Pages

Monday 16 January 2012

గ్రంధం

గ్రంధం


నువ్వు పల్లవి కాదు పాడుకునేందుకు.
            పద్యానివీ కాదు వల్లే వేసేందుకు.
            ధనానివి కాదు దాచుకునేందుకు.
            శ్రమవి కాదు దోచుకునేందుకు.
            గతానివి కాదు తవ్వుకునేందుకు.
            జతగానివి కావు నవ్వుకునేందుకు.
            ఆభరనానివి కావు అలంకరించేందుకు.
            ఆకర్ష్హనవి కావు    అలరించేందుకు.
            శంఖానివి కావు పూరించేందుకు.
            బింకానివి కావు ఊరిన్చెన్దుకు.
            పనివి కావు పంచుకునేందుకు.
            ధ్వనివి కావు వినిపించేందుకు.
 నువ్వు గ్రంధానివి అందుకే ప్రజకి అంకితం ఇస్తున్నా.
             పదిమందికీ దారి చూపగలవని ఆశిస్తున్నా.

(నవ్య వారపత్రిక 12.10 .2011 )

7 comments: