరగొడుతూ 


    ఎవరెవరివో  బాదాతప్త  హృదయరోదనలో


    పేగు బంధాల  మూగ వేదనలో 


    గిర్రున తిరుగుతున్న నా తలలో


    ఎన్ని  ఆలోచనలో.. ఉప్పగా జారేకన్నీరు 


    నాపెదవులను తడుపుతూ....కన్నీటి తలపువై  


    నన్ను నా నుండి దూరం చేసి,  


    అదృశ్యమైన నీవు అనివార్యమరణమై,


    అర్ధంలేని వార్తవై ,అంతు దొరకని పరిశోదనవై,


    అంతర్దానమై,అపఖ్యాతివై,అఘోచరమై,... 


    నా గుండెపై నిత్యం రగిలే ప్రేమజ్వాలవై...,


    నా  అసమర్ధతకు బలైన నిస్సహాయవై ...,


    నా గుండెను నిత్యమూ సలిపే జ్ఞాపకానివై..,


    నా చుట్టూ శిరశ్చేదిత  చలన  దేహాలే..,


    చిక్కు ముడి విప్పలేక 


    బేతాళ శవాన్ని మోసే విక్రమార్కులే..,


    పక్కన పిడుగు పడ్డా వినిపించని బదిరులే..,


    అర్దంలేని  ఊసుపోని  వ్యర్ద ప్రేలాపాలే... 


    నా వేదనకు అంతం లేని వృదా ప్రయత్నాలే,


    నువ్వు మాయమైంది జనారణ్యములో,


    జంతు అరణ్యానైతే కేవలం ప్రాణమే పోయేది. 


    నీ కన్నీళ్ళ నిస్సహాయ రోదన 


    ఆ కామాందులను  కరిగించగలిగితే, 


    నీవెప్పుడో మానవీయ  వంతెనపై నడిచి,


    మరో మంచు ముత్యానివై మమ్ము చేరవా..,


ఈ గాంధారీ  సుతుల  వస్త్రాపహరణానికి  తెరపడి,
కలియుగ  కురుక్షేత్రం జరిగేదెప్పుడు 
ఒంటరి సీతమ్మలనెత్తుకెళ్ళిన  రావణాసురులకు 
వాయుపుత్రుని వాసన తగిలేదెప్పుడు...?????     

     

5 comments:

  1. ఫాతిమాజీ ,

    ఈ కవిత నీ ఆవేదనను వెల్లడి చేస్తున్నది .
    ఐతే చాలా అసంపూర్ణంగా , అసంబధ్ధంగా అగపడ్తుంది .

    ఇలా వుంటే బాగుండేదేమో . పరిశీలించి చూడు .

    సమంజసమనిపిస్తే , కరెక్ట్ చేసుకో . లేకుంటే ఈ వ్యాఖ్య ప్రచురించనే ప్రచురించవద్దు .


    నా గుండెపై నిత్యం రగిలే ప్రేమజ్వాలవై...,
    నా అసమర్ధతకు బలైన నిస్సహాయవై ...,
    నా గుండెను నిత్యం సలిపే జ్ఞాపకానివై..,
    అంతర్దానమై, అర్ధంలేని వార్తవై ,
    అంతు దొరకని పరిశోదనవై,
    అపఖ్యాతివై,అగోచరమై,...

    చిక్కు ముడి విప్పలేక ,
    బేతాళ శవాన్ని మోసే విక్రమార్కుడిలా..,
    నే అటు యిటూ పచార్లు చేస్తుంటే ,

    మునిమాపువేళ బారులు తీరిన కొంగల
    రెక్కల చప్పుళ్ళ రొదలో ,

    నా చుట్టూ శిరశ్చేదిత చలన దేహాలే..,

    ఎవరెవరివో బాధాతప్త హృదయరోదనలలో,
    పేగు బంధాల మూగ వేదనలలో,
    గిర్రున తిరుగుతున్ననా ఆలోచనలను చెదరగొడుతూ ,
    కన్నీటి తలపువై ,నా పెదవులను తడుపుతూ....
    ఉప్పగా జారే ఆ కన్నీరు ,

    నువ్వు మాయమైంది జనారణ్యములో ,
    వనారణ్యంలో కానే కాదు ,
    అదే ఆ జంతు అరణ్యమైతే ,
    ప్రాణాన్నైనా దక్కించుకొనేదానివి

    నీ కన్నీళ్ళ నిస్సహాయ రోదన ,
    ఆ కామాందులను కరిగించగలిగితే,
    నీవెప్పుడో మానవీయ వంతెనపై నడిచి,
    మరో మంచు ముత్యానివై నన్ను చేరేదానివే..,

    పక్కన పిడుగు పడ్డా వినిపించని బధిరుల్లా..,
    నా ఈ వేదన అంతం లేని వృదా ప్రయత్నమేలే,


    ఈ గాంధారీ సుతుల వస్త్రాపహరణానికి తెరపడి,
    కలియుగ కురుక్షేత్రం జరిగేదెప్పుడు
    ఒంటరి సీతమ్మల నెత్తుకెళ్ళిన రావణాసురులకు
    ఆ వాయుపుత్రుని వాసన తగిలేదెప్పుడు...?????

    ReplyDelete
    Replies
    1. విపరీతమైన పని వతిడి వల్లా మార్చటానికి కుదరలేదు సర్,
      ఈసారికి ఇలా వదిలేసి, ఇకముందు మీ సలహా పాటిస్తాను.

      Delete
  2. గాంధారీ సుతుల సంతతి పెరుగుతోంది, తరగటం లేదు.

    ReplyDelete
    Replies
    1. నిజమే సర్,
      మీ స్పందనకు ధన్యవాదాలు

      Delete
  3. Baagundi akka...kani sharma gaaru rasinadanilaa unte inkaa baagundedi. edi emaina nee manasulo avedana kanaparichavu:):)

    ReplyDelete