నా ఎదపై వెన్నెల సంతకానివీ
నా గమనానికి గతివీ
నా గానానికి శ్రుతివీ
నా భవితకి బాటవీ
నా కవితకి భావానివీ
నా ఆశల సౌధానివీ
నా ఆశయాల సారదివీ
నా మాటలలో మధుర్యానివీ
నా ఆటలో సారధ్యానివీ
నా పాటలో పల్లవివీ
నా తోటలో మల్లెలవీ
నా శ్వాశలో స్వచ్చానివీ
నా ధ్యాసలో నిత్యానివీ
నా నా ఆలోచనలలో పూలజల్లువీ
నా ఆస్వాదనలో జాబిల్లివీ
నా నా వయస్సుకి సరిజోదివీ
నా ఊహలకి ఊపిరివీ
నా ఊసులకి సరిగామవీ
నువ్వే ఈ కోకిల కోరిన ఆమనివి
నువ్వే ఈ కోవెలలో కొలువైన దైవానివి.
(ఆంద్ర భూమి వారపత్రిక 02 June 2011)
No comments:
Post a Comment