Pages

Saturday, 19 October 2013

ఎప్పుడొస్తావు ?

   ఎప్పుడొస్తావు? 
   తరాలు, మారుతున్నాయి,
   అంతరాలు గోషిస్తున్నాయి. 

   దిగంతాల ఆవలి నుండి,

   నీ ఆగమనం కోసం,
   కాలం ఋతువులను  
   దోసిళ్ళతో  ఎత్తిపోస్తూ ఉంది. 

   కలతలూ ,కన్నీళ్ళూ,

   విభేదాలూ,వైషమ్యాలూ,
   రంగుల రాట్నం లా,
   గిర, గిరా తిరుగుతున్నాయి . 

   ఎదురుచూపుల వెతలనూ,

   కాటిన్యపు కాలాన్నీ,
   కంటికొసల  ఆశల  మెరుపులో  దాచేస్తూ,

   అనంత ఆకాశంలో , 

   నక్షత్రాలనన్నింటినీ
   లేక్కేట్టేసాను. 

   అంబుదిలో 

   అలలనన్నిటినీ 
   పట్టి కట్టేసాను. 

   ఊహల గాలానికి,

   కలల మీనాన్ని  
   ఎరగా వెసాను.

   తలపుల తరువుకు,

   వలపుల నీరుపోస్తూ,
   స్వప్నాల ఎరువు వేసాను. 

   
   ఊహల పందిరికింద,
   ఆశల తీగనై అల్లుకొంటూ,
   కాలానికి కళ్ళెం  వేస్తున్నాను.  

   నీవు రాసిన లేఖని 

   వేయి సార్లు చదివాను,
   వలపురాతలన్నీ వల్లెవేసాను  

   
   నీ అడుగుల సవ్వడి 
   వినబడదేమో అని,
   చడిచేసే నాగుండెను ఆగిపొమ్మన్నాను. 
   14 comments:

 1. తరాలు మారుతూ అంతరాల గోష. కలతలూ, కన్నీళ్ళూ, విభేదాలూ, వైషమ్యాలూ, రంగుల రాట్నంలా, గిరగిరా తిరుగుతూ .... అనంతాకాశంలో, నక్షత్రాలనన్నింటినీ లేక్కేట్టేసి, అంబుదిలో అలలన్నింటినీ కట్టేసి, కాలానికి కళ్ళెం వేస్తున్నాను.
  నీవు రాసిన లేఖని వేల సార్లు చదివి, నీ అడుగుల సవ్వడి వినబడదేమా అని, చడిచేసే నా గుండెను ఆగమన్నాను. ఎప్పుడొస్తావో మరి?

  "ద్రోహీ.." కవిత తరువాత ఊహించని కవిత ఇది. కవయిత్రిని మరో కోణం నుంచి చూసే అవకాశం కలిగింది. నాకు ఎంతగానో నచ్చింది "ఎప్పుడొస్తావు?" కవిత
  అభినందనలు మెరాజ్ గారు!

  ReplyDelete
  Replies
  1. సర్, అక్షరాలలో కసి పెరుగుతుంది అనే మీ హెచ్చరికను స్వీకరించి,
   వేరేకోణం నుండి రాయటానికి ప్రయత్నించాను.
   ధన్యవాదాలు కవిత నచ్చినందుకు.

   Delete
 2. మీ కవితా ప్రవాహానికి జోహార్లు మేడం! మీకంటే ముందు కవితలు పుట్టి తరువాత మీరు పుట్టారనుకుంటా!

  ReplyDelete
  Replies
  1. అహ్మద్ గారూ, ఇలాంటి ప్రశంస కంటే ఇంకేమి కావాలి ఏ కవికైనా.
   మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

   Delete
 3. ఎంత బాగా రాసారు?

  ReplyDelete
  Replies
  1. అనూ,థాంక్స్ మీ నిర్మలమైన మనస్సుకు.

   Delete

 4. "నీవు రాసిన లేఖని
  వేయి సార్లు చదివాను,
  వలపురాతలన్నీ వల్లెవేసాను"
  ఈ వాక్యములోని పదాల అల్లిక "ఊహాలోకము నుంచి ప్రక్కకు లాగి"నట్లు అనిపించింది ....

  మిగతా కవిత మొత్తము ఆద్యంతము, మీరు ఉపయోగించిన పద అల్లిక మీ భావాన్ని అత్యద్బుతముగా ఇనుమడింప చేసింది...

  హైలైట్ చేద్దామని మొదలు పెడితే మళ్ళి మొత్తం కవితని కామెంట్ లో పొందుపరచాల్సి రావడం మూలముగా విరమించుకొన్నాను....

  "నీ అడుగుల సవ్వడి
  వినబడదేమో అని,
  చడిచేసే నాగుండెను ఆగిపొమ్మన్నాను. "
  కాకపోతే ఈ వాక్యము ఇందులో దాగి ఉన్న అమాయకత, వాస్తవికత ... ప్రేమమయమైన మనస్సు యొక్క స్థితికి దర్పణమైన వీటిని బయటకు లాగావలసి వచ్చింది ...... మాటలు కరువాయే....

  ReplyDelete
  Replies
  1. సాగర్ గారూ, మంచి భావుకత కలిగిన కవిగా మరోమారు నిరూపించుకున్నారు.
   నేను కవిత రాసి దానికి చిత్రాన్ని చేర్చిన తర్వాత మీరు చెప్పిన పై వాఖ్యాలను చేర్చాను
   ఎందుకంటే ఆమె చేతిలో లేఖ ఉంది.
   కానీ (అతుకు అతుకుగానే ఉండిపోయింది)మీరు కనిపెట్టేశారు..
   ధన్యవాదాలు.

   Delete
 5. అలరుల , తలిరుల సోయగ
  మలరించెను మదికి హాయి - అద్భుత కవితా
  జలరుహము విరిసె - వలపుల
  తలపులు రసమయ జగతికి తలుపులు తెరిచెన్ .

  ReplyDelete
  Replies
  1. సర్, ధన్యవాదాలు మీ స్పందన ఎంతో సంతోషదాయకం

   Delete
 6. pogadte vastoondi pratisaaree...oka kavithala cheppalani anipistundi..,ekaadadee kavithaa pravaaham?

  ReplyDelete
  Replies
  1. మేడం , సంతో్షంగా ఉంది మీ పొగడ్తకు.

   Delete
 7. అమ్మో గుండె ఆగితే ఎలా?
  అద్భుతంగా ఉంది కవిత.
  చదువుతుంటే గుండె ఒక బీట్ మిస్ అయినట్లుంది.

  ReplyDelete
  Replies
  1. అయ్య్యో..:-))
   బాగుందన్నదుకు ధన్యవాదాలు సర్.

   Delete