Pages

Monday, 28 October 2013

ఎలా?

    

    ఎలా?


    ఆవేదనలు చుట్టుముట్టినప్పుడు,  
    ఆలోచనలు ముసురుకుంటాయి,
    వాటివెనుకే పరుగెడితే,
    పట్టుకొని ప్రశ్నిస్తాయి. 

    రక్తాక్షరాలతో 
    లక్ష్యాన్ని లిఖించుకోను  
    కానీ.... ,
    దు:ఖాన్ని ఒంపుకున్న కలం 
    కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంది. 


    పనికిరాని  పదాలన్నీ కవితలై..,తవికలై.. 
    నన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి,
    చైతన్యం నీకు చేతకాదంటే చెప్పు,
    చదువున్నచోట  చక్కబెట్టుకుంటానని  
    అక్షరం వెక్కిరిస్తుంది. 

    నిప్పుకణికల నినాదాలను 
    గుప్పిట బిగించేమిలాబం?
    అర్దం లేని వాదనలు అన్నం పెట్టవని 
    ఆత్మ ఘోషిస్తుంది,

    మదినిండా సమస్యల రణం రాజుకుంటే,
    కలల దుప్పట్లో కాళ్ళు ముడుచుకోలేను,
    జీర్నించుకోలేని  దు:ఖాన్ని మింగిన గుండె,
    పేలిపోవటానికి సిద్ద్దంగా ఉంది.

    ఆక్రమణల ,అణచివేతల వేలం లో ,
    అబలలు నలిగిపోతుంటే,
    కంటితుడుపు సానుబూతిగా కాదు,
    తెగబడే కత్తికమ్మంటుంది మనస్సు.


    జీవన పొరాటంలో తెగిపడుతున్న 
    భాహువులకు  బాసటగా,
    బ్రతకాలని  హెచ్చరిస్తుంది  వివేకం 
    అందుకే  ఈ  చేయూతనివ్వాలనే  ఆరాటం.


    మోడువారిన  బ్రతుకు చిత్రాలకు 
    చిగురుకుంచనవ్వాలనీ,... 
    ఇనుపముక్కుల  విహంగాలనుండి 
    చిట్టిగువ్వలను  రక్షించుకోవాలనీ....  

14 comments:

 1. ఆవేదనల ఆలోచనల ముసురులు కమ్ముకుని ప్రశ్నిస్తుంటే, పనికిరాని పదాలు కవితలై..,తవికలై.. ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, నిప్పుకణికల నినాదాలు అర్దం లేని వాదనలు అన్నం పెట్టవని ఆత్మ ఘోషిస్తుంటే, మది సమశ్యల రణమై రాజుకుంటుంటే, జీర్ణించుకోలేని దు:ఖం తో గుండె, పేలిపోతుంటే .....
  ఆక్రమణల ,అణచివేతల వేలం లో, నలిగిన అబలల, జీవన పొరాటంలో తెగిపడుతున్న భాహువులకు బాసటగా, మోడువారిన బ్రతుకు చిత్రాలకు చిగురుకుంచనవ్వాలనీ,... చిట్టిగువ్వలను రక్షించుకోవాలనీ....
  కానీ ఎలా?
  ఎన్నో సమాధానాలు వెదుక్కుంటున్న ప్రశ్నలు .... కవయిత్రి ఆశ ఆశయాల బాటలో అడుగడుగునా సవాళ్ళై ..... ప్రతి పాటకుడి లోనూ ఆసక్తిని, ఆలొచనను రేకెత్తిస్తూ ఒక మంచి అభ్యుదయ భావన .... ఈ కవిత
  అభినందనలు మెరాజ్ ఫాతిమా గారు!

  ReplyDelete
  Replies
  1. చంద్ర గారూ, మీరన్నట్లు నా కవిత ఆలోచనలను రేకెత్తించగలిగితే ధన్యురాలిని.
   మీ స్పందన నాకు ప్రేరణ అవుతుంది. సమయాన్ని వెచ్చించి చదివే మీకు నా ధన్యవాదాలు.

   Delete
 2. Great feel.....reflecting Ur desire.....towards da humanity.

  ReplyDelete
  Replies
  1. అనూ, మీ ప్రశంసకు, అభిమానానికీ ధన్యవాదాలు.

   Delete
 3. అనునిత్యం, ఆత్మ శోధన చేసుకునే ఫాతీమా !
  నీవు, నిరంతర సాధన చేసే, ఓ జీవమున్న ప్రతిమ !
  ఆత్మ ఘోష తో, నీ ఘర్షణ
  రగిలిస్తుంది, నీ కవితా జ్వాల !

  దుఃఖం, అశాంతీ ,
  నీ నేస్తాలైతే,
  ఎట్లా పంచగలవు,
  శాంతీ , సుఖం ? ,

  కర్తవ్యం తోనే చైతన్యం !
  కవితల ' వాడి ' తో,
  కోయగలవా, కాఠిన్యం ?
  తీర్చగలవా, అనాధల దైన్యం ?
  ఎదిరించ గలవా, అన్యాయం ?
  వినబడుతుందా 'బధిరుడికి', నీ పాంచ జన్యం ?

  గుండె చప్పుడు చెప్పేదే, కవిత !
  'మండే గుండెల' చప్పుడు ' వినేదే ', మానవత !

  ఉత్తర దక్షిణాల ను బంధిద్దామనుకోకు !
  దిక్కు తెలియక, సంధిగ్దం లో పడబోకు !

  ReplyDelete
  Replies
  1. సర్, మీరన్నది నిజమే "మండే గుండెల చప్పుడు వినేదే మానవత".
   ఆ మానవతే కావాలి దానికే అన్నార్తుల ఆకలికి స్పందించే శక్తి ఉంది.
   దు:ఖం , అశాంతి నీ వదిలించుకోవాలి కర్తవ్యం వైపు అడుగులెయ్యాలి.
   మీ స్పందనకు ధన్యవాదాలు.

   Delete
 4. చక్కటి భావ వ్యక్తీకరణ.
  సరైన పదబంధాల పొందిక.
  అందంగా అమరిన సమరం.
  అభినందనలు !

  ReplyDelete
  Replies
  1. సర్, నా భావాన్ని వ్యక్తీ్కరించటములో నెగ్గితే అంతే చాలు.
   నిజముగా నేను సాగించేది అక్షర సమరమే,
   స్పూర్తినిచ్హే మీ వ్యాఖ్యలకు ధన్యవాదాలు.

   Delete
 5. భావావేశం చాలా చాల అద్బుతముగా వున్నది ....

  కొన్ని వాక్యములు శిఖరాల్ని తాకుతుంటే మరికొన్ని పాతాళంలోకి నెట్టి వేయబడినాయా ? అన్నది నాకు కలిగిన మొదటి భావన ....

  శిఖరాగ్రమున నిలచిన కొన్ని వాక్యములు ..... (కేవలం నా భావన మాత్రమే)

  రక్తాక్షరాలతో
  లక్ష్యాన్ని లిఖించుకోను
  కానీ.... ,
  దు:ఖాన్ని ఒంపుకున్న కలం
  కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంది.

  చైతన్యం నీకు చేతకాదంటే చెప్పు,
  చదువున్నచోట చక్కబెట్టుకుంటానని
  అక్షరం వెక్కిరిస్తుంది

  నిప్పుకణికల నినాదాలను
  గుప్పిట బిగించేమిలాబం?

  మదినిండా సమస్యల రణం రాజుకుంటే,
  కలల దుప్పట్లో కాళ్ళు ముడుచుకోలేను,

  excellent emotion maam..... big claps....
  if the other lines also elevates little bit for the wordings with the same amount of expressions, then it would have been the best poem that I read in recent past....

  ReplyDelete
  Replies
  1. సాగర్ గారూ, నా కవితను శిఖరాగ్రాన ఉంచారుమీరు.
   మీ చేత Best poem అనిపించుకున్నాను చూశారా?
   మీ భావనను అందంగా తెలియజేసిన మీకు నా ధన్యవాదాలు.

   Delete
 6. మెరాజ్ గారు, సుపర్బ్! చాలా బాగుందండి.

  ReplyDelete
  Replies
  1. వెన్నెల గారూ, బాగున్నారా?

   Delete
 7. mee kalam mammalni aalochimpajesidigaa undi. totalgaapost adubutamgaa undi
  http://www.googlefacebook.info/

  ReplyDelete