Pages

Friday, 7 February 2014

కలం సంకెళ్ళను సడలిస్తూ.....

     
   కలం  సంకెళ్ళను  సడలిస్తూ.....,

    విశ్లేషించే  కళ్ళతో ..,
    మూగబోయిన హృదయాలను  గమనిస్తే...,
    పాత్రలేవొ,పాత్రదారులెవ్వరొ, తెలిసిపొతుంది.  

    పరామర్శించాల్సిన  కళ్ళతో...,
    మదనపడే  మనస్సులను  పలకరిస్తే..,
    వెతలేమిటొ,వేదనేమిటో  తెలిసిపొతుంది. 

    మోహానికీ, మోసానికీ మద్య,
    అనిర్వచనీయ  అఘాతాలను గమనిస్తె..,
    నిజాల గొంతు నులిమిన ఇజాలేమిటో తెలిసిపోతుంది.  

    సామాజిక  స్పృహలేని  మురికి పందులు ,
    బ్రతుకు వెలితిని దుర్గందంలో  నింపి,
    ముక్కుల్లో  అత్తరు పోసుకొన్న తీరు తెలుస్తుంది. 

    సుఖాల,సంతోషాల వేటలో..,
    మజిలీలు మార్చే మాయగాళ్ళు..,
    మడుగులో పడిన దుర్యొధనులై...
    నవ్వులను అంతంచేసిన  వైనం తెలుస్తుంది. 

    మనలొనే ... మన మద్యనే  ఉన్న ఎందరో..,
    ముళ్ళై ,మేకులై, పల్లేరులై,గాజుముక్కలై..,
    దారంతా విస్తరిస్తూ,విహరిస్తుంటే...,

    ఎన్నోఅనాథ  శకలాలను వీధులోకి  విసిరేస్తుంటే...,
    పరిష్కారం దొరకని  నా బుర్రవేడెక్కినప్పుడూ..,
    ఆవేశాన్నిపంటి కింద బిగబట్టి,పందిటి గుంజగా ఉండలేక ,
    అప్పుడప్పుడూ  కలం సంకెళ్ళను  సడలిస్తూ ఉంటాను.  20 comments:

 1. ఆలోచనల కాప్ తీసి , ఆవేశాల ఇంకు నింపి , అక్షరాలా కలం సంకెళ్ళు తెంపి , ఆవేదనలకు అక్షర రూపమివ్వడంలో మీకు మీరే సాటి అని నా కలం సాక్షిగా చెప్పడానికి ముందుంటాను మీరజ్ .

  ReplyDelete
  Replies
  1. విశ్లేషించే కళ్ళతో .. మూగబోయిన హృదయాలను గమనిస్తే...,
   పాత్రలేవొ,పాత్రదారులెవ్వరొ, తెలిసిపొతుంది. Chaalaa baagundi fathima gaaru mee kalam rasina Kavita:-)

   Delete
  2. దేవీ, మీరిచ్చిన స్పూర్తి చాలు ముందుకు నడుస్తుంది నా కలం.
   ధన్యవాదాలు మీకు .

   Delete
  3. కార్తిక్ గారూ, ధన్యవాదాలు మీ స్పందనకు.

   Delete
 2. అద్భుతమైన అనంతకోటి భావాలు మీవి...వాటికి సదా శిరస్సువంచి చేస్తున్నా సలాములు....

  ReplyDelete
  Replies
  1. పద్మా, ఓ చిత్రకారిణిగా మీ కుంచె(కలమూ) కలిపే రంగుల్లో ఎన్నో సున్నిత భావాలను చూశాను నేను,
   అంతే సునిసిత పరిశీలనతో నా భావాలకు విలువిచ్చిన మీకు నా వందనాలు.

   Delete
 3. కలం కాదేమో.... మనో వేదన... మౌనం సంకెళ్లు తెంచుకుని బయటపడిందేమో కదా... మెరాజ్ గారు. ఒక్కోసారి అనిపిస్తుంది.
  కలమే లేకపోతే, ఆ రాతలకు ఇలాంటి వేదికలంటూ లేనేలేకపోతే... మహిళల్లో దాగున్న ఇలాంటి అద్భుతమైన భావనలను, చైతన్యాన్ని తెలుసుకుని స్పందించే అదృష్ణ నా లాంటి వాళ్లకు దక్కేది కాదేమో. ఒక సిరా ప్రవాహాన్ని చూశానిక్కడ. సమాజాన్ని సూటిగా తాకే ప్రశ్నల శరాల మొనలను చూస్తున్నాను. మీరిలాగే సంధిస్తూ ఉండండి. ఏదొో ఒకరోజు... సమాజంలో మీరన్న క్యాన్సర్లు ఇలాంటి శరాఘాతాలతోనే తునాతునాకలవుతాయి.

  ReplyDelete
  Replies
  1. సతీష్ గారూ, ఒక సిరాచుక్కలో ఉన్న వేదనను గుండెకు హత్తుకున్న కాగితాన్ని,(భావాన్ని) చదవగలిగే మనస్సు మీకుంది,
   మీలాంటి చైతన్యాన్ని కోరే వాళ్ళు చదవటం నా అదృష్టం.
   సమాజ కాయానికి ఇలాంటి గాయాలెన్నో...విలేఖరి వృత్తిలో ఉన్న మీకు తెలియనివి కావు.
   ధన్యవాదాలు మీ స్పందనకు.

   Delete
 4. కలం కదిలించేది , చదివే కళ్ళనే !
  హాలాహలం నిండిన 'ముళ్ళ ను ' కాదు !
  సంకెళ్ళు విదిలించినా,
  కలం, అన్యాయం , అక్రమాల మొదళ్ళు కదిలించేనా ?!

  ReplyDelete
  Replies
  1. సర్, మీరన్నది నిజమే...కానీ మందు చేదుగా ఉన్నా తినాలి(తినిపించాలి) తప్పదు, ఈ విషయం మీకే బాగా తెలుసు.
   కలానికి అక్రమాల మొదళ్ళను కదిలించే శక్తి ఉంది, అని నేను నమ్ముతాను. మీ వంటి వారి స్పందనలు నా కా దైర్యాన్నిస్తాయి.

   Delete
 5. కొన్ని పాత్రలు పాత్రదారులెవ్వరో తెలుసుకునేందుకు విశ్లేషించే కళ్ళు, వెతల వేదనలు తెలుసుకునేందుకు పరామర్శించే కళ్ళు...అవసరం అనిపిస్తుంది,
  సుఖ, సంతోషాల వేటలో.., మజిలీలు మార్చే మాయగాళ్ళు.., మడుగులో పడిన దుర్యొధనులు, మనలొ ... మన మద్యనే ఎందరో.., ముళ్ళై, మేకులై, పల్లేరులై, గాజుముక్కలై.., విస్తరించి, విహరిస్తూ..., ఎన్నోఅనాథ శకలాలను వీధులోకి విసిరేస్తుంటే..., వేడెక్కిన బుర్ర పరిష్కాఏం దొరక్క వేడెక్కి.., ఆవేశం పంటి కింద, పందిటి గుంజగా ఉండలేక, అప్పుడప్పుడూ మది కలం సంకెళ్ళను సడలిస్తుండటం తప్పనిసరౌతుంది....
  చక్కని భావన ఆశయాలు ఆదర్శాల నిబద్దతను కోరుకునే మనోఘోషను వింటూ చదువుతున్నట్లుంది.
  అభినందనలు కవయిత్రీ జీ! శుభోదయం!!

  ReplyDelete
  Replies
  1. సర్, నిజంగానే ఇది మనోఘోష ,కలానికున్న లిమిటేషన్‌ కొంత ఆపేస్తుంది, కానీ మనస్సులో ఇంకా ఏదో రాయలేకపోయానే అనే బాద ఉంది.
   ఇంకా రాయగలనూ అనే దైర్యం మీ స్పందన ఇస్తుంది, ధన్యవాదాలు మీకు.

   Delete
 6. మోదానికి, ప్రమాదానికి మధ్య ప్రమదలు జాగరూకత వహించాలంటే ఇలాంటి కలం పోట్లు ఇంకా ఎన్నో రావాలి.

  ReplyDelete
  Replies
  1. మీ ఆశీస్సులు ఉన్నంత వరకూ నా ఈ కలం పోట్లు ఉంటాయి.
   నన్ను ప్రతి పదాన ప్రోత్సాహించి ముందుకు నడిపే మీకు నా వందనాలు సర్.

   Delete
 7. అమ్మో ఎన్ని స్ఫూర్తిదాయక భావోధ్రేకాలో....

  ReplyDelete
  Replies
  1. నా బ్లాగ్ కి స్వాగతమండీ...ధన్యవాదాలు మీ స్పందనకు.

   Delete
 8. "పరామర్శించాల్సిన కళ్ళతో...,
  మదనపడే మనస్సులను పలకరిస్తే..,
  వెతలేమిటొ,వేదనేమిటో తెలిసిపొతుంది. "

  అద్భుతం ... అమోఘం ...
  ఇంతకన్నా మరేం రాయను .
  ఇంత మంచి ఆలోచనలను మీ కలం ద్వారా కొందరి నైనా మార్చ గలుగుతున్నారనె ప్రఘాడమైన నమ్మకం నాకుంది.
  అందుకోండి అభినందనల మాల ఫాతిమా జి. Super !
  శ్రీపాద

  ReplyDelete
  Replies
  1. శ్రీపాద గారూ, ఇంతమంచి కామెంట్ అందుకున్నాక ఎంత ఆనందమో కదా...,
   మీరన్నట్లు ఒక్కరినైనా నా కవితలు మార్చగలిగితే నా జన్మ ధన్యం.

   Delete