Pages

Monday 3 December 2012

నీవెప్పుడూ చూడలేవు.






నీవెప్పుడూ చూడలేవు.

ఆకలి తన కబంధహస్తాలతో కబళిస్తుంటే....
మురికి గుంటనుండి కుళ్ళిపోయిన జాంపండు తీసుకుని తింటుంటే....
అది జామపండా, రోగపు చెండా నువ్వెప్పుడూ  చూడలేవు.....

మంచు వాడియైన ఖడ్గంతో తనను కోస్తున్నా....
చిరుగుల కొంగును కప్పుకుని పాచి పనికి వెళ్ళే ఇల్లాలి పగిలిన పాదాలు.... 
వణికే పక్కటెముకలూ నువ్వెప్పుడూ చూడలేవు.

రాత్రంతా మానవ మృగాలు వేటాడుతుంటే.....
చీకటి చాటున నక్కి నక్కి బిక్కు బిక్కు మంటూ గడిపిన అనాధ చెల్లి మూగవేదన
నువ్వెప్పుడూ చూడలేవు.

అమ్మా, అయ్యా లేని చిన్నారులు .... 
ఆకలికై  ఏడ్చి ఏడ్చి కన్నీరింకిన సైకత సరోవరాల రోద 
నువ్వెప్పుడూ వినలేవు.


ఆకలి మంటలు నిను దహించవు. 
వెతల కొడవళ్లు  నిను కోయవు. 
అప్పుల బాధలు నిను అంటవు. 
పంచేంద్రియాలూ పని చేయని నీకు 
బతుకు బండి కింద నలిగే జీవచ్చవాలు,
ఆకృతులూ, ఆక్రందనాలూ ఎప్పటికీ తెలియవు .
  

22 comments:

  1. పంచేంద్రియాలూ పని చేయని నీకు
    బతుకు బండి కింద నలిగే జీవచ్చవాలు,
    ఆకృతులూ, ఆక్రందనాలూ ఎప్పటికీ తెలియవు--
    ఈ వాక్యాలు చాలా బావున్నాయి ఫాతిమా గారు..

    ReplyDelete
    Replies
    1. దీప గారూ,మీ ప్రసంసకు ధన్యవాదాలు.బ్లాగ్ కి స్వాగతం

      Delete
  2. ఎవరినండీ నిందిస్తున్నారు,
    చదువు'కొనే' మమ్మల్నా,
    ఎక్కడున్నాడో తెలియని దేవుడినా?
    కవిత గుండెలను పిండేలా ఉంది.
    ఇవేమీ నా చుట్టూ జరగటం లేదు
    అని ముసుగు తన్ని పడుకోవాలని ఉంది.
    కాని నిద్ర వస్తే ఒట్టు!

    ReplyDelete
    Replies
    1. సర్, చదువు కొంటున్నామని ఒప్పుకున్న మీకు ధన్యవాదాలు.
      కానీ నిందించింది మాత్రం మిమ్మల్ని కాదు. యెందుకంటె నిద్ర పట్టలెదు అంటె మీరు కూదా ఆలొచిస్తున్నారు అని అర్ధం.

      Delete
  3. ఫాతిమా గారు, గుండెని సూటిగా మీ అక్షర బాణలు తాకాయి.. ఎంత వాడిగా వేశారండీ అక్షరబాణాలు.

    ReplyDelete
    Replies
    1. చిన్నిగారూ, ఇవన్నీ గుండెలొ తొలెచె బాణాలె ఇలా బైతకి గాయాలై కనిపిస్తాయి.

      Delete
  4. Replies
    1. ధన్యవాదాలు చాతకం గారూ.

      Delete
  5. గడప దాటితే కంటికి కనిపించే విషయాలు అన్ని ఇవ్వే రోజు చూస్తూనే ఉన్నానండి...

    ReplyDelete
    Replies
    1. మీ స్పందనకు ధన్యవాదాలు

      Delete
  6. అన్నీ చూడగలము.
    కాని ఏమీ చేయలేము.

    ReplyDelete
    Replies
    1. డన్యవాదాలు మీ స్పందనకు బొనగిరిగారు

      Delete
  7. పదునైన ప్రశ్నలు. సూటిగా మానవత్వాన్నే నిలదీస్తున్నాయి.

    ReplyDelete
    Replies
    1. భారతి గారు, మానవత్వం మేలుకొంటుంది అంటారా ఏమొ.కవితన మెచ్హుకొన్న మీకు ధన్యవాదాలు

      Delete
  8. మేరాజ్ గారు, ఒక్కోసారి మీ కవితలు చదువుతుంటే మనసంతా అదోలా అయిపోతుంది.
    అంత బాగా రాస్తారు మీరు.

    ReplyDelete
    Replies
    1. వెన్నెల గారూ, మనసు సున్నితం అయితె,
      ఇదే బాద మనల్ని నిలువనీయదు, మీకు నా బ్లాగ్ కి పుంన:స్వాగతం

      Delete
  9. మనసు పిండేస్తే ఎలా :)

    ReplyDelete
  10. Sir, manasunndi kadaa anduke meekalaa anipistundi. thank you.

    ReplyDelete
  11. ప్రశ్నలు మానవత్వాన్నే నిలదీస్తున్నాయి.

    ReplyDelete
  12. Dear, kavitanu ardam chesukunnanduku thanks.

    ReplyDelete
  13. చుట్టూ తిరుగాడే దయనీయ జీవుల జీవన వ్యధ చూసీచూడనట్టుపోయే అందరికీ మీ కవిత సూటిగా తగులుతుంది. పనిచెయ్యని పంచేంద్రియాలూ పనిచెయ్యటం మొదలెడతాయి, ముందుగా ఆలోచనలతో...
    ఎప్పటిలానే ఇలాంటి కవితల్లో మీరు దిట్ట.

    ReplyDelete
  14. chinni aasha gaaroo, mee abhimaanaaniki dhanyavaadaalu.

    ReplyDelete