Pages

Sunday 16 December 2012

కన్నీటి తోడు.



కన్నీటి తోడు. 

గాలివానకు కుప్పకూలిన పంటను చూసి ,
పేద రైతు  గుండెపగిలినప్ప్పుడు.

కన్నకూతురు కాలి బూడిదైన వార్త,
అమ్మానాన్నలు  విన్నప్పుడు.

నిస్సహాయురాలైన అంధురాలిని,
కామందులు కాటువేసినప్పుడు,

కట్ట్టినవాడే తాళిని ఎగతాళి చేసి,
ఇల్లాలిని వెళ్ళగొట్టినప్పుడు.

నచ్చిన వారు పరాయివారిలా ,
పరామర్శించినప్పుడు.

దూరతీరాలకెళ్ళిన  ఆత్మీయులు,
విగతజీవులై ఇల్లు చేరినప్పుడు.

కలల పంట అనుకున్న బిడ్డడు,
వికలాంగుడుగా జన్మించినప్పుడు.

మొర  ఆలకించమని మొండిచేతులతో,
దేవుని  వేడుకొంటున్నపుడు. 

నివురుగప్పిన  దిగులు తెరలు,
కళ్ళను  స్పర్శించినప్పుడు.

వేదనకు  వీడ్కోలు చెప్పే,
అమృత కలశాలు  నీ కన్నీళ్లు.

నిన్ను ఓదార్చే ఆత్మీయ హస్తాలు,
ఈ కన్నీటి నేస్తాలు నీకు మరపు మందులు.


కవితాసుమహారం లో నూరో  సుమం  మీ ముందుంచుతున్నాను.






నా వందో  కవితను  మీ ముందు ఉంచేందుకు సాహసించాను. చాలా సంతోషంగా ఉంది.
ఇంతవరకూ నా ప్రతి కవితనూ,చదివి,విశ్లేషించి, విమర్శించి, మెచ్చుకొని, నొచ్చుకొని  నన్ను ఓ కవయిత్రిగా  గుర్తించిన మిత్రులకూ, నన్ను ఆశీర్వదించిన  అక్షర గురువులు  శ్రీగంగ గారికి, లక్కాకుల రాజారావ్ గారికి, కష్టేఫలిగారికి, గోపాలకృష్ణ గార్లకు, ఈ బ్లాగ్ పలకని నా కిచ్చి  నా కవితలను  రాసుకోమన్న మా శ్రీ వారికి, నా కృతజ్ఞతలు.
                                                          మెరాజ్ ఫాతిమా.







38 comments:

  1. వందో టపా, అభినందనలు :)
    మరెన్నో వందలు ప్రచురించాలని కోరుకుంటున్నాను :)
    బాగుంది ఈ టపా :)

    ReplyDelete
    Replies
    1. హర్షా, సంతోషం మీ హాస్య కథ కూడా చదివాను బాగుంది.

      Delete
  2. శతం జీవ శరదో వర్ధమనా, దీర్ఘాయుష్మస్తు, దీర్ఘసుమంగళీ భవ. శతమితిశతం . అనేక శతాలు రావాలి మీ నుంచి.

    నిన్ను ఓదార్చే ఆత్మీయ హస్తాలు,
    నీకు మరపు మందు ఈ కన్నీటి తోడు.

    గుండె భారం చేసేరు.

    ReplyDelete
    Replies
    1. సర్, ధన్యురాలిని అయ్యాను మీ దీవేనతో, ఏ స్త్రీ కైనా ఇంతకంటే ఏమి కావాలి.
      మీ ప్రోత్సాహమే నన్ను ముందుకు నడిపింది. ధన్యవాదాలు.

      Delete
  3. Replies
    1. Prince gaaroo, mee abhimaanaaniki dhanyavaadaalu.

      Delete
  4. మెరాజ్ గారు!
    హృదయకపూర్వక అభినందనలు.
    చాల అద్భుతంగా వ్రాస్తున్నారు. మీ ప్రతీ పోస్ట్ ఒకదానిని మించి ఒకటుంది. వందలు వందలై మరిన్ని అమూల్య పోస్ట్స్ మీకలం నుండి జాలువారాలని ఆశిస్తూ.........

    ReplyDelete
    Replies
    1. భారతి గారూ, మీ అభిమానం, హుందాతనం నాకు నచ్చుతాయి.
      ఇంకా రాయటానికి మీరిచ్చిన స్పూర్తి చాలు నాకు.

      Delete
  5. శతాధిక ఠపాల ని వైవిధ్య భరితంగా అందించిన కవితా సుమహారం కి అభినందన మందారమాల .

    ఇవ్వగలనా.. మీకొక సుమహారాల మాల.

    ఎదురుగా లేకనే ఈ అక్షరమాల

    దరి చేర్చి ఆత్మీయ ఆలింగనం చేసి అందించే శుభాకాంక్షల హేల

    ప్రేమతో.. వనజ

    ReplyDelete
    Replies

    1. వనజా, మీ ప్రతి అక్షరమూ నన్ను ఆలింగనం చేసుకుంటుంది.
      మీ ప్రతి హెచ్చరికా నన్ను వెన్నుతడుతుంది.
      నేను బ్లాగ్ స్టార్ట్ చేసిన కొత్తల్లో "కవికులాన నేను మెచ్చిన నేచ్చేలివి " అన్న మీ వ్యాఖ్య నేను మరచిపోలేను.
      నా స్నేహితురాలిగా, సోదరిగా బావిస్తాను నేను. మీ అభిమానానికి ధన్యవాదాలు.

      Delete
  6. నూరవ టపా.....అభినందనలు!
    నవ్విస్తారనుకున్నా 100వ పోస్ట్ లో...

    ReplyDelete
    Replies
    1. పద్మ గారూ, ధన్యవాదాలు,
      నవ్విస్తాను. ముందుగా కొంత ఏడిపించి.:-))

      Delete
  7. అభినందనలండి.
    మీరు మరిన్ని చక్కటి రచనలను వ్రాయాలని కోరుకుంటున్నానండి.

    ReplyDelete
    Replies
    1. anrd,garu,మీ అభిమానము ముందు నా కవితలేపాటి, యిట్టె రాసేస్తాను.

      Delete
  8. వైవిధ్యమైన రచనలను మరెన్నిటినో అందించాలని కోరుకుంటూ
    హృదయకపూర్వక అభినందనలండి...

    ReplyDelete
    Replies
    1. రాజి గారూ, మీ అభిమానానికి కృతఙ్ఞతలు.
      మీరు అందించిన కమ్మని సంగీత ఝురి కంటేనా చెప్పండీ.

      Delete
  9. మీ రచనా వ్యాసంగం కలాకాలం కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. అభినందనలు మెరాజ్ గారు.

    ReplyDelete
    Replies
    1. జ్యోతి గారూ, మీ అభిమానం కలకాలం ఉండాలని కోరుకుంటున్నాను.

      Delete
    2. jyothi gaaroo, o sandarbamlo meeru naa kosam entha odaarpu raasaaro nenu marachipolenu.

      Delete
  10. శత కవిత బాగుంది!
    కన్నీటిలో అమృతాన్ని,
    మరుపులో మందుని దర్శించారు, బాగుంది.
    మీరు శ్రీ శ్రీ కి మానస పుత్రిక అని,
    ఆయన మిమ్మల్ని స్వయంగా ఆశీర్వదించారు అని
    నాకు తెలుసు.
    ఈ శుభసమయంలో అందరితో ఈ విషయం ప్రస్తావించాలనుకున్నాను
    అన్యథా భావించకండి.
    ఈ వంద మిమ్మల్ని పద ముందుకు అంటూ ప్రోత్సహించాలని
    ఆడ పిల్లలకు ఫ్రీ సీటు ఇచ్చే మీ స్కూలు ఆ భగవంతుడి దయ వల్ల
    వృద్ధిలోకి రావాలని కోరుకుంటున్నాను.

    ReplyDelete
    Replies
    1. sir,నేను సామాజిక స్పందన రాయటానికి ఆ శ్రీ.శ్రీ. కొంత వరకే సహకరించారు,
      కానీ, ఈ శ్రీ.సర్, నేను రాయగలను అనే నమ్మకాన్ని కలిగించి, నా ప్రతి పోస్ట్ చూసి మెచ్చుకొని (నేను ఎలా రాసినా) నన్ను ప్రోత్సహించారని గర్వంగా చెప్పుకొంటున్నాను. ఎన్నో సంకలనాలు అలవోకగా అచ్చువేయించుకున్నా..( నిగర్విగా) మీ బుక్ కోసం ఎదురుచూస్తున్నాను అన్నారు, మీ కవితల మీద ఎవరైనా డాక్టరేట్ తీసుకుంటారు అన్నారు. ఈ వ్యాఖ్యలు చాలవా సర్ నేను ఇంకా రాయటానికి.
      సర్, సదా కృతజ్ఞురాలిని.

      Delete
  11. శ్రీ గంగ గారి వ్యాఖ్యతో.. మీ గురించి మరింత తెలిసింది.

    మీరు నిజంగా శ్రీ శ్రీ గారి మానస పుత్రికే! సామాజిక సృహతో.. పెల్లుబుకిన ఆవేశంతో.. కవిత్వ విలువలతో.. కవిత్వం ని ఆవిష్కరిస్తున్నారు.

    మీ ఆచరణీయ మార్గం మరెందరికో ఆదర్శం కావాలని ఆకాంక్షిస్తూ.. అభినందనలు (తక్కువేమో )

    ReplyDelete
    Replies
    1. వనజా, నేను సామాజిక ధోరణి ఎక్కువగా నా రచనల్లో ఉండేలా చూడటానికి కారణం నిత్యం నేను చూస్తున్న సంఘటనలు నన్ను వేదనకు గురిచేస్తాయి.ఇకపోతే ఈ మద్య ఓ విమర్శ వచ్చింది, వేరు,వేరు ఫేక్ ఐడిలతో నన్ను అడిగారు రాయటమేనా లేక ఆచరించటం ఏమైనా ఉందా అని.
      ఇక్కడ ఓ ఉదాహరణ చెప్తాను , ఓ తాగుబోతు ఎదుటివాడిని తాగకురా బాబూ అన్నాడనుకో.. చూసావా వీడు తాగుతూ నీతులు చెప్తున్నాడు అంటే తప్పు, ఆతను తాగుబోతే అయినా చెప్పింది మంచే కదా.. నేను ఏంతో కొంత సేవ చేస్తూ రాస్తున్నాను. ఇది నేను ఎవరినీ నమ్మించాల్సిన అవసరం లేదు నాకు.

      Delete
  12. హృద్యమైన కవితతోనే వందా పూర్తిచేశారు.
    వంద సుమాల విందుకి అక్షర అభినందనలు!

    ReplyDelete
    Replies

    1. చిన్నిఆశ గారూ, ధన్యవాదాలు,
      ఏమిటో కలం అలా వేదనగానే రాస్తుందండీ...:-))

      Delete
  13. మీరు వంద పోస్టులు పూర్తీ చేసినందుకు చాలా సంతోషంగా అభినందనలు తెలియజేస్తున్నాను మేరాజ్ గారూ!
    మీ కవితలు...కథలు అన్నీ మమ్మలనందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి...చక్కని కవితతో సెంచరీ కొట్టారు...
    ఇలాంటి వ్సెంచారీలు మరిన్ని కొట్టాలని మనస్పూర్తిగా కోరుకుంటూ...మిత్రుడు...@శ్రీ

    ReplyDelete
    Replies
    1. ఫాతిమా గారు, వంద పోస్టులు పూర్తి చేసిన శుభసందర్భంలో నా అభినందనలు.. మీ ప్రయాణం ఇలాగే విజయవంతంగా సాగాలని ఆశిస్తున్నాను.

      Delete
    2. శ్రీ గారూ, నా కవితలకు మీ వ్యాఖ్యలు చాలా స్పూర్తినిచ్చాయి.
      మీ అభిమానానికి కృతజ్ఞతలు.

      Delete
    3. చిన్ని గారూ, మీ అభిమానం ఉంటె చాలు ఇలా ఎన్నో రాసేస్తాను.నా కవితలు ఓపిగ్గా చదివే మీకు నా కృతఙ్ఞతలు.

      Delete
  14. This comment has been removed by the author.

    ReplyDelete
  15. ఫాతిమ గారు అతి తక్కువ కాలంలో సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను తీసుకొని వంద పోస్ట్లు రాసి మమ్మల్ని అలోచించేలా చేసిన మీకు అభినందనలు...ముందు ముందు మీరు అనేక సమస్యలను స్పృశించి వాటిని ఎదుర్కొనేందుకు మీకు తోచిన పరిష్కార మార్గాలను చూసిస్తారని అశిస్తున్నాను.

    ReplyDelete